వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారుతిరావు బయటకు రావడంతో తన కుటుంబం ప్రమాదంలో పడిందన్న అమృత వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది సెప్టెంబర్ 14న జరిగిన పరువు హత్య కేసు సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృతతో పాటు ఆస్పత్రికి వెళ్లి వస్తున్న ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. ఈ ఘటనపై కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు, ఆయన తమ్మడు శ్రవణ్ కుమార్, మరో నిందితుడు కరీంలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ప్రణయ్ కుటుంబానికి హానీ తలపెట్టే అవకాశం ఉందన్న కారణంతో గతేడాది సెప్టెంబర్ 18న పోలీసులు వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులు దాదాపు ఏడు నెలలుగా వరంగల్ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం వారు పిటీషన్‌లు దాఖలు చేస్తున్నా పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వారు ఇంతకాలం బయటకు రాలేకపోయారు. తాజాగా పీడీ కేసులో మారుతి రావుతో పాటు మరో ఇద్దరు నిందితులు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మారుతిరావు కూతురు, ప్రణయ్ భార్య అమృత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Amrutha says that release of her father would put her and her family’s lives in danger.

ఆయన బయటకు వస్తే ప్రణయ్ కుటుంబం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్తానని అమృత అంటోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు బయటకు రావడంపై కన్నకూతురు అమృత అభ్యంతరం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
Amrutha says that release of her father would put her and her family’s lives in danger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X