టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ - బీసీసీఐ నిర్ణయం వెనుక..!!

బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించేందు కు రంగం సిద్దమైంది. త్వరలో ప్రారంభం కానున్న భారత్ జింబాబ్వే పర్యటనతో పాటుగా ఆసియా క్రీడల కోసం లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం గంభీర్ కోచ్ గా ఉన్నారు. వరుస సిరీస్ లతో బిజీ షెడ్యూల్ వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గా లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ఇంగ్లండ్ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ కు బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, బౌలింగ్ కోచ్ సునీల్ జోషి సహకారం అందించనున్నారు. ఇంగ్లాడ్ టూర్ లో ఉన్న టీమిండియా ప్రస్తుతం అయిదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతోంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో భారత్ ను ఓడించి.. వరుసగా రెండో విజయం సాధించింది. తరువాత మూడు వన్డేల సిరీస్ కు టీం ఇండియా సిద్దం అవుతోంది. ఇక.. జూలై 23వ తేదీ నుంచి 26వ కు జింబాబ్వేలో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ టీం ఇండియా ఆడనుంది. కాగా, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇదే సమయంలో భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ కూడా ఉండటంతో.. గౌతమ్ గంభీర్ సీనియర్ జట్టుతోనే కొనసాగనున్నారని తెలుస్తోంది.

Advertisement

బీసీసీఐ వ్యూహాత్మక నిర్ణయం

ఈ సమయంలో జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడల బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించా లని బీసీసీఐ భావిస్తున్నతెలుస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి 19 వరకు అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుండంది. అదే విధంగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు ఆసియా క్రీడల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఇక, వెస్టిండీస్‌తో భారత్ వన్డే, టీ20 సిరీస్‌లు కూడా ఆడనుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉంటాయి. జట్టుకు కోచ్‌గా ఉండటం వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇదే మొదటిసారి కాదు. 2022 లో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో భారత జట్టును కోచ్ గా నడిపించారు. జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

English Summary

VVS Laxman will spearhead India's coaching staff for the upcoming Zimbabwe T20I series and the Asian Games