National Help Line Number
+91-11-23978046
Toll Free No: 1075

Coronavirus FAQs After Lockdown

Oneindia
సాధారణ ప్రశ్నలు
  • కరోనా వైరస్ భయం వీడినట్లేనా ?
   ఇంకా ఆ భయం వీడలేదు
  • మార్కెట్‌కు వెళ్లొచ్చా..?
   వెళ్లొచ్చు.. అయితే ఎక్కువగా జనం ఉన్న చోట ఉండకండి
  • క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయా
   క్యాబ్‌లకు అనుమతి ఉంది. అయితే కంటెయిన్‌మెంట్ జోన్లలో లేదు
  • చిన్న చిన్న దుకాణాలు తెరుచుకుంటాయా..?
   తెరుచుకుంటాయి. కానీ కంటెయిన్‌మెంట్ జోన్లలో కాదు.
  • బ్యాంకులు అన్ని సేవలు అందిస్తాయా..?
   బ్యాంకులు అన్ని సేవలు అందిస్తాయి
  • నేను పెస్ట్ కంట్రోల్ సేవలను బుక్ చేసుకోవచ్చా?
   హాట్‌స్పాట్ కంటెయిన్‌మెంట్ జోన్లలో ఉంటే అనుమతి లేదు
  • ఇంటికొచ్చి శాంపిల్స్ సేకరణకు అనుమతి ఉంటుందా..?
   ఇప్పటికైతే అనుమతి లేదు. అయితే గ్రీన్ జోన్లలో అనుమతించే అవకాశం
  • లాండరీ సేవలు అందుబాటులో ఉంటాయా..?
   ఉంటాయి. అయితే హాట్‌స్పాట్ రెడ్‌ జోన్లలో ఉండవు
  • నాన్ హాట్‌స్పాట్ జోన్లలో పబ్లిక్ టాయ్‌లెట్స్ వినియోగించొచ్చా..?
   పబ్లిక్ టాయ్‌లెట్స్‌ను అన్ని జోన్లలో వినియోగించకపోవడమే మంచిది
  • ఒక లీటరు మినరల్ వాటర్ బాటిల్‌ను తెరిచేముందు శానిటైజ్ చేయాలా.?
   వాటర్ బాటిల్ బయట శానిటైజ్ చేయాలి
  • అంతరాష్ట్రాలకు ప్రయాణాలు చేసే వీలు ఉంటుందా..?
   ఉంటుంది. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయం మేరకే
  • ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బస్సులు తిరుగుతాయా?
   రెండు జిల్లాలు గ్రీన్ జోన్ల పరిధిలోకి వస్తేనే బస్సులు తిరుగుతాయి
  • ఉబెర్ సేవలు నేనున్న నగరంలో అందుబాటులో ఉంటాయా..?
   కటక్, గౌహతి, జమ్షెడ్‌పూర్,కొచ్చి సిల్వాసా మరియు డామన్, అమృత్‌సర్, గురుగ్రామ్, పంచకుల, తిరుచిరాపల్లి, అసన్సోల్, హుబ్లీ, ప్రయాగ్‌రాజ్, ఉదయ్‌పూర్, భువనేశ్వర్, కోజికోడ్, పుదుచ్చేరి, వాపి, కోయంబత్తూర్, మంగళూరు, రాజ్‌కోట్, విశాఖపట్నం, డెహ్రాడూన్, మెహసానా, రోహ్‌తక్, దుర్గాపూర్, మొహాలీ, తిరువనంతపురం, ఘజియాబాద్, నదియాద్, త్రిస్సూర్
  • నేనున్ననగరంలో ఉబెర్ నిత్యావసర సేవలు అందుబాటులో ఉంటాయా..?
   బెంగళూరు, భోపాల్, హైదరాబాదు, ఇండోర్, ముంబై, నాసిక్, లుధియానాలో ఉంటాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాదు, చెన్నూ, బెంగళూరు, పూణే,కోల్‌కతా, పాట్నా, లక్నో, నోయిడా, కాన్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, ఘజియాబాద్, జమ్షెడ్‌పూర్, సూరత్ గౌహతిలో ఉంటాయి
  • శ్రామిక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు కర్నాటకలోని వలస కూలీలకు అందరికీ అనుమతి ఉందా..?
