వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ మద్దతుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీ నాయకులు ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు ఖరారు చేసుకుంటుంటే.. మరోవైపు కేంద్రంలో హంగ్ వస్తుందన్న అనుమానంతో జాతీయపార్టీలు పొత్తుల బేరాలు షురూ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇంకా మూడు దశల పోలింగ్ మిగిలి ఉండగానే.. హంగ్ ఏర్పడుతుందన్న అనుమానాలు పార్టీల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా వైసీపీ చీఫ్ జగన్ టచ్‌లోకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలు పూర్తికాకముందే కేంద్రంలో హంగ్ తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో జాతీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నిర్ణయించాయి. ఏపీలో 25 లోక్‌సభ స్థానాల్లో కనీసం 20సీట్లు వైసీపీకి వస్తాయని సర్వేలు చెబుతున్నారు. ఆ కారణంగానే ఆ పార్టీని ముందుగానే మచ్చిక చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షా - జగన్‌లు రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

వైఎస్ జగన్ తో టచ్ లోకి వచ్చిన అమిత్ షా! హంగ్ వస్తే కింగ్ మేకరే! మద్దతు కోసం మంతనాలువైఎస్ జగన్ తో టచ్ లోకి వచ్చిన అమిత్ షా! హంగ్ వస్తే కింగ్ మేకరే! మద్దతు కోసం మంతనాలు

BJP Seeking YSRCP support to form government at center

అమిత్ షాతో భేటీలో జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే పొత్తుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పొత్తుల బేరం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున ఈ విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఒకవేళ జగన్ పొత్తుకు సిద్ధంకాకపోతే.. బీజేపీ వైసీపీ నాయకులపై ఉన్న కేసులను బూచిగా చూపించే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హంగ్ వస్తుందన్న అనుమానంతో ఎన్నికలు పూర్తికాక ముందే బీజేపీ పొత్తులకు సిద్ధమవడం, జగన్‌తో అమిత్‌షా భేటీ అవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
BJP trying for YSRCP support to form government at center
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X