వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రాచలం ఏపీకి ఇవ్వాలన్న ప్రతిపాదనపై మీ కామెంట్ పోస్ట్ చేయండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భద్రాద్రి ఏ ప్రాంతానికి చెందుతుంది అనే చర్చ మొదలైంది. భద్రాద్రి మినహా మిగతా ప్రాంతమంతా ఏపీలో కలువడంతో .. భద్రాద్రిని కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలుపాలనే డిమాండ్ వస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరినట్టు తెలుస్తోంది. అందుకు గులాబీ దళపతి కూడా సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

తెరపైకి భద్రాద్రి ..?
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ సవ్యంగా పరిపాలనపై ఫోకస్ చేశాయి. పోలవరం ప్రాజెక్టు కోసం కూనవరం, వీఆర్ పురం, చింతూరు సహా ఏడు మండలాలను ఏపీలో అప్పటి ఎన్డీఏ సర్కార్ విలీనం చేసింది. దీనిపై తెలంగాణ ఉద్యమ సంఘాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు భద్రాచలం గురించి ప్రస్తావించారు. దీంతో భద్రాచలం ఏపీలో కలుపాలనే డిమాండ్ చాలారోజుల తర్వాత తెరపైకి వచ్చింది.

if telangana people agree badradri merge with ap

ఇటీవల ఇఫ్తార్ విందు సందర్భంగా ఇరురాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ మధ్య కూడా చర్చ వచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు ఇచ్చిన జగన్ .. భద్రాచలం ఇవ్వాలని కోరారని .. ఇందుకు కేసీఆర్ కూడా సమ్మతించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి గవర్నర్ కూడా సుముఖంగా ఉన్నారని .. కేంద్రం కూడా భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు అంగీకారంతో ఉన్నదని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో భద్రాద్రి సీతారాముని గ్రామాన్ని ఏపీలో కలిపేందుకు తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా ? భద్రాద్రిని ఏపీలో కలుపాలని అక్కడి ప్రజలు నిజంగా కోరుకుంటున్నారా ? మీ కామెంట్ తెలియజేయండి.

English summary
The debate about Bhadrachri belongs to which area. All the rest of the region except Bhadradri is coming in AP. Bhadradri is also demanding to merge with Andhra Pradesh. This already discuss AP CM Jagan, Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X