   వ్యాధి లక్షణాలు కనిపించని వారిని మాత్రమే అనుమతిస్తారు
  • శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైళ్లలో ఎక్కేందుకు వలస కూలీలు ఏమైనా ప్రత్యేక దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుందా..?
   అవును ఆయా రాష్ట్రాల వెబ్‌సైట్‌లకు వెళ్లి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కర్నాటక అయితే sevasindhu.karnataka.gov.in
  • దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రైలులో ప్రయాణం చేసే అనుమతి ఉందా..?
   లేదు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన దరఖాస్తుదారులు మాత్రమే ప్రయాణించగలరు
  • కర్నాటకలోని రైల్వే స్టేషన్లకు వలస కూలీలను ఎలా తరలిస్తారు..?
   కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల ద్వారా తరలిస్తారు
  • నేను ఏ జోన్‌లో ఉన్నానో తెలుసుకునేదెలా..?
   రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది
  • నేను ఆఫీస్‌కు వెళ్లొచ్చా..?
   వెళ్లొచ్చు
  • ఆఫీసులో ఒక వ్యక్తికి ఎంత దూరంలో ఉండాలి..?
   కనీసం ఒక మీటరు దూరం పాటించాలి
  • ఆఫీసులో మాస్కులు ధరించడం తప్పని సరా..?
   అవును
  • ఆఫీసుకు రాకుండా నన్ను యాజమాన్యం నిరోధించగలదా..?
   జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు నిరోధించవచ్చు
  • పాజిటివ్ కేసులు వస్తే ఆఫీసును మూసివేయాలా..?
   అవసరం లేదు. క్రిమిసంహారక మందుతో పిచికారి చేయాల్సి ఉంటుంది
  • స్కూళ్లు మరియు కాలేజీలు ప్రారంభం అవుతాయా..?
   జూలై 1వరకు ప్రారంభం కావు. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్నిబట్టి ఉంటుంది
  • మెట్రో రైలు సేవలకు అనుమతి ఉందా..?
   వెంటనే లేదు
  • కర్ఫ్యూ కొత్త టైమింగ్స్ ఏమిటి..?
   రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు
  • కంటెయిన్‌మెంట్ జోన్లలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉంటుందా..?
   అవును జూలై 31 వరకు
  • అంతరాష్ట్ర మరియు రాష్ట్రాల్లో ప్రయాణించేందుకు అనుమతి ఉందా..?
   ఉంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించొచ్చు
  • రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాలా..?
   అక్కర్లేదు
  • కంటెయిన్‌మెంట్ జోన్లపై ఎవరు నిర్ణయిస్తారు..?
   రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలు
  • కంటెయిన్‌మెంట్ జోన్లలో నిత్యావసర వస్తువులు దొరుకుతాయా
   దొరుకుతాయి
  • రాత్రి వేళల్లో కర్ఫ్యూ ఉంటుందా..?
   లేదు, రాత్రి వేళల్లో ఎవరైనా తిరగొచ్చు. కర్ఫ్యూ ఎత్తివేయడం జరిగింది
  • భారత స్వాతంత్య్ర వేడుకల్లో ఏమైనా ఆంక్షలు ఉన్నాయా..?
   లేదు, కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి
  • స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఉంటాయా..?
   ఆగష్టు 31,2020 వరకు మూసివేసే ఉంటాయి
  • మెట్రో రైళ్లు తిరుగుతాయా..?
   లేదు, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు తిరగవు
  • కంటెయిన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతుందా..?
   అవును. 31 ఆగష్టు2020 వరకు కచ్చితంగా పాటించాలి
  • కంటెయిన్‌మెంట్ జోన్ల బయట కార్యకలాపాలు నిర్వహించాలా లేదా అని ఎవరు నిర్ణయిస్తారు?
