National Help Line Number
+91-11-23978046
Toll Free No: 1075

Coronavirus FAQs After Lockdown

Oneindia
సాధారణ ప్రశ్నలు
    • రైలులో ప్రయాణించే సమయంలో మాస్కు తప్పనిసరిగా ధరించాలా..?
      అవును. రైలులో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలి. లేదంటే శిక్ష తప్పదు
    • టికెట్ వెయిటింగ్‌లిస్టులో వస్తే ఆ ప్రయాణికుడు రైలులో ప్రయాణం చేయొచ్చా..?
      లేదు. కరోనా లక్షణాలు లేని ప్రయాణికుల వద్ద కన్ఫార్మ్ టికెట్ ఉంటేనే రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు
    • ప్రయాణం సమయంలో రైల్వేలు పడకలు, దుప్పట్లు ఏర్పాటు చేస్తారా..?
      లేదు. కోవిడ్ కేసుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ సేవలను నిషేధించారు.
    • గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమేనా..?
      మీ వైద్యుడి సలహాను తీసుకోండి
    • దీర్ఘకాలిక జబ్బులు అంటే మధుమేహం, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధి ఉన్నవారికి ఐసీఎంఆర్ ఎలాంటి సలహాలు ఇస్తోంది..?
      దీర్ఘకాలిక జబ్బులు అంటే మధుమేహం, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహామేరకు కోవిడ్‌కు ముందు ఎలా అయితే మందులు వాడుతున్నారో స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ అవే మందులను కొనసాగించాలని సూచిస్తోంది
    • ఎలాంటి సమయంలో దీర్ఘకాలిక జబ్బులకు వాడుతున్న మందులు నిలిపివేయాలి..?
      వైద్యులు మందులు తీసుకోవడం ఆపివేయాలని చెప్పేవరకు వాటిని కొనసాగించొచ్చు
    • మధుమేహం ఉన్నవారు కరోనాబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా..?
      సాధారణంగా నియంత్రణలో లేని మధుమేహంతో బాధపడుతున్న వారు అన్ని ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలున్నాయి. అలానే డయాబెటిస్ ఉన్నవారు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం లేదని చెప్పలేం. అయితే ఒక్కసారి కోవిడ్ బారిన పడితే అది తీవ్రంగా మారి మనిషి ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.
    • బీపీకి తీసుకుంటున్న మందులు కోవిడ్-19 తీవ్రతను పెంచుతాయా..?
      ఐసీఎంఆర్ చేసిన పరిశోదనల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు
    • కోవిడ్ -19 సోకితే నొప్పికోసం వాడే మాత్రల గురించి ఐసీఎంఎస్ ఏం చెబుతోంది..?
      డాక్టర్ సలహా మేరకే పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలని సూచిస్తోంది
    • ఐసీఎంఆర్ ప్రకారం ఏ పెయిన్ కిల్లర్ సురక్షితమైనది..?
      నొప్పులకు పారాసిటామాల్ చాలా సురక్షితమని ఐసీఎంఆర్ సూచిస్తోంది.
    • భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఎంతకు లభిస్తుంది..?
      డోసుకు రూ. 1200కు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కొవాగ్జిన్ లభిస్తుంది
    • రాష్ట్ర ప్రభుత్వాలకు కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్‌ ఎంతకు అమ్ముతోంది..?
      ఒక్క డోసు రూ.600కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు భారత్ బయోటెక్ అమ్ముతోంది
    • కేంద్ర ప్రభుత్వానికి కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ ఎంతకు విక్రయిస్తోంది..?
      కేంద్ర ప్రభుత్వానికి కొవాగ్జిన్ టీకా డోసు రూ.150కి భారత్ బయోటెక్ విక్రయిస్తోంది. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, సీనియర్ సిటిజెన్స్‌కు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం టీకాను అందిస్తోంది
    • ఇతర దేశాలకు కొవాగ్జిన్ సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ విధించిన రేటు ఎంత..?
      ఒక్క డోసుకు $15 - $20
    • రెమ్‌డెసివిర్ డ్రగ్‌ ఎప్పుడు ఎలా వాడాలి..?
      కరోనా లక్షణాలు కనిపించిన 10 రోజుల్లోగా వ్యాధి తీవ్రతను బట్టి రెమ్‌డెసివిర్ డ్రగ్ ఇవ్వాలి
    • 10 రోజుల వరకు కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తికి రెమ్‌డెసివిర్ ఇవ్వొచ్చా..?
      వ్యాధి త్రీవత ఎక్కువగా ఉండి హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయి ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నవారికి రెమ్‌డెసివిర్ ఇవ్వాలి. ఇంట్లో ఐసొలేషన్‌లో ఉన్నవారికి రెమ్‌డెసివిర్ ఇవ్వకూడదు.
    • రెమ్‌డెసివిర్ ఇవ్వడం లేదంటే ఏదైనా జబ్బు ఉండటం వల్లే అని భావించొచ్చా..?
      మూత్రపిండ సమస్యలు కాలేయ సమస్యలు ఉన్నవారికి ఇవ్వకూడదు
    • ఎవరికి ఎప్పుడు ప్లాస్మా థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది..?
      కరోనా లక్షణాలు కనిపించిన వారం రోజుల్లోగా ప్లాస్మా థెరపీ ఇవ్వొచ్చు
    • టోసిలిజుమాబ్ అనే మెడిసిన్ ఎలాంటి సందర్భాల్లో ఇవ్వొచ్చు.?
      చాలా వ్యాధులకు టోసిలిజుమాబ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది కచ్చితంగా వైద్యులను సంప్రదించాకే వారి సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఐసీయూలో అడ్మిట్ అయిన వారికి 24 నుంచి 48 గంటల్లోగా ఇవ్వాల్సి ఉంటుంది
    • వ్యాధి లక్షణాల తీవ్రత తక్కువగా ఉందని ఎలా గుర్తించాలి..?
      దగ్గు, తుమ్ములు, లేదా జ్వరం వస్తే వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉండదని అనుకోవాలి. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించాలి
    • ఇంట్లో చికిత్సకు మార్గదర్శకాలు ఏంటి..?
      ఇంట్లో ఉండి తీవ్రత స్వల్పంగా ఉన్నవారు తమ డాక్టరుతో సంప్రదించాలి.భౌతిక దూరం పాటిస్తూ ఇంట్లో కూడా మాస్కులు ధరించాలి. శరీర ఉష్ణోగ్రతతో పాటు ఆక్సిజన్‌ లెవెల్స్ పై కూడా దృష్టి సారించాలి. లక్షణాల తీవ్రతను బట్టి యాంటీబైటిక్స్, మల్టీ విటమిన్స్ తీసుకోవాలి
    • పేషెంట్ వైద్య సహకారం పొందడం లేదా హాస్పిటల్‌లో ఎప్పుడు చేరాలి..?
      శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం, తీవ్రమైన దగ్గు వచ్చి ఐదు రోజులైనప్పటికీ తగ్గకపోతే వెంటనే హాస్పిటల్‌లో చేరాలి
    • హాస్పిటల్‌లో ఎవరు అడ్మిట్ కావాలి..?
