వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్‌కు చంద్రబాబు రాసిన లేఖపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా? మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై మాజీ ముఖ్యమంత్రిని ట్విట్టర్ వేదికగా కార్నర్ చేసిన ఆయన.. తాజాగా జగన్‌కు రాసిన లేఖపై స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందనుకున్నామని విజయసాయి రెడ్డి సటైర్ వేశారు. 40ఏళ్ల అనుభవానికి తానుండే విలాసవంతమైన భవనం ఉంటుందా పోతుందా అనే సంశయం తప్ప ఇంకేం కనిపించడంలేదని, ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తానన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచనే లేనట్లుందంటూ ట్వీట్ చేశారు.

ఏపీ రాజధానిలో కృష్ణా కరకట్ట వెంట నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు. బుధవారం మధ్యాహ్నం ఆ లేఖ ముఖ్యమంత్రికి అందినప్పటికీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి స్పందన రాలేదు.

ఇదిలా ఉఁటే టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో జ్యూడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై విజయసాయి రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. ఇది సాహసోపేత నిర్ణయమని ప్రశంసించారు. జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతోందన్న దానికి ఇదొక చిన్న ఉదాహరణ అని ఆయన మరో ట్వీట్ చేశారు.

Do you agree with vijaysai reddy comments on chandra babu letter to CM Jagan

ప్రజా సమస్యలను పక్కనబెట్టిన చంద్రబాబు స్వలాభం కోసం జగన్‌కు లేఖ రాయడంపై విజయసాయి రెడ్డి స్పందన సమంజసమని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
Do you agree with vijaysai reddy comments on chandra babu letter to CM Jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X