   రాష్ట్రప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు
  వ్యవసాయం - వ్యవసాయోత్పత్తుల వ్యాపారం
   • పంటలపై కనీస మద్దతు ధర పెంచుతారా..?
    ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది
   • విద్యుత్ / డీజిల్‌పై ఏదైనా సబ్సిడీ ఉంటుందా?
    ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది
   • కోవిడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు పొలంలో పనిచేయడానికి నేను అనుమతించవచ్చా?
    లేదు అనుమతించకూడదు
   • కోవిడ్ సంక్షోభం సమయంలో అదృశ్యమైన ఏజెంట్లకు మేము విక్రయించగలమా?
    అవును విక్రయించొచ్చు
   పట్టణ మధ్యతరగతి వర్గం
   • వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇంకా వినియోగించుకోవచ్చా..?
    అవును. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మంచిది
   • లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత నా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చా..?
    పీఎఫ్ మొత్తంలో 75శాతం విత్ డ్రా చేసుకోవచ్చు లేదా మూడు నెలల బేసిక్ అమౌంట్ తీసుకోవచ్చు. ఈ రెండిటిలో ఏది తక్కువైతే అది
   • పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు తెరుచుకుంటాయా..?
    తెరుచుకుంటాయి. అయితే కంటెయిన్‌మెంట్ జోన్లలో అనుమతి లేదు
   • ఇతర రాష్ట్రాలకు , విదేశాలకు ప్రయాణం సురక్షితమేనా..?
    సురక్షితం కాదు అదే సమయంలో అనుమతి కూడా లేదు
   సేవా రంగం
    • అన్ని ప్రభుత్వ / ప్రైవేట్ కార్యాలయాలు పనిచేస్తాయా..?
     రెడ్ జోన్లలో 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. కంటెయిన్‌మెంట్ జోన్లలో అనుమతి లేదు
    విద్యార్థులు
    • కోచింగ్ సంస్థలు ప్రారంభమవుతాయా..?
     ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారానే కోచింగ్‌లు
    • కాలేజీ క్యాంటీన్‌లు పనిచేస్తాయా..?
     పనిచేయవు
    • పీజీ/ హాస్టల్స్ తెరుచుకుంటాయా..?
     పీజీ/ హాస్టళ్లు తెరుచుకుంటాయి
    • తదుపరి తరగతికి ప్రమోట్ అవుతానా..?
     బోర్డు ఎగ్జామ్ రాసిన వారు తప్ప మిగతా వారు ప్రమోట్ అయినట్లే
    • 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా..?
     అవును పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వడం జరిగింది
    • కంటెయిన్‌మెంట్ జోన్లలో పరీక్షలు నిర్వహిస్తారా..?
     లేదు
    • పరీక్ష కేంద్రాన్ని చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందా..?
     అవును రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులు నడుపుతాయి
    • పరీక్ష కేంద్రాల్లో మాస్కులు ధరించాల్సి ఉంటుందా..?
     టీచర్లు, విద్యార్థులు ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి
    • పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ వేర్వేరుగా ఉంటుందా..?
     అవును ఆయా బోర్డులను బట్టి షెడ్యూల్ వేర్వేరుగా ఉంటుంది
    • ఆన్‌లైన్ ఎగ్జామ్ సాధ్యమేనా..?
     అలాంటి ప్రతిపాదనేదీ లేదు
    • డీఎల్‌పీ కోసం స్టడీ మెటీరియల్ కొరియర్ సర్వీసు ఉంటుందా..?
     కొరియర్ చేయొచ్చు. అయితే హాట్‌స్పాట్ లేదా కంటెయిన్‌మెంట్ జోన్లలో ఉండరాదు
    • ఉచితంగా ఏదైనా ఉపశమనం ఉంటుందా..?
     ఎలాంటి ఉపశమనం లేదు. అయితే విద్యాసంస్థలు ఫీజు పెంచకూడదని ప్రభుత్వం ఆదేశించింది.
    ఆరోగ్యం మరియు వైద్యం
     • డయాలసిస్‌కు వెళ్లొచ్చా..?
      అవును వెళ్లొచ్చు
     • వ్యాక్సినేషన్‌కు నా పిల్లలను తీసుకెళ్లొచ్చా..?
      అవును తీసుకెళ్లొచ్చు
     • నా సమీపంలోని ప్రసూతి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో పనిచేస్తాయా?
      అవును పనిచేేస్తాయి
     ప్రయాణం
     • నేను వేరే జిల్లా / రాష్ట్రానికి వెళ్ళవచ్చా?
      ప్రయాణం చేేయొచ్చు. అయితే మీ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలి
     • రైలు సర్వీసులు ప్రారంభం అవుతాయా..?
      రైలు సేవలు ప్రారంభం కావు
     • సొంత కారులో కూడా మాస్కు ధరించాల్సి ఉంటుందా..?
      మాస్కు ధరిస్తే మంచిదే
     • నాలుగు చక్రాల వాహనాలకు అనుమతి ఉందా..?
      కంటెయిన్‌మెంట్ జోన్లలో అనుమతి లేదు. మిగతా జోన్లలో 1+2తో అనుమతి
     • ద్విచక్రవాాహనాలకు అనుమతి ఉందా..?
      1+1తో అనుమతి ఉంది. అయితే కంటెయిన్‌మెంట్ జోన్లలో అనుమతి లేదు
     • విమానంలో ప్రయాణం చేయాలంటే ప్రక్రియ ఏంటి..?
      ఈ-బోర్డింగ్ పాస్ కలిగి ఉండాలి
     • ఈ-బోర్డింగ్ పాస్ స్టాంపింగ్ ఎలా చేయించుకోవాలి..?
      ఈ-బోోర్డింగ్ పాస్ స్టాంపింగ్ ఉండదు
     • సరకు రవాణా వాహనాలకు అనుమతి ఉందా..?
      ఉంది అయితే కంటెయిన్‌మెంట్ జోన్లలో అనుమతి లేదు
     • దేశీయ విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయి..?
      మే 25 నుంచి ప్రారంభం అవుతాయి
     • అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి..?
      ఇంకా నిర్ణయం తీసుకోలేదు
     • విమానాశ్రయంకు నేనెప్పుడు చేరుకోవాలి..?
      విమానం బయలు దేరడానికి రెండు గంటల ముందు
     • మధ్యాహ్నం లేదా సాయంత్రం ఉన్న విమానంకు ఉదయాన్నే ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చా..?
      విమాానం బయలుదేరేందుకు నాలుగు గంటల సమయం ముందు మాత్రమే అనుమతిస్తారు
     • ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు ఎవరు సహాయం చేస్తారు..?
      ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్యాబ్ సర్వీసులు ఇతర ప్రజారవాణా సౌకర్యం కల్పిస్తుంది
     • ఎయిర్‌పోర్టులో విమానంలో మాస్కు ధరించడం తప్పనిసరా..?
      అవును
     • విమానంలోో ప్రయాణించిన తర్వాత క్వారంటైన్‌లో ఉండాలా..?
      నువ్వు వెళ్లే రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను బట్టి ఉంటుంది
     • వెబ్ చెక్‌ ఇన్ తప్పనిసరా..?
      అవును తప్పనిసరి
     • ఎన్ని చెక్‌ ఇన్ బ్యాగ్స్‌ను అనుమతిస్తారు..?
      ఒక్కటి మాత్రమే
     • జబ్బులతో బాధపడుతున్న వారు ప్రయాణం చేయొచ్చా..?
      ప్రయాణం చేయకపోవడం మంచిది
     • గర్భిణీ స్త్రీలు ప్రయాణించొచ్చా..?
      ప్రయాణం చేయకపోవడం మంచిది
     • విమాన ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరా..?