      60 ఏళ్లు పైబడి, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, హైపర్ టెన్షన్, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ, లివర్ డిజీస్, ఒబెసిటీ, మెదడు సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కరోనా వస్తే వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలి.
    • కొవిషీల్డ్ టీకా కొత్త ధరను సీరం ఇన్స్‌టిట్యూట్ ఎందుకు ప్రకటించింది..?
      మే 1వ తేదీ నుంచి 18ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 50శాతం వ్యాక్సిన్‌లు బహిరంగ మార్కెట్‌లో అమ్మడం జరుగుతుంది
    • కొత్త విధానం ప్రకారం కొవిషీల్డ్ ధర ఎంత?
      ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఒక డోసు రూ.300 ఉంటుండగా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అది రూ.600గా ఉంటుంది. అయితే ప్రభుత్వం ఒక డోసుకు రూ.600 వెచ్చిస్తుండగా.. ప్రైవేట్ హాస్పిటల్స్ రూ.1200 ఒక డోసుకు వెచ్చిస్తున్నాయి
    • మే 1 తర్వాత టీకా ధరను ఎవరు భరించాల్సి ఉంటుంది..?
      18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్నవారికి, 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం ఉచితంగా టీకాలను అందిస్తుంది
    • రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ కొనుగోలు చేసే ధరనే నేను కూడా చెల్లించాల్సి ఉంటుందా..?
      టీకా ధరను ఎవరికి ఎంత విధించాలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. వ్యాక్సినేషన్ ఛార్జీలను ప్రైవేట్ హాస్పిటల్స్ లాభంతో అమ్ముతాయి‌
    • ఫార్మసీలో వ్యాక్సిన్ దొరుకుతుందా.?
      దొరకదు
    • మే నెల మొదటి వారంలో కొవిషీల్డ్ టీకా లభిస్తుందా..?
      ప్రైవేట్ హాస్పిటల్స్‌లో మే 3వ వారం నుంచి లభిస్తుంది
    • వ్యాక్సినేషన్‌కు నేను అర్హుడనా..?
      18 ఏళ్లు లేదా ఆ పై బడి వయసున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ తీసుకోవచ్చు. మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరగుతుంది
    • ప్రస్తుతం ఏ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి..?
      కొవాగ్జిన్, కొవీషీల్డ్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి
    • స్పుత్నిక్ వీ అందుబాటులో ఉందా..?
      ప్రస్తుతం అత్యవసర వినియోగం కోసం మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి వచ్చే తేదీని ప్రకటిస్తుంది
    • కోవిడ్-19 టీకా ఏ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉంటుందో ప్రభుత్వం ఆ హాస్పిటల్స్ జాబితాను ప్రకటించిందా..?
      రానున్న రోజుల్లో కోవిడ్ టీకా అందుబాటులో ఉండే హాస్పిటల్స్ జాబితాను ప్రభుత్వం ప్రకటిస్తుంది
    • కరోనావైరస్‌ కట్టడికి ఎన్ని వ్యాక్సిన్‌లకు ఆమోదం లభించింది..?
      మొత్తం మూడు టీకాలకు ఆమోదం దక్కింది. ఆక్స్‌ఫర్డ్ -ఆస్ట్రా జెనెకాకు చెందిన కోవిషీల్డ్. దీన్ని సీరం ఇన్స్‌టిట్యూట్ తయారు చేస్తోంది. భారత్ బయోటెక్ తయారు చేస్తోన్న కొవాగ్జిన్ కాగా తాజాగా రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ టీకాకు ఆమోదం లభించింది
    • స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు భారత్‌లో ఆమోదం లభించిందా..?
      అవును
    • భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఏ అధికారిక సంస్థ ఆమోదం తెలిపింది..?
      డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)
    • స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఎక్కడ అభివృద్ధి చేశారు..?
      రష్యాలోని మాస్కోలో ఉన్న గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ మరియు మైక్రోబయాలజీ సంస్థ స్పుత్నిక్ వీ టీకాను అభివృద్ధి చేసింది.
    • భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఎక్కడ తయారు చేస్తున్నారు..?
      రష్యా కంపెనీ భారత ఫార్మా దిగ్గజ సంస్థ డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి సంయుక్తంగా స్పుత్నిక్ వీని అభివృద్ధి చేస్తోంది
    • కోవిడ్-19 టీకా స్పుత్నిక్ వీ ని నిల్వఉంచేందుకు ఎంత ఉష్ణోగ్రత ఉండాలి..?
      2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య నిల్వ ఉంచాలి
    • స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచేందుకు కోల్డ్ చైన్ అవసరమా..?
      అవసరం లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్‌లో ఈ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచొచ్చు.
    • స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఒక వ్యక్తికి ఎన్ని డోసులు ఇవ్వాల్సి ఉంటుంది..?
      రెండు డోసులు,ఒక డోసుకు మరో డోసుకు 21 రోజుల గ్యాప్ ఉండాలి
    • రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ఏ మేరకు కచ్చితత్వంతో ఉంది..?
      ట్రయల్స్ సందర్భంగా 91.5శాతం మేరా కచ్చితత్వంతో పనిచేసింది
    • స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌తో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా..?
      0.1శాతం కేసుల్లో మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు రష్యా వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి
    • భారత్‌లో ఒక్క డోసు స్పుత్నిక్ వీ టీకా ధర ఎంత..?
      స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసు ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఇతర దేశాల్లో మాత్రం ఒక్క డోసు ఖరీదు 10 అమెరికన్ డాలర్లు.
    • కర్నాటకలో జిమ్ ఓపెన్ చేసుకోవచ్చా?
      జిమ్ 50శాతం మందితో మాత్రమే తెరుచుకోవచ్చు
    • కోవిడ్ టెస్టులు తప్పనిసరి చేసిన రాష్ట్రాలేవి..?
      మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, అస్సాం, మేఘాలయా, మిజోరాం, ఒడిషా, త్రిపురా, జమ్మూకశ్మీర్,లద్దాఖ్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులు
    • మధ్యప్రదేశ్‌లో ఏడు రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరా..?
      ఇతర రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్‌కు వచ్చేవారు ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలి. భోపాల్, ఇండోర్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడం జరిగింది
    • తమిళనాడులోకి ప్రవేశించాలంటే ఈ-పాస్ తప్పనిసరిగా తీసుకోవాలా..?
      ఓవర్సీస్, మరియు ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వస్తున్నట్లయితే ఈ-పాస్‌ తప్పనిసరి. అయితే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వస్తున్నవారికి ఈ-పాస్ మినహాయింపు ఉంది.
    • గుజరాత్‌కు వెళ్లాలంటే కోవిడ్ టెస్టు తప్పనిసరి చేసిందా..?
      ఇతర రాష్ట్రాల నుంచి గుజరాత్‌కు వచ్చేవారు కోవిడ్-19 RT-PCR టెస్టు రిపోర్టును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి మాత్రమే ఈ నిబంధన వర్తించేది
    • బెంగళూరులో ప్రవేశించాలంటే RT-PCR టెస్టు నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందా.?
