ఈ స్కిల్స్ నేర్చుకుంటే AI జాబ్ పక్కా - భారీ వేతనాలు..!!
AI - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ రంగంలో చూసినా ఏఐ విస్తరి స్తోంది. ప్రభుత్వాలకు ఏఐ ఆధారిత సేవలు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఏఐ ద్వారా ఉద్యోగాలు కోల్పోతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. అదే సమయంలో ఏఐ దే భవిష్యత్ అని నిర్ధారణ కావటంతో.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ప్రాధాన్యత పెరుగుతోంది. ఏఐ లో నిర్దేశించిన స్కిల్స్ నేర్చుకుంటే.. ఉద్యోగం తో పాటుగా భారీ వేతనాలు ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం అన్ని ప్రధాన రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఏఐ ప్రపంచ రూపురేఖలను మార్చేస్తోంది. దీంతో, మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ స్కిల్స్ లో నైపుణ్యం సాధిస్తే లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ రంగానికి ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది. అన్ని ప్రధాన రంగాల్లోనూ ఏఐ ప్రభావం కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వాలు సైతం ఏఐ మీద ఫోకస్ చేస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయం వంటి రంగాల్లోనూ ఏఐ హవా కొనసాగుతోంది. ప్రయివేటుతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఏఐ ఆధారిత సేవలు విస్తరిస్తున్నాయి. ఏఐ మార్కెట్ 2027 నాటికి 25 నుంచి 35 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా.

దీంతో, మన దేశంలో 2027 నాటికి దేశంలో ఏఐ నైపుణ్యం కలిగినవారి డిమాండ్ 6-6.5 లక్షల నుంచి 12.5 లక్షలకు పెరుగుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం భారత్ లో 43 శాతం మంది ఏఐని పలు సంస్థల్లో వినియోగించారు. అంటే 60 శాతం మంది ఉద్యోగులు ఏఐ వినియోగం కొనసాగిస్తున్నారు. దీంతో, జావా, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ స్కిల్స్ వంటి కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్సు కు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కృత్రిమ మేధ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగం ఖాయమని పేర్కొంటున్నారు. 2030 నాటికి ఇండియా గ్లోబల్ ఏఐ పవర్‌హౌస్‌గా మారుతుందని ప్రపంచ స్థాయి నిపుణులు అంచనా వేస్తున్నారు. అందునా ఏఐ రంగంలో భారతీయ యువత చూపిస్తున్న ఆసక్తితో వచ్చే రెండు, మూడేళ్ల కాలంలో భారతీయులే ఈ రంగాన్ని శాసించే స్థాయికి వెళ్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications