గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ లో ఏపీకి చెందిన వల్లూరి అజయ్ బాబు నూతన చరిత్ర సృష్టించాడు. విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల ఈ యువ వెయిట్‌లిఫ్టర్ పురుషుల 79 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో ఒక కిలో తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకోవడం కొంత నిరాశను కలిగించినప్పటికీ.. తన అద్భుత ప్రదర్శనతో చెరగని ముద్ర వేశాడు.
వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో అజయ్ బాబు మొత్తం 330 కిలోల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో స్నాచ్- 149, క్లీన్ అండ్ జెర్క్-181 కిలోలు ఉన్నాయి. కేవలం ఒక్క కిలో తేడాతో మలేషియాకు చెందిన ఎర్రీ హిదాయత్ మహమ్మద్ బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. మొత్తం 331 కిలోల బరువును ఎత్తాడు హిదాయత్. ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కిలోలతో కాంస్య పతకం సాధించాడు.
పోటీ ప్రారంభంలో స్నాచ్ విభాగంలో అజయ్ బాబు తొలి రౌండ్‌లో 145 కిలోల బరువును ఎత్తాడు. రెండో ప్రయత్నంలో 149 కిలోలు ఎత్తలేకపోయాడు. ఒత్తిడికి గురయ్యాడు. మూడో ప్రయత్నంలో పట్టు వదల్లేదు. ఆ బరువును ఎత్తి కామన్వెల్త్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో కూడా చివరి నిమిషం వరకు మలేషియా లిఫ్టర్ మహమ్మద్‌తో హోరాహోరీగా తలపడి రజత పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కొండవెలగాడకు వెయిట్‌లిఫ్టింగ్ కు పెట్టింది పేరు. స్థానికంగా బండలు ఎత్తే సంస్కృతం ఇక్కడి యువత నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్‌గా రాణించడం దీనికి నిదర్శనం. 2010లో ఢిల్లీ కామన్వెల్త్ లో 56 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే కామన్వెల్త్ గేమ్స్ లో రజతాన్ని సాధించి, తండ్రిని మించిన తనయుడని అనిపించుకున్నాడు. తండ్రి మొదటి గురువుగా భావించాడు అజయ్ బాబు. ఆయన అందించిన ప్రోత్సాహం, ప్రాథమిక శిక్షణతోనే ఈ స్థాయికి చేరుకున్నాడు. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత కొడుకు తన తండ్రి కంటే ఒక అడుగు ముందుకు వేసి రజత పతకంతో మెరిశాడు. పూల సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించే శ్రీనివాసరావుకు తన కుమారుడు సాధించిన ఈ ఘనత అమితమైన సంతోషాన్ని ఇచ్చింది. ఒకే కుటుంబం నుంచి రెండు తరాల ఆటగాళ్లు దేశానికి కామన్వెల్త్ పతకాలు అందించారు. తండ్రి అందించిన స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని, గ్రామీణ నేపథ్యం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు అజయ్ బాబు సాగించిన ప్రయాణం ఎందరో యువ అథ్లెట్లకు ఆదర్శంగా నిలుస్తుంది. 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని సాధించాడు అజయ్ బాబు. ఫిజీ పోటీలలోనూ తన సత్తా చాటాడు. అదే దూకుడును ఇక్కడా కొనసాగించాడు. దేశ ప్రతిష్టను నిలబెట్టాడు. ప్రస్తుతం వెయిట్‌లిఫ్టింగ్ టీమ్ గ్లాస్గోలో అద్భుతంగా రాణిస్తోంది. ఈ కామన్వెల్త్ లో భారత్ కు లభించిన ఆరో పతకం ఇది.రేపే గురు పూర్ణిమ: 56 ఏళ్ల తర్వాత- డోంట్ మిస్: ఈ పనులు చేయండి చాలు
బ్రహ్మోత్సవాల లోపు తిరుమలలో అత్యాధునికంగా అందుబాటులో