      ఏప్రిల్ 1 నుంచి మీరు బెంగళూరుకు వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా RT-PCR టెస్టు నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది
    • ఏ రాష్ట్రాల్లో ప్రవేశాలపై నిషేధం లేదా ఆంక్షలు లేవు..?
      గోవా, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రవేశించాలంటే ఎలాంటి ఆంక్షలు లేదా నిబంధనలు లేవు
    • లద్దాఖ్‌కు వెళ్లాలంటే కోవిడ్ టెస్టులు అవసరమా..?
      లద్ధాఖ్‌కు వచ్చే వారు కనీసం 72 గంటల ముందు కోవిడ్ టెస్టు చేసుకుని నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది
    • ఢిల్లీలోకి ప్రవేశించాలంటే కోవిడ్ -19 టెస్టులు అవసరమా..?
      కోవిడ్-19 టెస్టులు అవసరం లేదు. అయితే ఢిల్లీలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారు
    • గుజరాత్‌కు వస్తున్న వారు RT-PCR నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందా..?
      ఏప్రిల్ 1 నుంచి ఇతర రాష్ట్రాల నుంచి గుజరాత్ రాష్ట్రంకు వస్తున్నట్లయితే తప్పనిసరిగా RT-PCR నెగిటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది
    • మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించారా..?
      అవును, 28 మార్చి 2021 నుంచి మహారాష్ట్రలో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించడం జరుగుతుంది
    • మహారాష్ట్రలో రాత్రివేళ కర్ఫ్యూ టైమింగ్స్ ఏంటి..?
      రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు
    • నైట్ కర్ఫ్యూ సమయంలో మహారాష్ట్రలో షాపింగ్ మాల్స్ తెరిచే ఉంటాయా..?
      రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు షాపింగ్ మాల్స్ మూసి ఉంటాయి
    • నైట్ కర్ఫ్యూ సమయంలో మహారాష్ట్రలో వాహనాలు తిరుగుతాయా..?
      అవును వాహనాలు తిరుగుతాయి. అయితే ఐదుమంది కంటే ఎక్కువగా ఒకే చోట గుమికూడటంపై నిషేధం ఉంది
    • మహారాష్ట్రలో మరో లాక్‌డౌన్ ఉంటుందా..?
      ఇప్పటి వరకు ఆమేరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు
    • తాజాగా లాక్‌డౌన్ అన్ని రాష్ట్రాలు విధించాల్సిని పరిస్థితి ఉందా..?
      ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా లాక్‌డౌన్ విధించొచ్చు లేదా ఆంక్షలు విధించొచ్చు. అది జిల్లా స్థాయి/మండల స్థాయి/ లేదా వార్డు స్థాయిలో కూడా ఉండొచ్చు.
    • రాష్ట్రంలో అంతరాష్ట్రాల ప్రయాణాలపై నిషేధం ఉందా..?
      రాష్ట్రంలో కానీ అంతరాష్ట్రాల ప్రయాణాలపై కానీ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ప్రజలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంకు వెళ్లొచ్చు. అదే సమయంలో వస్తు రవాణాపై కూడా ఎలాంటి ఆంక్షలు లేవు. సరిహద్దు దేశాలతో వాణిజ్యం, రవాణా పై కూడా ఆంక్షలు లేవు
    • ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే నేను ఈ-పాస్ లేదా ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా..?
      ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన పనిలేదు
    • కర్నాటక రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు వెళ్లేందుకు అనుమతి ఉందా..?
      అనుమతి ఉంది. అయితే ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు నగరంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వెళుతున్నట్లయితే ఆర్‌టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది
    • అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఉందా..?
      ఏప్రిల్ 30 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని ఎంపిక చేయబడ్డ రూట్లలో మాత్రమే పరిస్థితులను బట్టి అంతర్జాతీయ విమానాలను నడపడం జరుగుతుంది
    • బెంగళూరులో మాస్కులు ధరించడం తప్పనిసరా..?
      అవును. మాస్కు ధరించకుండా కనిపిస్తే అలాంటి వారికి రూ.250 జరిమానా విధించడం జరుగుతోంది.
    • కోవిడ్-19 టీకాను నేను తీసుకోవచ్చా..?
      45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే కోవిడ్ టీకా తీసుకోవచ్చు
    • సెకండ్ వేవ్ కోవిడ్-19 సందర్భంగా స్కూళ్లు ఇతర విద్యాసంస్థలు మూసివేయడం జరుగుతుందా..?
      ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు స్కూళ్లు ఇతర విద్యాసంస్థలు మూసివేయడం జరుగుతుంది.కొన్ని రాష్ట్రాలు మాత్రం స్కూళ్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
    • లాక్‌డౌన్ విధించారా..?
      నాగ్‌పూర్‌లో మార్చి 15 నుంచి మార్చి 21 వరకు లాక్‌డౌన్ విధించారు
    • నాగ్‌పూర్‌లో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తారా..?
      25శాతం ఉద్యోగులతో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి
    • మహారాష్ట్రలో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధింపు ఉందా..?
      పూణేలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించగా, నాసిక్‌లో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించడం జరిగింది
    • పూణే నాసిక్‌లలో హోటళ్లు, బార్లు, షాపింగ్ మాల్స్ మూసివేశారా..?
      అవును. పూణే నాసిక్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచుతారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 50శాతం మందిని మాత్రమే అనుమతిస్తారు
    • పూణే నాసిక్‌లలో స్కూళ్లు మూసివేయడం జరిగిందా..?
      మార్చి 31 వరకు పూణే నాసిక్‌లలో అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేయడం జరుగుతుంది
    • ఉత్తరాఖండ్‌లో లాక్‌డౌన్ విధించారా..?
      మస్సూరిలో పూర్తిగా లాక్‌డౌన్ విధించారు
    • పంజాబ్‌లో నైట్ కర్ఫ్యూ విధించారా..?
      పంజాబ్‌లోని పటియాలా, లుధియానా, మొహాలీ, ఫతేఘర్‌సాహిబ్ ప్రాంతాల్లో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించారు
    • మధ్య ప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ విధించడం జరిగిందా..?
      ఇండోర్ భోపాల్ నగరాల్లో మార్చి 17 నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడం జరిగింది.
    • మధ్యప్రదేశ్‌లో వాణిజ్య సముదాయాలు తెరిచే ఉంటాయా..?
      రాత్రి కర్ఫ్యూలు కొనసాగే సమయంలో తెరిచి ఉండవు. జబల్‌పూర్, గ్వాలియర్‌లలో వాణిజ్య సముదాయాలు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసే ఉంటాయి. ఇక భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్, ఖర్గోన్, ఉజ్జయిన్, రత్లాం, చింద్వారా, బుర్హాన్‌పూర్, బేతుల్ ప్రాంతాల్లో హోలీ వేడుకలకు అనుమతి లేదు
    • గుజరాత్‌లో నైట్ కర్ఫ్యూ విధించారా..?
      అహ్మదాబాదు, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌లలో మార్చి 17 నుంచి అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడం జరిగింది.