      అవును తప్పనిసరి
     • ఆరోగ్యసేతు యాప్ రెడ్ స్టేటస్ చూపిస్తే పరిస్థితేంటి..?
      విమానంలో ప్రయాణించేందుకు అనుమతించరు
     • క్యాబిన్ సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?
      క్యాబిన్ సిబ్బంది సురక్షితమైన సూట్ ధరించి ఉంటారు
     • విమానంలో మీల్స్ ఏర్పాటు చేస్తారా..?
      లేదు
     • విమానంలో న్యూస్ పేపర్ మరియు మ్యాగజీన్‌లు లభిస్తాయా..?
      లేదు
     • డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాలా..?
      ఆరోగ్యసేతు యాప్‌ లేకుంటే డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాలి
     • విమానంలో బ్యాగేజీ ట్రాలీ ఎంత తీసుకెళ్లొచ్చు..?
      సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది
     • బ్యాగేజ్ పై ట్యాగ్ సంగతేంటి..?
      ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని బ్యాగేజ్‌కు ట్యాగ్ పెట్టాలి
     • బ్యాగేేజ్ ట్యాగ్ లేనిచో ఏంచేయాలి..?
      పీఎన్‌ఆర్ నెంబర్‌ను పేపర్‌పై రాసి లగేజీకి అతికించండి
     • కంటెయిన్‌మెంట్ జోన్లలో ఉంటే విమానంలో ప్రయాణించొచ్చా..?
      ప్రయాణం చేయకపోవడం మంచిది. అంతేకాదు అధికారులకు సమాచారం ఇవ్వాలి
     • కోవిడ్ 19 పాజిటివ్‌గా వస్తే నేను ప్రయాణం చేయొచ్చా..?
      ప్రయాణం చేయకూడదు
     • కోవిడ్-19 ఉన్నప్పటికీ విమానంలో ప్రయాణం చేస్తే చర్యలుంటాయా..?
      చర్యలుంటాయి
     • బ్యాగేజీని ఎలా తీసుకోవాలి
      బ్యాగేజ్ వచ్చేవరకు వేచిచూడాలి
     • రైళ్లు ఎప్పటి నుంచి పరుగులు తీస్తాయి..?
      జూన్‌ 1 నుంచి కేవలం 100 పెయిర్లు మాత్రమే నడుస్తాయి
     • రైల్లో ప్రయాణించేందుకు టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయా..?
      అవును
     • రైలు టికెట్లు కౌంటర్‌లో బుక్ చేసుకోవచ్చా..?
      లేదు. ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ద్వారానే
     • రైలులో ఎవరైనా ప్రయాణించొచ్చా..?
      వ్యాధి లక్షణాలు ఉన్న వారు ప్రయాణం చేయరాదు
     • టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ సమయం ఎంత
      30 రోజుల అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు
     • రిజర్వేషన్ లేని కోచ్‌లను రైలులో ఏర్పాటు చేస్తారా..?
      లేదు
     • రైలు టికెట్ ధరలు పెంచారా..?
      లేదు టికెట్ ధరలు సాధారణంగానే ఉంటాయి
     • దుప్పట్లు రైళ్లలో ఇస్తారా..?
      లేదు. రైళ్లల్లో దుప్పట్లు, లెనిన్ ఇతర వస్తువులు ఇవ్వరు
     • జూన్ 1 నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయి..?
      200 లేదా 100 పెయిర్లు
     • రైల్లో ప్రయాణించేందుకు ఆర్‌ఏసీ / వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంటే చెల్లుతుందా..?
      లేదు. నిర్థారణ టికెట్ ఉంటేనే ప్రయాణం చేయొచ్చు
     • ప్లాట్‌ఫాం టికెట్లు జారీ చేస్తారా..?
      లేదు . నిర్ధారిత టికెట్ ఉన్న ప్రయాణికులనే రైల్వే స్టేషన్‌లోకి అనుమతిస్తారు
     • సీనియర్ సిటిజెన్ మరియు దివ్యాంగులకు టికెట్ ధరల్లో రాయితీ ఉంటుందా..?
