National Help Line Number
+91-11-23978046
Toll Free No: 1075

భారత్‌లో కరోనావైరస్ నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు

Oneindia
అండమాన్ మరియు నికోబార్ దీవులు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    నెగిటివ్ వస్తే హోం క్వారంటైన్ లక్షణాలు కనిపిస్తే కోవిడ్-19 సెంటర్లకు తరలింపు
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    లక్షణాలు లేనివారందరిని ఇళ్లకు వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు అనుమతిస్తారు. లక్షణాలు ఉన్నవారిని కోవిడ్ సెంటర్‌కు తరలిస్తారు
ఆంధ్రప్రదేశ్
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి ఆంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఏపీ ప్రభుత్వం సూచించిన స్పందన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. https://www.spandana.ap.gov.in/online_user. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.నెగిటివ్ వచ్చిన వారికంతా హోంక్వారంటైన్ తప్పనిసరి. కోవిడ్ హాట్‌స్పాట్‌ నుంచి వచ్చినట్లయితే వారం రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌ మరో వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది.
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    టికెట్ కొనుగోలు చేసేముందు ప్రభుత్వం సూచించిన స్పందన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. https://www.spandana.ap.gov.in/online_user. ఇతర దేశాల నుంచి వచ్చిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.నెగిటివ్ వచ్చిన వారికంతా హోంక్వారంటైన్ తప్పనిసరి. లక్షణాలు ఉంటే వారం రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌ మరో వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    రాష్ట్రంలో ప్రయాణించొచ్చు. అయితే ఎక్కడికక్కడ తనిఖీలు ఉంటాయి
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    స్థానికులు మాత్రమే అనుమతి ఉంది. స్థానికేతరులకు అనుమతి లేదు
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు ఉంటే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తారు . ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి
అస్సాం
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    వ్యాధి లక్షణాలు లేకుంటే రాష్ట్రంలో ప్రయాణించొచ్చు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ప్రభుత్వ క్వారంటైన్‌లో ఏడు రోజులు, హోం క్వారంటైన్‌లో మరో ఏడు రోజులు తప్పనిసరి. గర్భవతులు, 75 ఏళ్లు పైబడిన వృధ్ధులు, బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేవారు, పదేళ్లలోపు పిల్లలు, దివ్యాంగులు, హాస్పిటల్‌లో ఉన్న పేషెంట్లను పరామర్శించేవారికి మినహాయింపు ఉంది.
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి వచ్చేవారంతా రాష్ట్రానికి చేరుకోగానే 7 రోజుల పాటు ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉంటామని డిక్లరేషన్ ఇవ్వాలి. అనంతరం 7 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. అయితే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు , 10ఏళ్ల లోపు పిల్లలకు, అంత్యక్రియలకు హాజరయ్యేవారికి మినహాయింపు ఉంది.
బీహార్
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి ఆంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    సూరత్, అహ్మదాబాద్, ముంబై, పూణే , ఢిల్లీ, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా, కోల్‌కతా, వెస్ట్ బెంగాల్, గురుగ్రామ్, మరియు బెంగళూరు నుంచి వచ్చే వారికి 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి
  • బీహార్‌కు ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    రావొచ్చు. కానీ 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. అదే సమయంలో లక్షణాలు ఉంటే మెడికల్ ఫెసిలిటీకి తరలిస్తారు.
ఛత్తీస్గఢ్
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    రాష్ట్రంలోో స్వేచ్ఛగా తిరగొచ్చు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఇతర రాష్ట్రాల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు రావొచ్చు. అయితే ఈ వెబ్‌సైట్ https://raipur.gov.in/cg-covid-19-epass/. లో లాగిన్ అయి ఈ-పాస్ పొందాల్సి ఉంటుంది. లక్షణాలు కనిపిస్తే కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తారు. లక్షణాలు లేకుంటే 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    లక్షణాలు లేనివారు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. ఐసొలేషన్ నిబంధనలు పాటిస్తామని చెబుతూ డిక్లరేషన్ ఇవ్వాలి
ఢిల్లీ
  • ఢిల్లీలో నేను ప్రయాణించొచ్చా..?