    • భారత్‌లో రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది..?
      1 మార్చి 2021
    • రెండో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఎవరు అర్హులు..?
      60 ఏళ్లకు పైబడిన వారు, సుదీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల వయసున్న వారు
    • 45 ఏళ్లు వయసుండి ఏ రోగాలతో బాధపడుతుంటే వ్యాక్సిన్‌కు అర్హులు..?
      గుండె సంబంధిత వ్యాధులు,శ్వాసకోశ సంబంధిత వ్యాధి, స్ట్రోక్ వచ్చినప్పుడు సీటీ/ఎంఆర్ఐ డాక్యుమెంట్స్, 10 ఏళ్లకు పైబడి మధుమేహంతో బాధపడుతున్నవారు, హైపర్ టెన్షన్, కిడ్నీ సంబంధిత వ్యాధి,2000వ సంవత్సరం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు లేదా క్యాన్సర్ చికిత్స చేయించుకుంటున్నవారు
    • ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..?
      Co-WIN 2.0 పోర్టల్ నుంచి లేదా ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం Co-WIN 1.0 నుంచి Co-WIN 2.0కు అప్‌గ్రేడ్ చేస్తోంది
    • ప్రభుత్వ హాస్పిటల్‌లో వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుంది..?
      ప్రభుత్వ హాస్పిటల్‌లో వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది
    • ప్రైవేట్ హాస్పిటల్‌లో వ్యాక్సన్ ధర ఎంత ఉంటుంది..?
      ప్రైవేట్ హాస్పిటల్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ఒక్క డోసు ధర రూ.250/-
    • ప్రైవేట్ హాస్పిటల్ జాబితాను ఎక్కడ దొరుకుతుంది..?
      ప్రైవేట్ హాస్పిటల్‌ జాబితా మొత్తం కేంద్ర ఆరోగ్యశాఖ పోర్టల్ లేదా నేషనల్ హెల్త్ అథారిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు
    • ప్రజలు ఏ వ్యాక్సిన్ తీసుకోవాలో ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉందా..?
      ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి స్పష్టత లేదు
    • కొత్తగా అంతర్జాతీయ ప్రయాణాలపై జారీ చేసిన ఆదేశాలు ఎవరికి వర్తిస్తాయి
      యూకే, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వస్తున్న వారికి తప్ప అందరికీ వర్తిస్తాయి
    • అంతర్జాతీయ ప్రయాణాలకు ముందు డిక్లరేషన్ ఫారం సమర్పించాలా..?
      అవును. ఆన్‌లైన్ ఎయిర్ సువిధ పోర్టల్ www.newdelhiairport.in ద్వారా షెడ్యూలు కంటే ముందుగా సమర్పించాల్సి ఉంటుంది
    • కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందా..?
      ఎయిర్ సువిధ పోర్టల్ పై కోవిడ్-19 ఆర్‌టీ పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది
    • భారత్‌కు వచ్చే ముందు ఎప్పుడు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి..?
      ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది
    • అత్యవసరమైన ప్రయాణం చేయాల్సి ఉంటే పరిస్థితి ఏంటి..?
      కుటుంబంలోని ఎవరైన మరణించారనే కారణం ఉంటే తప్ప కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా భారత్‌లోకి రావొచ్చు. ఆ సమయంలో ఎయిర్ సువిధ పోర్టల్‌పై మినహాయింపు కోరుతూ 72 గంటల ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది
    • సముద్రమార్గం ద్వారా లేదా వాయు మార్గం ద్వారా భారత్‌కు వస్తే పరిస్థితి ఏంటి..?
      విమాన ప్రయాణాలకు వర్తించే నిబంధనలే వర్తిస్తాయి
    • కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టు సమర్పించిన తర్వాత విమానం ఎక్కేముందు లక్షణాలు ఉంటే ప్రయాణంకు అనుమతిస్తారా..?
      లేదు. లక్షణాలు లేని వారికి మాత్రమే విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు
    • ఎమర్జెన్సీ సమయంలో కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టు లేకుండా భారత్‌కు చేరుకుంటే పరిస్థితి ఏంటి..?
      ఎమర్జెన్సీ సమయంలో కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టు లేకుండా భారత్‌కు చేరుకుంటే విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తారు
    • భారత్‌కు చేరుకోగానే కోవిడ్ లక్షణాలు ఉంటే పరిస్థితి ఏంటి..?
      లక్షణాలు కనిపించిన ప్రయాణికులను ఆయా మెడికల్ శిబిరాలకు తరలిస్తారు
    • భారతదేశంలోని ఇతర నగరాలకు కనెక్టింగ్ ఫ్లయిట్ తీసుకోవాలంటే ఏం చేయాలి..?
      కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టు ఉన్నవారు దాంతోనే కనెక్టింగ్ ఫ్లయిట్ ఎక్కొచ్చు. అత్యవసర ప్రయాణాలు చేస్తూ కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ లేనివారు మాత్రం పరీక్షలు చేయించుకున్న తర్వాతే ముందుకు వెళ్లొచ్చు
    • విమానాశ్రయంలో నిర్వహించే కోవిడ్ పరీక్షలకు డబ్బులు ఎవరు చెల్లిస్తారు..?
      విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షలకు ప్రయాణికులే ఖర్చు భరించాల్సి ఉంటుంది
    • భారత్‌కు చేరుకున్న తర్వాత అంతరాష్ట్రాలకు వెళ్లాలంటే ఏమైనా నిబంధనలు ఉన్నాయా..?
      కేరళ నుంచి కర్నాటకకు వెళ్లాలంటే కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. మిగతా రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది
    • మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ పొడిగించారా..?
      అవును మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించింది
    • మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి ఉంది..?
      రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు విడుదల చేసే మార్గదర్శకాలను బట్టి కార్యకలాపాల నిర్వహణ ఉంటుంది
    • ప్రజలు లేదా సరుకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం కానీ రవాణా చేయడంపై ఆంక్షలు ఉన్నాయా..?
      కొన్ని కంటెయిన్‌మెంట్ జోన్లలో మినహా మిగతా చోట్ల ఎలాంటి ఆంక్షలు లేవు
    • కంటెయిన్‌మెంట్ జోన్ పై విధివిధానాలను ఎవరు నిర్ణయిస్తారు
      రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్
    • రాష్ట్రంలో లేదా అంతరాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పర్మిట్‌లు పొందాలా..?
      ఆయా రాష్ట్రాల నిబంధనల మేరకు ప్రత్యేక అనుమతులు లేదా ఈ-పర్మిట్లు అవసరం అవుతాయి
    • సామాజిక, మతపరమైన, క్రీడలు, ఎంటర్‌టెయిన్‌మెంట్, ఎడ్యుకేషనల్, కల్చరల్, సమావేశాలకు అనుమతిస్తారా..?
      అనుమతి ఉంది. అయితే హాల్ కెపాసిటీలో 50శాతం మాత్రమే అనుమతి ఉంటుంది. గరిష్టంగా 200 మందితో మాత్రమే సమావేశాలు నిర్వహించుకోవచ్చు
    • సినిమా హాల్స్‌లో ఎంతమందికి అనుమతి ఉంది?