      లేదు. సీనియర్ సిటిజన్స్‌కు రాయితీ లేదు. కానీ దివ్యాంగులకు ఇతర 11 కేటగిరీల కింద వచ్చే వ్యాధిగ్రస్తులకు రాయితీ ఉంటుంది
     • ఈ రైళ్లల్లో ఏసీ కోచ్‌లు ఉంటాయా..?
      ఈ రైళ్లలో ఏసీ మరియు నాన్ ఏసీ కోచ్‌లు ఉంటాయి
     • ఈ రైైళ్లల్లో జనరల్ బోగీలు ఉంటాయా..?
      ఉంటాయి. కానీ రిజర్వేషన్ తప్పనిసరి
     • జనరల్ బోగీల్లో చార్జీల ధరలు ఎలా ఉంటాయి..?
      రెండో శ్రేణి ధరలు మాత్రమే ఉంటాయి. అయితే నిర్ధారణ టికెట్ ఉంటుంది
     • తత్కాల్ కోటా ప్రీమియం తత్కాల్ కోటా ఈ రైళ్లలో ఉంటుందా..?
      ఈ రైళ్లలో తత్కాల్ మరియు ప్రీమియం తత్కాల్ కోటా ఉండదు
     • ఈ రైళ్లకు చార్ట్‌ను ఎప్పుడు తయారు చేస్తారు..?
      రైలు బయలుదేరే ముందు నాలుగు గంటలకు తొలి చార్ట్ ఆ తర్వాత రెండు గంటలకు రెండో చార్ట్ తయారు చేస్తారు
     • రైలు ప్రయాణం మొత్తం మాస్కు ధరించి ఉండాలా..?
      అవును ప్రయాణం మొత్తంలో మాస్కు ధరించి ఉండాలి
     • రైలులో ఎక్కేందుకు స్టేషన్‌కు ఎప్పుడు చేరుకోవాలి..?
      రైలు బయలు దేరే 90 నిమిషాల ముందు
     • విమానాయాన సంస్థలు టికెట్ ధరలను పెంచవచ్చా..?
      లేదు. రానున్న మూడు నెలలకు విమాన ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
     • విమానంలో మధ్యలో ఉన్న సీట్లు ఖాళీగా ఉంటాయా..?
      లేదు
     • 40 నిమిషాల విమాన ప్రయాణానికి నేనెంత చెల్లించాల్సి ఉంటుంది..?
      కనీస ధర రూ.2వేలు నుంచి రూ.6వేలు వరకు
     • 40 నిమిషాల నుంచి 60 నిమిషాల విమాన ప్రయాణానికి ఎంత చెల్లించాల్సి ఉంటుంది..?
      రూ.2500 నుంచి రూ.7500 వరకు
     • 60 నిమిషాల నుంచి 90 నిమిషాల విమాన ప్రయాణానికి ఎంత చెల్లించాల్సి ఉంటుంది..?
      రూ.3000 నుంచి రూ.9000 వరకు
     • 90 నిమిషాల నుంచి 120 నిమిషాల విమాన ప్రయాణానికి ఎంత చెల్లించాల్సి ఉంటుంది..?
      రూ.3500 నుంచి రూ.10వేల వరకు
     • 120 నిమిషాల నుంచి 150 నిమిషాల విమాన ప్రయాణానికి ఎంత చెల్లించాల్సి ఉంటుంది..?
      రూ.4500 నుంచి రూ.13000 వరకు
     • 150 నిమిషాల నుంచి 180 నిమిషాల విమాన ప్రయాణానికి ఎంత చెల్లించాల్సి ఉంటుంది..?
      రూ.5500 నుంచి రూ.15700 వరకు
     • 180నిమిషాల నుంచి 220 నిమిషాల విమాన ప్రయాణానికి ఎంత చెల్లించాల్సి ఉంటుంది..?
      రూ.6500 నుంచి రూ.18600
     • విదేశాల నుంచి భారత్‌కు వస్తే క్వారంటైన్ తప్పదా..?