    ఢిల్లీలో ప్రయాణించేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు. ఢిల్లీలో ప్రయాణించేందుకు డీటీసీ బస్సులు ఉన్నాయి. అదే సమయంలో పబ్లిక్ మరియు ప్రైవేట్ వాహనాలు తిరిగేందుకు అనుమతి ఉంది
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఢిల్లీకి రావొచ్చు కానీ 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా కోవిడ్-19 టెస్టులు చేయించుకోవాలి. 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలి. దీని తర్వాత లక్షణాలు లేనివారిని 7 రోజుల పాటు హోంక్వారంటైన్‌కు తరలిస్తారు. ఢిల్లీకి చేరుకునే ముందే ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. https://www.mygov.in/aarogya-setu-app/
గోవా
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి ఆంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    గోవాకు చేరుకోగానే లక్షణాలు లేకపోతే టెస్టులు అవసరం లేదు. కానీ 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి వచ్చేవారు కచ్చితంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాలు వచ్చేవరకు క్వారంటైన్‌లో ఉండాలి
గుజరాత్
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    రాష్ట్రంలో తిరిగేందుకు ఆంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఇతర రాష్ట్రాల నుంచి గుజరాత్‌కు వచ్చేవారు రాష్ట్ర లేదా జిల్లా అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం digitalgujarat.gov.in కు లాగిన్‌ అయి నమోదు చేసుకోవాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి సూరత్‌కు చేరుకునే ప్రయాణికులు http://www.suratmunicipal.gov.in పై వివరాలను నమోదు చేయాలి. లక్షణాలు లేనివారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి
హర్యానా
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    నెగిటివ్ ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించొచ్చు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    లక్షణాలు కనిపించని వారికి 14 రోజుల పాటు హోంక్వారంటైన్. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి 7 రోజులు ప్రభుత్వం సూచించిన పెయిడ్ క్వారంటైన్‌ మరో 7 రోజులు హోంక్వారంటైన్
హిమాచల్ ప్రదేశ్
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి నిబంధనలు లేవు, రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రెడ్ జోన్ల నుంచి వస్తున్నట్లయితే ప్రభుత్వ క్వారంటైన్‌లో 14రోజుల పాటు ఉండాలి. కోవిడ్-19 నెగిటివ్ వస్తే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. రాష్ట్రంలోకి అడుగు పెట్టేవారంతా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఏడు రోజులు ప్రభుత్వ క్వారంటైన్‌ మరో 21 రోజులు హోంక్వారంటైన్‌లో ఉండాలి. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి
జమ్మూ కాశ్మీర్
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి నిబంధనలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. వ్యాధి లక్షణాలు లేకుంటే 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. కోవిడ్-19 టెస్టులు నెగిటివ్ వచ్చే వరకు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    తప్పని సరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. 14 రోజుల పాటు ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉంటారు. మళ్లీ నెగిటివ్ వస్తే హోంక్వారంటైన్‌కు తరలిస్తారు.
జార్ఖండ్
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    రాష్ట్రంలోో స్వేచ్ఛగా తిరగొచ్చు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలో ప్రయాణం చేయొచ్చు. అయితే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    పాజిటివ్ రాకుంటే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌కలో ఉండాలి
కర్ణాటక
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలో ప్రయాణించాలంటే ఎలాంటి ఆంక్షలు లేవు..పాసులు కూడా అవసరం లేదు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    కర్నాటక రాష్ట్రం నుంచి బయటి రాష్ట్రాలకు ఎలాంటి పాస్ లేకుండానే వెళ్లొచ్చు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి కర్నాటకకు వచ్చేవారు మాత్రం సేవ సింధు యాప్ ద్వారా పాసులు పొందాల్సి ఉంటుంది.ఇందుకోసం(https://sevasindhu.karnataka.gov.in/Sevasindhu/Kannada?ReturnUrl=%2F). కర్నాటకకు వచ్చేవారు 14 రోజుల పాటు తప్పకుండా హోంక్వారంటైన్‌లో ఉండాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే ప్రభుత్వం గుర్తించిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలి
  • తమిళనాడు లేదా ఢిల్లీ నుంచి కర్నాటకకు వస్తున్నట్లయితే ఇన్స్‌టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందా..?
