AI తో తలనొప్పి- ఆ విషయం కలచివేస్తోంది: సత్య నాదెళ్ల
Microsoft Satya Nadella: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి.
మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా లేఆఫ్స్ ను తెర మీదికి తెచ్చింది. 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ విడతలో కూడా వేల సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పెట్టింది. ఈ సంవత్సర కాలంలో ఇది మైక్రోసాఫ్ట్ చేపట్టిన మూడో విడత లేఆఫ్స్ ఇవి.

సేల్స్ డివిజన్ లో ఎక్కువ కోతలు కనిపించాయి. అలాగే- ఎక్స్ బాక్స్ వీడియో డివిజన్ లోనూ పెద్ద ఎత్తున కోత పడింది. ఈ నెల 30వ తేదీ నాటికి ఉద్యోగుల తొలగింపు, పునర్వ్యవస్థీకరణ పూర్తి కానుంది. ఈ ఏడాది మే నెలలో సుమారు 6,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న మానవ వనరులతో పోల్చుకుంటే ఇది సుమారు మూడు శాతం. దీని తరువాత మరో భారీ లేఆఫ్ ఇదే. మే నెలలో చోటు చేసుకున్న తొలగింపులు- ఇంజినీరింగ్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాలపై ప్రభావం చూపాయి.
AI-ఆధారిత ఆటోమేషన్ వైపు కంపెనీ యాజమాన్యం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. దీనికి అనుగుణంగా మానవ వనరులను తగ్గించుకోవచ్చని బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. ఈ పునర్వ్యవస్థీకరణ- టెక్ రంగంలో విస్తృతంగా ఉంటోంది. ఏఐ ఆటోమేషన్ పై పూర్తిస్థాయిలో ఆధారపడే పరిస్థితికి వచ్చాయి.
కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచడానికి, వర్క్ ఫ్లోను క్రమబద్ధీకరించడానికి, సంప్రదాయ మ్యాన్ పవర్ పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటోన్నాయి. ప్రత్యేకించి- సేల్స్, కస్టమర్ సపోర్ట్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాలలో జనరేటివ్ ఏఐ మోడళ్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
ఈ పరిణామాలపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ఇటీవల ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూనే మార్పుల వల్ల ఉద్యోగులపై పడే భారాన్ని గురించి కూడా మాట్లాడారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకుంటోన్న నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనలను అర్థం చేసుకోగలనని అన్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు విడతల్లో దాదాపు 15,000 మందిని తొలగించామని, దీని ప్రభావం తనపై కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో తొలగించిన 9,000 మంది ఉద్యోగుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఉద్యోగాల తొలగింపు తనను ఎంతగానో కలచివేసిందని వ్యాఖ్యానించారు.
2024 జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల సంఖ్య 2,28,000 మంది ఉండగా, 2025లో ఉద్యోగుల తొలగింపుల తరువాత కూడా ఆ సంఖ్య స్థిరంగానే ఉందని వివరించారు. ఫ్రాంచైజ్ విలువ లేని పరిశ్రమలో విజయం సాధించడం ఒక విచిత్రమైన అనుభవం అని వ్యాఖ్యానించారాయన.
సంస్థ పురోగతి ఎప్పుడూ ఒకేలా ఉండదని, డైనమిక్‌గా కొనసాగుతుంటుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మనకు కొత్త అవకాశాలను ఇస్తుందని, గతంలో కంటే సమర్థవంతంగా ఐటీ రంగం ఎదగడానికి ఈ పరిణామాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
గత పదేళ్లుగా మైక్రోసాఫ్ట్ లక్ష్యం ప్రతి ఒక్క వ్యక్తికి, సంస్థకు మరింత పురోగతి సాధించేలా ప్రోత్సహించడమేనని సత్య నాదెళ్ల అన్నారు. ఈ AI యుగంలో ఈ లక్ష్యాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ యుగంలో సాధికారత అంటే ఏమిటో పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
టెక్ రంగంలో చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 2025లో ఇప్పటివరకు 80,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. కృత్రిమ మేధస్సు ఆధారితంగా కంపెనీలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడమే దీనికి ప్రధాన కారణం. రిక్రూట్ హోల్డింగ్స్ కూడా ఇటీవల తమ హెచ్ ఆర్ టెక్ విభాగంలో 1,300 మంది ఉద్యోగులను తొలగించింది. దీనికి AI కారణం.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications