వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి రాజధానిగా అమరావతి ఒకటే అవసరమా? లేక నాలుగు నగరాలా?: మీ అభిప్రాయమేంటీ?

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజధాని అమరావతిని తరలిస్తారంటూ కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. రాజధాని తరలింపుపై త్వరలోనే ఓ కీల ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన దీనికి కారణమైంది. కృష్ణానదికి సంభవించిన వరదను దృష్టిలో పెట్టుకుని రాజధానిని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తారని, దీన్ని తాము అడ్డుకుని తీరుతామని తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ ప్రకటించాయి.

సాహసోపేత నిర్ణయం: వైఎస్ జగన్ ను ప్రశంసల్లో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!సాహసోపేత నిర్ణయం: వైఎస్ జగన్ ను ప్రశంసల్లో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!

దీనికి అనుగుణంగా ఆయా పార్టీల నాయకులు పోరు బాటకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజధాని అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. అభివృద్ధిని వికేంద్రీకరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమనంగా అభివృద్ధి చెందడానికి రాజధానిని అమరావతికి మాత్రమే పరిమితం చేయకూడదనే డిమాండ్ వినిపిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా నగరాలను ఎంపిక చేసి, వాటిని రాజధానులుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, దానికి సరైన సమయం ఇదేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Recommended Video

ఇంత రచ్చ జరుగుతున్నా జగన్ స్పందించరేం ? || Tammineni Sitaram Responds On AP Capital Changing Issue
Andhra Pradesh State need Amaravathi as one Capital or four cities develop as Capital?

హైదరాబాద్ తరహాలో అభివృద్ధిని ఒకేచోట పరిమితం చేయకూడదని, దీనివల్ల వెనుక బడిన ప్రాంతాలు పురోగమించబోవని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రాజధాని నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా సమన్యాయం చేసినట్టవుతుందని చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయగలరు.

English summary
The Andhra Pradesh secretariat, housed in temporary structures in Velagapudi in Amaravathi capital region, might be shifted to a new location. The seat of administration was moved closer to Vijaywada from Hyderabad, the common capital of Andhra Pradesh and Telangana, in 2016. Since then, close to 2,500 state government employees have been working in the new complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X