    అవసరం లేదు.. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుంది
  • మహారాష్ట్ర నుంచి నుంచి కర్నాటకకు వస్తున్నట్లయితే ఇన్స్‌టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందా..?
    అవును ఏడు రోజుల పాటు ఇన్స్‌టిట్యూషనల్ క్వారంటైన్.. మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి
  • కర్నాటకకు వందేమిషన్ ద్వారా విదేశాల నుంచి రావాలనుకుంటున్నాను. రావొచ్చా..?
    రావొచ్చు . కానీ సేవ సింధు పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. sevasindhu.karnataka.gov.in . కర్నాటక నుంచి ఇతర దేశం అనే ఫారంను పూర్తి చేయాలి. అంతకుముందు ఆయా ప్రభుత్వాలు నిన్ను క్వారంటైన్‌లో ఉంచాయా అనే వివరాలు తెలపాల్సి ఉంటుంది
కేరళ
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    వ్యాధి లక్షణాలు లేకుంటే రాష్ట్రంలో ప్రయాణించొచ్చు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    లక్షణాలు లేని వారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. వ్యాధి లక్షణాలు ఉన్నవారు కోవిడ్ కేర్ సెంటర్లలో 14 రోజులు పాటు ఉంటారు.
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి రాష్ట్రంకు వచ్చేవారు ఈ - పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. విమాన టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికులు covid19jagratha.kerala.nic.in లో వివరాలను నమోదు చేసి ఈ-పాస్ పొందాలి
మధ్యప్రదేశ్
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    ఎలాంటి ఆంంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    మధ్యప్రదేశ్‌కు వచ్చేవారు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి. ఈ- పాస్ కూడా దరఖాస్తు చేసుకోవాలి.ఇందుకోసం www.mapit.gov.in/covid-19 కు లాగిన్ కావాలి. లక్షణాలు ఉన్న ప్రయాణికులు ప్రభుత్వ క్వారంటైన్‌లో 14 రోజులు ఉండాల్సి ఉంటుంది. లక్షణాలు లేనివారు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంకు విదేశాల నుంచి వచ్చేవారు కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారు. లక్షణాలు లేనివారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్‌లో 7 రోజుల పాటు ఉంటారు. మరో 7 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంటారు. లక్షణాలు ఉన్నవారిని మాత్రం కోవిడ్-19 ఫెసిలిటీకి తరలిస్తారు. ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి. పాస్ అక్కర్లేదు
మహారాష్ట్ర
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    హాట్‌స్పాట్‌లను మినహాయిస్తే మిగతా చోట్ల ప్రయాణించొచ్చు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలోకి అడుగుపెట్టగానే థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. లక్షణాలు కనిపిస్తే కోవిడ్ కేర్ హాస్పిటల్స్‌కు తరలిస్తారు. లేదంటే 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌కు తరలిస్తారు
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి. https://www.mygov.in/aarogya-setu-app/ పై వివరాలు నమోదు చేయాలి
మణిపూర్
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి నిబంధనలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఒక వేళ లక్షణాలు కనిపించకపోతే హోంక్వారంటైన్‌కు స్టాపింగ్ ఇవ్వడం జరుగుతుంది. లక్షణాలు ఉంటే ఐసొలేషన్‌కు తరలిస్తారు.విమానాల ద్వారా వచ్చే వారు క్వార్ మాన్ యాప్ ను ఇన్స్‌టాల్‌ చేసుకోవాలి.క్వారంటైన్ సమయం ముగిసేవరకు ఆ వ్యక్తి యాప్‌లో సెల్ఫీలను అప్‌లోడ్ చేయాలి. ఇలా ప్రతి రెండు గంటలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అప్‌లోడ్ చేయాలి. ఇందుకోసం https://quarmonmanipur.nic.in/quarmon/ లింక్ పై క్లిక్ చేయండి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి. గ్రీన్ స్టేటస్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణించేందుకు అనుమతిస్తారు. లక్షణాలు లేనివారు 14 రోజుల పాటు హోంక్వారంటైన్ ఉండాలి. లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్ వార్డుకు తరలిస్తారు.
