National Help Line Number
+91-11-23978046
Toll Free No: 1075

Coronavirus FAQs After Lockdown

Oneindia
సాధారణ ప్రశ్నలు
    • భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు ఉన్న నిబంధనలేంటి..?
      భారత్‌కు వచ్చిన ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌‌గా తేలితే వారిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తారు. వారి శాంపిల్స్‌ను INSACOG ల్యాబ్‌కు పంపుతారు. ఈ ల్యాబ్‌లో అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తారు. వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.అంతేకాదు పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు అని కూడా గుర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత 14 రోజుల పాటు ఫాలో అప్ చేయడం జరుగుతుంది.
    • ఎక్కువగా ప్రమాదకరమైన దేశాలేవి..?
      యునైటెడ్ కింగ్‌డమ్, యూరోప్‌లోని మొత్తం 44 దేశాలు,దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంగ్‌కాంగ్, ఇజ్రాయిల్
    • ప్రమాదకరమైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి నిబంధనలున్నాయి..?
      రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌కు చేరుకోగానే ముందుగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారు. వారి ఫలితాలు వచ్చే వరకు విమానాశ్రయంను వీడి వెళ్లరాదు. ఒక వేళ నెగిటివ్ వస్తే వారు ఏడు రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.ఆ తర్వాత 8వ తేదీ మరోసారి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇంట్లో సరిగ్గా ఐసొలేషన్‌లో ఉన్నారా లేదా అని చెక్ చేసేందుకు ఆయా రాష్ట్ర అధికారులు ఇళ్లను సందర్శిస్తారు.
    వ్యాక్సినేషన్
      • కోవిడ్ టీకా తీసుకునేందుకు అన్ని వయస్సుల చిన్నారులు అర్హులా..?
        కాదు, కేంద్రప్రభుత్వం ప్రకారం 15 ఏళ్లు పైబడిన పిల్లలకు మాత్రమే 3 జనవరి 2022 నుంచి కోవిడ్ టీకా ఇవ్వడం జరుగుతుంది
      • 15 నుంచి 18 ఏళ్లు వయసు ఉన్న వారు కోవిడ్ టీకా కోసం నమోదు చేసుకోవచ్చా..?
        అవును. అర్హులైన వారు కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి
      • కౌమారదశలో ఉన్నవారు ఎలా నమోదు చేసుకోవాలి..?
        ఇతర వయస్సు వారు ఎలాగైతే నమోదు చేసుకుంటున్నారో అదే ప్రక్రియ వర్తిస్తుంది. మొబైల్ నెంబర్, ఓటీపీ వాలిడేషన్, ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది
      • ఆరోగ్యసేతు యాప్ ద్వారా ఎలా నమోదు చేసుకోవాలి
        ఆరోగ్య సేతు యాప్‌లో కోవిన్ టాబ్ ఒకటి ఉంటుంది.అందులో ఇచ్చిన సూచనలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది
      • నా పిల్లలకు ఆధార్ లేకుంటే పరిస్థితి ఏంటి..?
        15 నుండి 18 ఏళ్ల లోపు పిల్లలు 10వ తరగతి ఐడీ కార్డుతో నమోదు చేసుకోవచ్చు.
      • 15 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఎప్పుడు ఇస్తారు
        కోవిన్ యాప్‌ ఆరోగ్య సేతు యాప్‌ పై 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి 1జనవరి 2022 నుంచి ప్రారంభం అవుతుంది
      • 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారు వ్యాక్సిన్ ఏదో కోరుకునే అవకాశం ఉందా
        ప్రస్తుతానికి అయితే కొవాగ్జిన్ ఎమర్జెన్సీ కింద ఇచ్చేందుకు అనుమతులు వచ్చాయి
      • బూస్టర్ డోసుకు ఎవరు అర్హులు
        60 ఏళ్లు లేదు అంతకు మించి వయసున్న వారు ఇతర వ్యాధులతో బాధపడేవారు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 10 జనవరి 2022 నుంచి ప్రారంభమయ్యే బూస్టర్ డోసులకు అర్హులు
      • ఇతర వ్యాధులు ఉన్నాయని పేర్కొంటూ సీనియర్ సిటిజన్లు ఏవైనా రుజువులు పొందుపర్చాల్సి ఉంటుందా
        అక్కర్లేదు. అయితే తమ వైద్యులను సంప్రదించి ఆరోగ్యం బాగుందని తెలిసిన తర్వాతే బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది
      • 60 ఏళ్లు పైబడి వయస్సున్న వారెవరైనా బూస్టర్ డోసు తీసుకోవచ్చా,,
        లేదు.. చివరి డోసు 39 వారాల క్రితం తీసుకున్నవారు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది
      • ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఎవరిని గుర్తిస్తారు
        డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్, మరియు సెక్యూరిటీ సిబ్బంది
      • బూస్టర్ డోసు కింద ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి
        అధికారులు ఇంకా స్పష్టమైన గైడ్ లైన్స్ విడుదల చేయలేదు. అయితే నిపుణులు మాత్రం తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోసు కింద తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు
      న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
      Enable
      x
      Notification Settings X
      Time Settings
      Done
      Clear Notification X
      Do you want to clear all the notifications from your inbox?
      Settings X