      ఇప్పటికే 50శాతం మందికి అనుమతి ఉంది. ఇంకా ఎక్కువమందికి అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయి. దీనిపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేస్తుంది
    • స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఉన్నాయా..?
      ఒకప్పుడు కేవలం క్రీడాకారులకు మాత్రమే అనుమతి ఉండేది. ఇప్పుడు రివైజ్ చేసిన నిబంధనలతో అందరికీ అనుమతి ఉంటుంది
    • ఎగ్జిబిషన్ హాల్స్‌ పరిస్థితేంటి..?
      ఒకప్పుడు బీఆర్‌బీ ఎగ్జిబిషన్ హాల్స్‌‌కు మాత్రమే అనుమతి. కొత్త ఎగ్జిబిషన్ హాల్స్‌కు ప్రత్యేక గైడ్‌లైన్స్ కేంద్రం ఇస్తుంది
    • కోవిడ్-19 జాగ్రత్త చర్యలు కొనసాగించాలా..?
      రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా కోవిడ్-19 జాగ్రత్త చర్యలను ప్రమోట్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. మాస్కులు ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడం వంటివి ప్రమోట్ చేయాలి
    • మాస్కులు ధరించడం తప్పనిసరా..?
      పనిచేసే కార్యాలయాల్లో, ప్రయాణం చేసే సమయంలో, బహిరంగ ప్రదేశాల్లో తప్పక మాస్కును ధరించుకోవాలి
    • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరంగా పరిగణించబడుతుందా..?
      ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు శిక్షించడం జరుగుతుంది
    • ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరా..?
      ఆరోగ్య సేతు యాప్‌ను ఉంచుకోవడం మంచిది
    • విదేశాలకు విమానంలో ప్రయాణం చేయొచ్చా.?
      కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో పౌరవిమానాయాన మంత్రిత్వ శాఖ చర్చలు జరిపి అంతర్జాతీయ ప్రయాణాలపై ఒక నిర్ణయం తీసుకుంటుంది
    • కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదు ఎంత ఉంటుంది..?
      రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మొదటి డోసు తర్వాత 28 రోజులకు రెండో డోసు తీసుకోవాలి. ఆ తర్వాత రెండు వారాలకు యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి
    • దీర్ఘకాలంలో ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా..లేక సురక్షితమేనా..?
      కోవిడ్-19 దీర్ఘకాలంలో సురక్షితం అని ఇప్పుడప్పుడే చెప్పలేం. అయితే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోంది
    • కోవిడ్ -19 వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత కూడా కరోనా సోకుతుందా..?
      వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత రోగనిరోధక శక్తి పెరిగేందుకు సమయం తీసుకుంటుంది. అంతేకాదు ఏ స్థాయిలో రోగనిరోధక శక్తి ఉందో అనేదానిపై కూడా ఆధారపడిఉంటుంది. అంటే వ్యాక్సిన్ చేయించుకున్న కొన్ని గంటలకే లేదా వ్యాక్సిన్ చేయించుకోబోయే కొన్ని గంటల ముందు కూడా కరోనా వచ్చే అవకాశాలున్నాయి.
    • రెండు వేర్వేరు కోవిడ్-19 వ్యాక్సిన్‌లను తీసుకోవచ్చా..?
      లేదు. రెండు వేర్వేరు కంపెనీలు తయారు చేసిన రెండు వేర్వేరు వ్యాక్సిన్‌లను తీసుకోరాదు. అంతేకాదు రెండు వేర్వేరు వ్యాక్సిన్‌లు కలిపి తీసుకుంటే ఏమవుతుందో అనేదానిపై కూడా ఎక్కడా పరీక్షలు నిర్వహించలేదు
    • రెండు కోవిడ్ వ్యాక్సిన్‌లు కలపడం లేదా ఒక దాని బదులు మరొకటి ఇవ్వొచ్చా..?
      లేదు. మార్గదర్శకాల ప్రకారం యుక్తవయసు వారికి ఒకే వ్యాక్సిన్ రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అది కూడా వైద్యుల సలహాలు సూచనలమేరకే నిర్ణయించడం జరుగుతుంది
    • ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్‌లు ఏ వయస్సు వారికి ఇవ్వాలి?
      ఇప్పుడు భారత్‌లో ఇస్తున్న వ్యాక్సిన్‌లు 14 ఏళ్లు ఆ పైబడి వయసున్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది
    • కోోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
      CO WIN అనే కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ సిస్టం- ఇదొక డిజిటల్ ప్లాట్‌ఫాం. వ్యాక్సిన్‌కు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంత మంది తీసుకున్నారు తదితర వివరాలన్నీ నమోదు చేయబడతాయి . ఎలా నమోదు చేసుకోవాలంటే: పాన్ కార్డు, పెన్షన్ కార్డు, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, ఉపాధి హామీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి రుజువులతో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతాయి. మీరు నివాసం ఉంటున్న స్థానిక యంత్రాంగం త్వరలోనే ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మీ మొబైల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ పంపడం జరుగుతుంది. వ్యాక్సిన్ ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో తీసుకోవాలో ఆ మెసేజ్ ద్వారా చెప్పడం జరుగుతుంది.
    • CO WIN యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా..?
      CO WIN యాప్ ఇంకా తయారీ స్టేజ్‌లోనే ఉంది. ఇంకా గూగుల్ ప్లేస్టోర్‌లో కానీ యాప్ స్టోర్‌లో కాని విడుదల కాలేదు. తయారీ స్టేజ్‌లో ఉండగానే 75లక్షల మంది హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
    • వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎలా ఎదుర్కొంటారు..?
      ఒక బిలియన్ మందికి ఇందులో కొన్ని మిలియన్ల కొద్దీ యువత కూడా తొలిసారిగా వ్యాక్సిన్ తీసుకుంటున్నందున కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటూనే అన్ని కరోనావైరస్ జాగ్రత్తలు లేదా మార్గదర్శకాలు తప్పక పాటించాలి. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నాక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇంకా తెలియదు కాబట్టి ప్రజలు సహకరించాలి. అంతా సవ్యంగా సాగితే కోవిడ్-19 ప్రపంచంలో ఆ వ్యాధిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తీసుకువచ్చిన దేశంగా భారత్ ఘనకీర్తి సంపాదిస్తుంది. అంతేకాదు ఇతర ప్రపంచ దేశాలకు కూడా మన వ్యాక్సిన్ సరఫరా చేయడం జరుగుతుంది
    • కోవిడ్ -19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుంటారు.?
      రిజిస్ట్రేషన్ సమయంలో పరిగణలోకి తీసుకొనబడే డాక్యుమెంట్లు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్, కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి లభించిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కార్డు, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక ఐడీ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు లేదా పోస్లాఫీసు పాస్‌బుక్‌లు, పాస్‌పోర్టు, పెన్షన్ డాక్యుమెంట్,ఫోటో కలిగిఉండి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పీఎస్‌యూలు జారీ చేసిన ఐడీ కార్డులు, ఓటరు కార్డు, ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు
    • కోవిడ్-19 వ్యాక్సిన్‌లో పంది మాంసపు పదార్థాలు మిళితమై ఉన్నాయా..?
