వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదా ప్రసక్తే లేదన్న కేంద్రం ప్రకటనను జగన్ ఎలా డీల్ చేస్తారు? మీ కామెంట్ చెప్పండి.

|
Google Oneindia TeluguNews

దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని కేంద్రం ప్రకటించింది. హోదా కోసం ఏపీ, ఒడిశా, రాజస్థాన్, బీహార్, తెలంగాణ, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అభ్యర్థించినా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని స్పష్టం చేసింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ కౌశలేంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. జాతీయ అభివృద్ధి మండలి గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించినా ఇప్పుడు మాత్రం ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశంలేదని కుండబద్దలు కొట్టారు.

హైదరాబాద్‌లో నయా మోసం : కిడ్నీ కొంటామని రూ.21 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లుహైదరాబాద్‌లో నయా మోసం : కిడ్నీ కొంటామని రూ.21 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటన ఏపీ ప్రజలకు శరాఘాతంగా మారింది. రాష్ట్ర పాలనాపగ్గాలు చేప్టటి పారదర్శక పాలన అందించే దిశగా అడుగులేస్తున్న జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని ప్రజలు విశ్వాసంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ప్రత్యేక హోదా సాధించడమే. ఎలాగైనా ఏపీకి హోదా సాధించి తీరుతామని, అది కేవలం వైసీపీ వల్ల సాధ్యమని ఆ పార్టీ నేతలు ధీమాతో చెప్పారు. జగన్ మాటల్ని నమ్మిన జనం ఆ విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారు. ఎన్నికల అనంతరం కూడా ప్రత్యేక హోదా సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

How will jagan deal with center announcing that no special status to any state

తాజాగా ప్రత్యేక హోదా ప్రతిపాదనలేదంటూ ఏపీ ప్రజలు, సీఎం జగన్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ, సీపీఎం తదితర పార్టీలు ముఖ్యమంత్రిని కార్నర్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సీఎంకు లేఖ రాశారు. ప్రత్యేక హోదా సాధిస్తారని నమ్మి ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారని అందులో ప్రస్తావించారు. అయితే నిర్మలా సీతారామన్ ప్రకటనతో ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేలిపోయిందని, ఈ అంశంపై అన్ని పార్టీలతో జగన్ సమావేశం నిర్వహించాలని కోరారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష బృందాన్ని మోడీ వద్దకు తీసుకెళ్లాలని సూచించారు.

కేంద్రం ప్రకటన, ప్రతిపక్షాల ఒత్తిడి నేపథ్యంలో ప్రజా ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు సీఎం జగన్ ఏం చెయ్యబోతున్నారు. మరి నిర్మలా సీతారామన్ మాటలకు జగన్ ఎలా స్పందిస్తారు అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. జగన్ చేసే ప్రకటనపై హోదాపై ఆయనకున్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ప్రకటనపై జగన్ ఎలా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఎలా ముందుకెళ్తే ఫలితం దక్కుతుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
How will jagan deal with center announcing that no special status to any state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X