మేఘాలయ
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    ఆంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఈ - పాస్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మేఘాలయాలోకి అనుమతి లేదు. ఈ-పాస్ కోసం https://serviceonline.gov.in/epass/. అప్లయ్ చేయాలి. 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    48 గంటల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచుతారు. కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వస్తే ఇంటికి పంపుతారు
మిజోరం
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    ఆంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగుతాయి. నిత్యావసర సేవలు అందిస్తున్న వాహనాలకు అనుమతి ఉంది.
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు ఉంటే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తారు
నాగాలాండ్
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    ఎలాంటి ఆంంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    స్థానికులకు మాత్రమే అనుమతి ఉంది. nCovid-19లో ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులందరినీ అబ్జర్వేషన్ సెంటర్‌కు తీసుకెళతారు.
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    నాగాలాండ్‌కు చెందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. nCovid-19 పై వివరాలను నమోదు చేసి ఈ-పాస్ పొందాలి. ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి. రాష్ట్రంలోకి రాగానే 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌ మరో 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి
ఒడిషా
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    రాష్ట్రంలోో స్వేచ్ఛగా తిరగొచ్చు ఎలాంటి నిబంధనలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలో ప్రయాణం చేయొచ్చు. అయితే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు ఉంటే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తారు
పుదుచ్చేరి
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    ఆంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలో ప్రయాణం చేయొచ్చు. అయితే https://epass.py.gov.in కు లాగిన్ అయి వివరాలు నమోదు చేయాలి. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు కనిపిస్తే కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తారు
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు ఉంటే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తారు
పంజాబ్
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి నిబంధనలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలోకి అడుగుపెట్టగానే థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. లక్షణాలు కనిపిస్తే కోవిడ్ కేర్ హాస్పిటల్స్‌కు తరలిస్తారు. లేదంటే 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌కు తరలిస్తారు
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    రావొచ్చు. కానీ విమానం ఎక్కేముందు కోవా పంజాబ్ యాప్ పై వివరాలు నమోదు చేయాలి. రాష్ట్రానికి వచ్చాక 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలి. నెగిటివ్ వస్తే హోంక్వారంటైన్‌లో ఉండాలి
రాజస్థాన్
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి నిబంధనలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలోకి వస్తే తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ కేర్ హాస్పిటల్‌కు తరలిస్తారు. అన్ని పరీక్షలు నిర్వహించాకే పాస్‌లు జారీ చేస్తారు. ఎలాంటి లక్షణాలు లేకపోతే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    కేంద్ర హోంశాఖ సూచనల మేరకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
సిక్కిం
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    రాష్ట్రంలో తిరుగొచ్చు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    సిక్కి రాష్ట్రంలోకి అనుమతి స్థానికులకు మాత్రమే ఉంది. స్థానికేతరులకు లేదు
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంకు చెందిన వారికి మాత్రమే అనుమతి. విదేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ తప్పనిసరి
తమిళనాడు
  • రాష్ట్రంలో ప్రయాణించాలంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి..?
    జిల్లా అధికారుల నుంచి పాసులు పొందాల్సి ఉంటుంది. పాసులకు ఈ వెబ్‌సైట్‌ పై దరఖాస్తు చేసుకోవచ్చు https://tnepass.tnega.org/#/user/pass.
