-
కోవిడ్ టీకా తీసుకునేందుకు అన్ని వయస్సుల చిన్నారులు అర్హులా..?
కాదు, కేంద్రప్రభుత్వం ప్రకారం 15 ఏళ్లు పైబడిన పిల్లలకు మాత్రమే 3 జనవరి 2022 నుంచి కోవిడ్ టీకా ఇవ్వడం జరుగుతుంది
-
15 నుంచి 18 ఏళ్లు వయసు ఉన్న వారు కోవిడ్ టీకా కోసం నమోదు చేసుకోవచ్చా..?
అవును. అర్హులైన వారు కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి
-
కౌమారదశలో ఉన్నవారు ఎలా నమోదు చేసుకోవాలి..?
ఇతర వయస్సు వారు ఎలాగైతే నమోదు చేసుకుంటున్నారో అదే ప్రక్రియ వర్తిస్తుంది. మొబైల్ నెంబర్, ఓటీపీ వాలిడేషన్, ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది
-
ఆరోగ్యసేతు యాప్ ద్వారా ఎలా నమోదు చేసుకోవాలి
ఆరోగ్య సేతు యాప్లో కోవిన్ టాబ్ ఒకటి ఉంటుంది.అందులో ఇచ్చిన సూచనలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది
-
నా పిల్లలకు ఆధార్ లేకుంటే పరిస్థితి ఏంటి..?
15 నుండి 18 ఏళ్ల లోపు పిల్లలు 10వ తరగతి ఐడీ కార్డుతో నమోదు చేసుకోవచ్చు.
-
15 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఎప్పుడు ఇస్తారు
కోవిన్ యాప్ ఆరోగ్య సేతు యాప్ పై 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి 1జనవరి 2022 నుంచి ప్రారంభం అవుతుంది
-
15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారు వ్యాక్సిన్ ఏదో కోరుకునే అవకాశం ఉందా
ప్రస్తుతానికి అయితే కొవాగ్జిన్ ఎమర్జెన్సీ కింద ఇచ్చేందుకు అనుమతులు వచ్చాయి
-
బూస్టర్ డోసుకు ఎవరు అర్హులు
60 ఏళ్లు లేదు అంతకు మించి వయసున్న వారు ఇతర వ్యాధులతో బాధపడేవారు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 10 జనవరి 2022 నుంచి ప్రారంభమయ్యే బూస్టర్ డోసులకు అర్హులు
-
ఇతర వ్యాధులు ఉన్నాయని పేర్కొంటూ సీనియర్ సిటిజన్లు ఏవైనా రుజువులు పొందుపర్చాల్సి ఉంటుందా
అక్కర్లేదు. అయితే తమ వైద్యులను సంప్రదించి ఆరోగ్యం బాగుందని తెలిసిన తర్వాతే బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది
-
60 ఏళ్లు పైబడి వయస్సున్న వారెవరైనా బూస్టర్ డోసు తీసుకోవచ్చా,,
లేదు.. చివరి డోసు 39 వారాల క్రితం తీసుకున్నవారు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది
-
ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఎవరిని గుర్తిస్తారు
డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్, మరియు సెక్యూరిటీ సిబ్బంది
-
బూస్టర్ డోసు కింద ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి
అధికారులు ఇంకా స్పష్టమైన గైడ్ లైన్స్ విడుదల చేయలేదు. అయితే నిపుణులు మాత్రం తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోసు కింద తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు