వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న అచ్చెన్న, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి..కరోనా అంటించింది జగన్ సర్కారే:చంద్రబాబు, లోకేశ్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చిందులేశారు. మొన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా అంటించారని మండిపడ్డారు. ఇద్దరు నేతలకు వైరస్.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సోకిందని విమర్శించారు. చంద్రబాబు ట్వీట్లతో విమర్శలు చేయగా.. లోకేశ్ కూడా స్పందించారు. సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు.

24 గంటల్లో అరెస్ట్ చేయడంతో..


జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా వైరస్ రావడంపై చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. బస్సుల కేసుల్లో బెయిల్ మీద విడుదలయిన 24 గంటల్లో అరెస్ట్ చేయడంతో కరోనా వచ్చిందన్నారు. కరోనా నిబంధనలు అని, సీఐతో కేసు పెట్టించి వేధించారని గుర్తుచేశారు. తిరిగి జైలుకు తరలించడంతో ఆయనకు కరోనా వైరస్ సోకిందని గుర్తుచేశారు. దోపిడీ దొంగలు.. ప్రజల నుంచి వచ్చిన నేతలకు తేడా తెలియదా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడ్డారని తెలిపారు.

అచ్చెన్నాయుడు కూడా ఇలాగే..

జేసీ ప్రభాకర్ రెడ్డి కాదు.. మొన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడు కూడా కరోనా బారిన పడ్డారని తెలిపారు. అందుకు కారణం కూడా ప్రభుత్వమేనని ఆరోపించారు. కరోనా వైరస్ ఇంతగా ప్రబలుతుంటే నేతల పట్ల ఇంత బాధ్యతరహిత్యంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. ఇందులో ప్రభుత్వ దురుద్దేశం దాగి ఉందన్నారు. నేతల ప్రాణాలు తీయాలనే కుట్రతోనే ఇలా చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందజేయాలని డిమాండ్ చేశారు.

ఒక్క ఛాన్స్ ప్రజల కోసం కాదు.. ఇందుకే

మరోవైపు నారా లోకేశ్ కూడా మండిపడ్డారు. ఎన్నికలకు ముందు జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ప్రజల కోసం కాదన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి అడిగారని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ మీద రిలీజయిన తరవాత.. 24 గంటల్లో కేసు అంటూ అరెస్ట్ చేయడం ఏమీటన్నారు. జైలులోనే ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడ్డారని తెలిపారు. కడప జైలులో చాలా మందికి వైరస్ సోకిందని గుర్తుచేశారు.

నేర మనస్తత్వంతో కరోనా వైరస్ సోకింది...

సీఎం జగన్ నేర మనస్తత్వమే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా వైరస్ సోకడానికి కారణమైందని లోకేశ్ ఆరోపించారు. లేదంటే ఆయనకు వైరస్ సోకేదీ కాదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

English summary
jc Prabhakar Reddy infected coronavirus due to andhra pradesh government actions chandrababu naidu alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X