      తప్పదు. ఏడు రోజుల పాటు ఇన్స్‌టిట్యూషనల్ క్వారంటైన్ మరో ఏడు రోజులపాటు హోం క్వారంటైన్
     • నేను గర్భవతిని అయితే ప్రభుత్వం నిర్ణయించే క్వారంటైన్‌లో ఉండాల్సిందేనా..?
      లేదు. హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఫోన్‌లో ఉండాలి
     • 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బిడ్డతో వస్తే నేను ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్‌లో ఉండాల్సిందేనా..?
      లేదు. హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఫోన్‌లో ఉండాలి
     • బంధువులు లేదా కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు భారత్‌కు వస్తే ప్రభుత్వ క్వారంటైన్‌‌లో ఉండాల్సిందేనా..?
      లేదు. హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఫోన్‌లో ఉండాలి
     • భారత్‌కు రావాలంటే ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా ఉండాలా..?
      ఆరోోగ్య సేతు యాప్ ఉండటం మంచిది
     • నాకు కరోనావైరస్ లక్షణాలు లేవు. నేను భారత్‌కు రావొచ్చా..?
      థర్మల్ స్క్రీనింగ్ తర్వాత రావొచ్చు
     • థర్మల్ స్క్రీనింగ్ సమయంలో లక్షణాలు బయటపడితే పరిస్థితేంటి..?
      వెంటనే ఐసొలేషన్‌కు తరలించడం జరుగుతుంది
     • భాారత్‌కు వచ్చిన తర్వాత పాజిటివ్‌గా తేలితే పరిస్థితి ఏంటి..?
      సాధారణంగా ఉంటే హోంక్వారంటైన్‌కు తరలిస్తారు. సీరియస్‌గా ఉంటే దగ్గరలోని మెడికల్ ఫెసిలిటీకి తరలిస్తారు
     • భూమిపై ఉన్న సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చేవారికి ఎలాంటి ప్రొటోకాల్‌లు ఉన్నాయి..?
      విమాన ప్రయాణికులకు ఉన్న ప్రోటోకాల్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి. లక్షణాలు లేని వారిని మాత్రమే సరిహద్దు దాటి భారత్‌లోకి అనుమతించడం జరుగుతుంది
     • నేను విదేశాలకు వెళ్లవచ్చా?
      విదేశాలకు ప్రయాణం చేయలేవు
     • భారత్‌లో దేశీయ విమానాయాన సర్వీసులు లాక్‌డౌన్ తర్వాత ప్రారంభం అవుతాయా..?
      ఎంపిక చేయబడ్డ రూట్లలో మాత్రమే దేశీయ విమాన సర్వీసులు ఉంటాయి
     • అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయా
      వందేభారత్ మిషన్ విమానాలు తప్ప మిగతావాటికి అనుమతి లేదు
     • దేశవ్యాప్తంగా హోటళ్లు రిసార్టులు తెరుచుకుంటాయా..?
      లేేదు
     • పర్యాటక ప్రాంతాలకు ప్రజలు వెళ్లొచ్చా..?
      లేేదు
     • ప్రత్యేక రైళ్లు నడుస్తాయా..?
      నడుస్తాయి. కానీ కంటెయిన్‌మెంట్ జోన్లలో కాదు
     వ్యాపార వర్గం
      • పన్ను మినహాయింపు ఉంటుందా..?
       ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
      • స్టార్ట్‌అప్స్‌కు ఏమైనా ఆర్థిక సహకారం లభిస్తుందా..?
       దీనిపై ప్రభుత్వం ఒక ప్యాకేజ్ ప్రకటన చేయాల్సి ఉంది
      • టీడీఎస్ మాఫీ అవుతుందా..?
       అవును 25శాతం వరకు అవుతుంది.అయితే నిరుద్యోగివై ఉంటేనే.
      న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
      Enable
      x
      Notification Settings X
      Time Settings
      Done
      Clear Notification X
      Do you want to clear all the notifications from your inbox?
      Settings X