      వ్యాక్సిన్ తయారీలో పందిమాంసపు పదార్థాలు వాడలేదు
    • కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రైవేట్ మెడికల్ స్టోర్ నుంచి కొనుగోలు చేయొచ్చా..?
      ప్రైవేట్ మెడికల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయడం మంచిది కాదు. అక్కడైతే వ్యాక్సిన్ ధర అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పరిమితి సంఖ్యలో మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ కొనుగోలును ప్రభుత్వం కొనుగోలు చేస్తే అది చాలా తక్కువగా ఉంటుంది
    • ప్రభుత్వం సూచించిన వ్యాక్సినేషన్ కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకుంటే అందుకు డబ్బులు చెల్లించాలా..?
      జనవరి 16 నుంచి భారత్‌లో 3 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఇస్తోంది. ఈ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
    • కోవిడ్ వ్యాక్సిన్ ఒక డోసు ధర ఎంత
      సీరం సంస్థ నుంచి వచ్చిన కోవిషీల్డ్ డోసు ధర రూ.200. జీఎస్టీతో కలిపి రూ.210. నవంబర్‌లో సీరం సంస్థ సీఈఓ అదార్ పూనవాలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు వ్యాక్సిన్ రూ.1000 కి విక్రయించడం జరుగుతుందని అదే సమయంలో ప్రభుత్వంకు రూ.250కి విక్రయించడం జరుగుతుందని చెప్పారు.
    • గతంలో కోవిడ్ బారిన పడి ఆ తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకున్నవారికి కూడా వ్యాక్సిన్ తీసుకోవాలా..?
      అవును గతంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. రోగనిరోధక శక్తి వీరిలో మరింత పెరుగుతుంది.
    • కోవిడ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో ఎలాంటి ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి..?
      భారత్‌లో తయారైన కోవిడ్ వ్యాక్సిన్‌లు అన్నీ 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ ఉంచాలి. రవాణా సమయంలో కూడా ఈ ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి
    • కోవిడ్ వ్యాక్సిన్‌లు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయా..?
      సంతానోత్పత్తిపై కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం చూపదు
    • గర్భిణీ స్త్రీలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా..?
      గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఇప్పటి వరకు గర్భిణీ స్త్రీలపై వ్యాక్సిన్ పరీక్షలు చేయలేదు.
    • టీకాలు తీసుకున్న తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందా..?
      ఒక వ్యాధికి ఒక వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్నాడంటే ఇన్‌ఫెక్షన్ పక్కవారికి వ్యాప్తి చెందడం కూడా తగ్గుతుంది.
    • కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి సాధారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేదా తెలిసిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి..?
      కోవిడ్ -19 వ్యాక్సిన్ చాలా సురక్షితం. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన ప్రాంతంలో కాస్త నొప్పి దానివల్ల చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ అనే కాదు ఏ వ్యాక్సిన్‌లో అయినా ఇవి సర్వసాధారణం
    • కోవిడ్ వ్యాక్సిన్ షాట్ డోస్ తీసుకునే వారికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ( బీమా) కల్పిస్తుందా ?
      నిర్దిష్ట ఆరోగ్య బీమా పాలసీలు మాత్రమే కోవిడ్-19 వ్యాక్సిన్ల ఖర్చులు భరిస్తాయి. రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సాధారణంగా ఆసుపత్రి ఖర్చులతో పాటు ఫ్రీ అడ్మిషన్ మరియు పోస్టు డిశ్చార్జ్ బిల్లులు కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి కరోనా వైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేయించినట్లు అయితే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి టీకా అందిస్తే టీకా ఖర్చులు అన్నీ ఆరోగ్య బీమా పాలసీల పరిధిలో ఉంటాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదు పొందాలనుకునే వారందరికీ ఆసుప్రతిలో ఉండాల్సిన అవసరం లేదు. వారికి అవుట్ పేషంట్ విభాగాన్ని కవర్ చేస్తే ఆరోగ్య బీమా పాలసీలు మాత్రమే టీకా ఖర్చులు భరిస్తాయి
    • కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత నా ఆరోగ్యం పరిస్థితులు క్షీణించినట్లు అయితే ఎవరు బాధ్యత వహిస్తారు ?
      నియంత్రణ సంస్థలు దాని భద్రత మరియు సమర్థత ఆధారంగా క్లియర్ చేసిన తరువాతే దేశంలో టీకాలు ప్రవేశపెట్టారు. భారతదేశంలో డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నేతృత్వంలో డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) టీకాలు వెయ్యడానికి ఆమోదం తెలిపింది. టీకాలు తీసుకున్న వ్యక్తులల్లో ఇతర వ్యాధులు ప్రేరింపించడానికి అవకాశం లేదని నిర్దారించుకున్న తరువాత టీకాలు వెయ్యడానికి అనుమతి ఇచ్చారు.
    • కోవిడ్ వ్యాక్సిన్ ను కోల్డ్ స్టోరేజ్ ల్లో నిల్వ చెయ్యాల్సిన అవసరం ఉందా ?
      మంత్రిత్వ శాఖ అధికారుల సమాచారం ప్రకారం భారతదేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 28, 932 కోల్డ్ చైన్ పాయింట్ లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 319 వాక్ ఇన్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. 44, 226 మంచుతో కప్పబడిన రిఫ్రిజిరేటర్లు, 40, 792 డీప్ ఫీజర్లు కోవిడ్ వ్యాక్సిన్ లు భద్రతపరచడానికి అవకాశం ఉంది.
    • అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ డిపోలు ఉన్నాయా ?
      భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి చెయ్యడానికి 41 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ, కర్నల్ లను మిని హబ్ లుగా గుర్తించారు. తూర్పు ప్రాంతాలకు కోల్ కతా కేంద్రంగా ఉంటుంది. ఈ శాన్యానికి నోడల్ కేంద్రంగా ఉంటుంది. దక్షిణ భారతదేశానికి హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా ఉంటాయి.
    • టీకాలు వేసే వాలంటీర్లు ఇంటింటికి వెళతారా ?
      కోవిడ్ టీకాలు వెయ్యడానికి భారత ప్రభుత్వం కొన్ని వర్గాలను ఎంచుకుంది. భారత ప్రభుత్వం ముందుగా గుర్తించిన వారికి మాత్రమే కోవిడ్ టీకాలు వెయ్యడానికి ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సిద్దం అయ్యారు. మొదటి దశలో ఆరోగ్య శాఖ కార్యకర్తలు, 50 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ లు వెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
    • ఢిల్లీలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ కేంద్రం ఎక్కడ ఉంది ?
      తూర్పు ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ లోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (RGSSH) లో 650 పడకల సామర్థం ఉంది. ఇదే ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ ప్రధాన కేంద్రంగా ఉంది.
    • ఉత్తరప్రదేశ్ లో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ?
      ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రధాన కేంద్రంగా ఉంది. తరువాత ప్రయాగ్రాజ్, తేజ్ బహదూర్ సప్రూ (బేబి), ఆసుపత్రి సమావేశ మందిరం, మీరట్, ఘజియాబాద్, నోయిడా, హాపూర్, బులంద్ షపూర్, బాగ్ పట్, ఆరు జిల్లా కేంద్రాలకు మీటర్ లో, లాలా లజపతిరాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ లో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ చెయ్యడానికి ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
    • ఉత్తరాఖండ్ లో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ కేంద్రం ఎక్కడ ఉంది ?
      ఉత్దరాఖండ్ లో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ చెయ్యడానికి ఇంకా ఏ ప్రాంతాన్ని గుర్తించలేదు. ప్రభుత్వం ఇప్పుడు ఉత్దరాఖండ్ లో ఎక్కడ కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ చెయ్యాలి అనే విషయంలో ఆలోచిస్తోంది.
    • బీహార్ లో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ ఎక్కడ చేస్తారు ?
      విమాన మార్గంలో బీహార్ రాజధాని పాట్నాకు కోవిడ్ వ్యాక్సిన్ లు సరఫరా అవుతాయి. తరువాత పాట్నా నుంచి ఫ్రీజర్ వ్యాన్లలో పాట్నాలోని నలందా మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నుంచి బీహార్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ లు పంపిణి చేస్తారు. బీహార్ లో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు, 5 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు, 21 సివిల్ ఆసుపత్రులు, 17 డివిజన్ ఆసుపత్రులు, 208 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక నర్సింగ్ కాలేజ్, మూడు రిఫెరల్ ఆసుపత్రులకు కోవిడ్ వ్యాక్సిన్ లు పంపిణి చెయ్యడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
    • జార్ఖండ్ లో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి
      జార్ఖండ్ లో ఇప్పటికే 275 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ చెయ్యడానికి మరో 30 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. సాచ్చిలోని ధల్బం రోడ్డులోని ఓల్డ్ సివిల్ సర్జన్ కార్యాలయంలోని ఆవరణంలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ చెయ్యడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
    • పశ్చిమ బెంగాల్ లో ఎక్కడ కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ కేంద్రం ఉంది ?
      పశ్చిమ బెంగాల్ మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి చెయ్యడానికి 958 కోల్డ్ స్టోరేజ్ లు అందుబాటులో ఉన్నాయి, కొల్ కత్తా ఎయిర్ పోర్టు నుంచి కోవిడ్ వ్యాక్సిన్ లు బాగ్ బజార్ లోని మెడికల్ స్టోరేజ్ కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి నుంచి ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సిన్ లు సరఫరా చేస్తారు.
    • త్రిపురాలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజీలు ఏ నగరాల్లో ఉన్నాయి..?
      అగర్తాలాతో పాటు మరో 8 జిల్లాల హెడ్ క్వార్టర్స్‌‌, హెల్త్ ఫెసిలిటీ లెవెల్‌లో 145 కోల్డ్ చైన్‌ పాయింట్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది
    • అస్సాంలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలు ఎక్కడున్నాయి..?
      గౌహతిలో ఏర్పాటు చేసిన స్టేట్ వ్యాక్సిన్ స్టోర్లలో కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచారు. జిల్లాలకు రవాణా చేసేముందు మరో 5 ప్రాంతీయ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను భద్రపరిచారు
    • మేఘాలయాలో ఏ నగరాల్లో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయి..?
      మేఘాలయాలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మరిన్ని వివరాల కోసం కోవిన్ యాప్‌ను చూడండి
    • మేఘాలయాలో ఏ నగరాల్లో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయి..?
    • మణిపూర్‌లో ఏ నగరాల్లో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయి..?
      మణిపూర్‌లో ఇంకా ప్రభుత్వం ఎలాంటి కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మరిన్ని వివరాల కోసం కోవిన్ యాప్‌ను చూడండి
    • మిజోరాంలో ఏ నగరాల్లో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయి..?
      మిజోరాంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మరిన్ని వివరాల కోసం కోవిన్ యాప్‌ను చూడండి
    • అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ నగరాల్లో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయి..?
      అరుణాచల్ ప్రదేశ్‌లో ఇంకా ప్రభుత్వం ఎలాంటి కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మరిన్ని వివరాల కోసం కోవిన్ యాప్‌ను చూడండి
    • నాగాలాండ్‌లో ఏ నగరాల్లో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయి..?
      నాగాలాండ్‌లో ఇంకా ప్రభుత్వం ఎలాంటి కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మరిన్ని వివరాల కోసం కోవిన్ యాప్‌ను చూడండి
    • ఒడిషాలో ఏ నగరాల్లో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయి..?
      వ్యాక్సిన్ తయారీ సంస్థ భువనేశ్వర్‌కు వ్యాక్సిన్‌లను రవాణా చేస్తే అక్కడ నుంచి రాష్ట్ర వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రంకు టీకాలను తరలిస్తారు.భువనేశ్వర్, కటక్, గంజాం, బాలాసోర్, బాలాన్‌గిర్, కందమాల్, కోరాపుట్, సంబల్‌పూర్, మరియు సుందర్‌గఢ్‌ ప్రాంతాలకు వ్యాన్లలో వ్యాక్సిన్‌ను తరలిస్తారు.
    • ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు ఎక్కడున్నాయి..?
      గన్నవరంలో వ్యాక్సిన్ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ప్రాంతీయ వ్యాక్సిన్ కేంద్రాలకు వ్యాక్సిన్‌ను రవాణా చేస్తారు.కర్నూలు, కడప, గుంటూరు, విశాఖపట్నంలలో ప్రధాన ప్రాంతీయ కేంద్రాలున్నాయి. ఇక్కడి నుంచి 13 జిల్లాలకు వ్యాక్సిన్ రవాణా జరుగుతుంది
    • తెలంగాణలో ఏ నగరాల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు..?
      శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ స్టోర్ నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను రవాణా చేస్తారు.
    • తమిళనాడులోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      పుణే నుంచి కరోనా వ్యాక్సిన్లు కార్గో విమానాల ద్వారా తమిళనాడుకు సరఫరా చేశారు. విమానాశ్రయం నుంచి పెరియమెట్‌లోని కేంద్రీయ గిడ్డంగులకు తరలించారు. అక్కడి నుంచే అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ గోడౌన్లకు వ్యాక్సిన్లను రోడ్డుమార్గంలో తరలిస్తారు. దీనికోసం సుమారు 51 మొబైల్ వాకింగ్ కూలర్లలో వాటిని రవాణా చేస్తారు.
    • కేరళలోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని కేరళ ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రియల్ టైమ్ డేటా, ఇతర పూర్తి వివరాల కోసం కోవిన్ యాప్‌ (CoWin app)ను వినియోగించండి.
    • కర్ణాటకలోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      కర్ణాటకలో బెంగళూరు, బెళగావిల్లో కరోనా వ్యాక్సిన్ కోల్డ్ చైన్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అన్ని ప్రాంతీయ కేంద్రాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారు. దీనికోసం ఇన్సులేటెడ్ ట్రక్కులను వినియోగిస్తారు.
    • గోవాలోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      గోవాలో మొత్తం ఎనిమిది కేంద్రాలను ప్రభుత్వం వ్యాక్సినేషన్ సెంటర్లుగా గుర్తించింది. ఇందులో అయిదు ప్రభుత్వ, మూడు ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. గోవా మెడికల్ కాలేజ్ (పనాజీ), హొస్పిసియో ఆసుపత్రి (మార్గోవా), అసిలో ఆసుపత్రి (మపుసా), చికలిమ్ హెల్త్ సెంటర్ (వాస్కో), సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రి (పొండా) ప్రభుత్వానికి చెందినవి కాగా..మణిపాల్ ఆసుపత్రి (పనాజీ), హెల్త్‌వే ఆసుపత్రి (ఓల్డ్ గోవా), విక్టర్ ఆసుపత్రి (మార్గోవా) ప్రైవేటుకు చెందినవి.
    • మహారాష్ట్రలోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      కరోనా వ్యాక్సిన్ ప్రధాన స్టోరేజీ కేంద్రాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు. ఇదివరకు పల్స్ పోలియో వ్యాక్సిన్ల కోసం వినియోగించిన పరేల్ కార్యాలయాన్ని ఈ సారి కోవిడ్ వ్యాక్సిన్ కోసం వాడుతున్నారు. ఈ కంజుర్‌మార్గ్ ఆఫీస్‌ను ప్రత్యేకించి కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం వినియోగిస్తారు. పుణే డివిజన్‌కు సంబంధించిన కరోనా స్టోరేజీ పాయింట్‌ను పుణేలో నెలకొల్పారు. షోలాపూర్, సతారా, కొల్హాపూర్, అహ్మద్‌నగర్ జిల్లాలకు పుణే నుంచి వ్యాక్సిన్ సరఫరా అవుతుంది.
    • గుజరాత్‌లోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రియల్ టైమ్ డేటా, ఇతర పూర్తి వివరాల కోసం కోవిన్ యాప్‌ (CoWin app)ను వినియోగించండి.
    • రాజస్థాన్‌లోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రియల్ టైమ్ డేటా, ఇతర పూర్తి వివరాల కోసం కోవిన్ యాప్‌ (CoWin app)ను వినియోగించండి.
    • మధ్యప్రదేశ్‌లోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రియల్ టైమ్ డేటా, ఇతర పూర్తి వివరాల కోసం కోవిన్ యాప్‌ (CoWin app)ను వినియోగించండి.
    • ఛత్తీస్‌గఢ్‌లోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      ఛత్తీస్‌గఢ్ రాజధానిలోని బలోద్ ప్రాంతంలో గల జిల్లా వ్యాక్సిన్ స్టోర్ (డీవీఎస్)ను కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరేజ్ ప్రధాన కేంద్రంగా గుర్తించారు. దీన్ని మోడల్ వ్యాక్సిన్ స్టోర్‌గా తీర్చిదిద్దారు. జిల్లాస్థాయిలో జిల్లా వ్యాక్సిన్ స్టోరేజీ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రస్థాయి కోవిడ్ స్టోరేజ్ సెంటర్ నుంచి జిల్లా స్థాయి వ్యాక్సిన్ కోల్డ్ చైన్ పాయింట్లకు వ్యాక్సిన్లు అందుతాయి.
    • హర్యానాలోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని హర్యానా ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రియల్ టైమ్ డేటా, ఇతర పూర్తి వివరాల కోసం కోవిన్ యాప్‌ (CoWin app)ను వినియోగించండి.
    • పంజాబ్‌లోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      పంజాబ్‌లో కరోనా వ్యాక్సినేషన్ స్టోరేజీ కోసం రాష్ట్రస్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో 22, ప్రాంతీయ స్థాయిలో 127 పాయింట్లను నెలకొల్పారు. వాటితో పాటు 57 కోల్డ్ చైన్ పాయింట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిరోజ్‌పూర్‌లో ఒక ఫ్రీజర్ పాయింట్‌ను నెలకొల్పారు. చండీగఢ్ కోసం మరో పాయింట్‌ను ప్రకటించాలని కేంద్రం నిర్ణయించింది.
    • హిమాచల్ ప్రదేశ్‌లోని ఏ సిటీలో కోవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని నెలకొల్పారు?
      కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రియల్ టైమ్ డేటా, ఇతర పూర్తి వివరాల కోసం కోవిన్ యాప్‌ (CoWin app)ను వినియోగించండి.
    • కర్నాటకలో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించడమైందా..?
      కర్ఫ్యూను ఉపసంహరించుకోవడం జరిగింది
    • డిసెంబర్ 22 నాటికల్లా భారత్‌కు విమానాల ద్వారా చేరుకున్న వారి పరిస్థితి ఏంటి..?
      ఈ విమానాలకు అనుమతి ఉంది
    • యూకే నుంచి ఇండియాకు వచ్చిన ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
      ప్రత్యేకంగా ఐసొలేషన్ ఉంటుంది. ల్యాండ్ అవగానే RT-PCR టెస్టులు తప్పనిసరి
    • జన్యుక్రమం చేయడం జరుగుతుందా..?
      డిసెంబర్ 22నుంచి యూకే నుంచి దేశంలోకి వచ్చి కోవిడ్-19 పాజిటివ్‌ నిర్థారణ అయిన ప్రయాణికులకు మాత్రమే
    • కేవలం యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే గైడ్‌లైన్స్ వర్తిస్తాయా..?
      గత నాలుగు వారాల్లో యూకే మీదుగా లేదా యూకే నుంచి ప్రయాణంచేసి భారత్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులందరికీ వర్తిస్తుంది
    • ఇన్స్‌టిట్యూషనల్ క్వారంటైన్ ఉంటుందా..?
      డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 23 వరకు భారత్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకుని కరోనా పాజిటివ్ వచ్చిన వారందరితో పాటు ముందు మూడు వరసలు వెనక మూడు వరసల్లో ఉన్న ప్రయాణికులంతా క్వారంటైన్‌కు పంపుతారు. క్యాబిన్ సిబ్బంది కూడా క్వారంటైన్‌లో ఉండాలి
    • యూకే నుంచి ఢిల్లీకి విమానాల ద్వారా వచ్చే ప్రతి ప్రయాణికుడు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలా ?
      యూకే నుంచి ఢిల్లీకి విమానాల ద్వారా వచ్చే ప్రతి ప్రయాణికుడు రాగానే RT-PCR పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి
    • యూకే నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి కోవిడ్-19 పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి..?
      పాజిటివ్ వచ్చిన వ్యక్తిని 14 రోజుల పాటు ఇన్స్‌టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉంచుతారు
    • కరోనావైరస్ నెగిటివ్ వచ్చిన ప్రయాణికుల పరిస్థితి ఏంటి..?
      కరోనావైరస్ నెగిటివ్ వచ్చిన ప్రయాణికులను 7 రోజుల పాటు ఇన్స్‌టిట్యూషన్ క్వారంటైన్‌లో ఉంచి మరో 7 రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉంచడం జరుగుతుంది
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X