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి ఆంక్షలు లేవు.ఈ వెబ్‌సైట్ నుంచి పాసులు పొందాలి. https://tnepass.tnega.org/#/user/pass. మహారాష్ట్ర , గుజరాత్, ఢిల్లీ నుంచి వచ్చేవారికి నెగిటివ్ ఉంటే హోంక్వారంటైన్‌లో ఉండాలి. పాజిటివ్ వస్తే ఐసోలేషన్ క్వారంటైన్‌కు తరలిస్తారు
  • తమిళనాడుకు ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చేవారంతా ఈ-పాస్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌పై వివరాలు నమోదు చేయాలి. రాష్ట్రానికొచ్చాక 14 రోజుల పాటు హోంక్వారంటైన్ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్‌లో ఉండొచ్చు
తెలంగాణ
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    ఎలాంటి ఆంంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఎలాంటి పాస్ అక్కర్లేదు. లక్షణాలు లేనివారికి ఎలాంటి క్వారంటైన్ అక్కర్లేదు. లక్షణాలు ఉన్న వారు మాత్రం 14 రోజుల పాటు కోవిడ్-19 సెంటర్‌లో క్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంకు విదేశాల నుంచి వచ్చేవారు కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారు. లక్షణాలు లేనివారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్‌లో 7 రోజుల పాటు ఉంటారు. మరో 7 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంటారు. లక్షణాలు ఉన్నవారిని మాత్రం కోవిడ్-19 ఫెసిలిటీకి తరలిస్తారు. ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి. పాస్ అక్కర్లేదు
త్రిపుర
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    ఆంంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి అనుమతి లేదు. అయితే వలస కూలీలకు మాత్రం రాష్ట్రంలోకి అనుమతి ఉంది
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు ఉంటే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తారు
ఉత్తర ప్రదేశ్
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    ఎలాంటి ఆంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఎలాంటి పాసులు అక్కర్లేదు. అయితే ఢిల్లీ నుంచి నోయిడా, ఘజియాబాద్ జిల్లాల్లోని కోవిడ్-19 హాట్‌స్పాట్‌ ప్రాంతాలు కంటెయిన్‌మెంట్ జోన్లు నుంచి వస్తున్నట్లయితే ఆయా జిల్లా అధికారుల నుంచి పర్మిట్ ఉండాలి. ఉత్తర్ ప్రదేశ్‌కు వచ్చేవారంతా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలి. నెగిటివ్ వస్తే మరో ఏడు రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలి. ప్రయాణికులు అంతా reg.upcovid.in పై నమోదు చేసుకోవాలి. లేదా 1800-180-5145‌కు కాల్ చేయాలి. అయితే 7 రోజుల కంటే తక్కువ సమయం ఉండేందుకు వచ్చేవారు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే రుజువులు చూపించాలి
ఉత్తరాఖండ్
  • రాష్ట్రంలో తిరగాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి..?
    ఎలాంటి నిబంధనలు ఆంక్షలు లేవు
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలో ప్రయాణం చేయొచ్చు. అయితే అధిక రిస్క్ ఉన్న రాష్ట్రం నుంచి వస్తున్నట్లయితే రాష్ట్రంలో ఏడు రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో ఉండాలి. ఆ తర్వాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు లేని వారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు కనిపిస్తే కోవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తారు.
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలి
పశ్చిమ బెంగాల్
  • ఇతర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేవారికి నిబంధనలు ఏంటి..?
    రాష్ట్రంలోకి అడుగుపెట్టగానే థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. లక్షణాలు కనిపిస్తే కోవిడ్ కేర్ హాస్పిటల్స్‌కు తరలిస్తారు. లేదంటే 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌కు తరలిస్తారు. సంధానే అప్లికేషన్‌పై పూర్తి వివరాలు నింపాల్సి ఉంటుంది.
  • ఇతర దేశాల నుంచి రావాలంటే నిబంధనలు ఏంటి..?
    పశ్చిమ బెంగాల్‌కు వచ్చేవారు తమ వివరాలను సంధానే యాప్‌పై నమోదు చేయాలి. గత రెండు నెలల్లో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలలేదని డిక్లరేషన్ ఇవ్వాలి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X