వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ఫిరాయించిన వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలన్న జగన్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

అమరావతి : వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎంగా పాలనాపగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అసెంబ్లీ సమావేశమైంది. గురువారం అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన పలువురు నాయకులు తనతో టచ్‌లో ఉన్నారని, తాను తలుచుకుంటే తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని అన్నారు.

అన్యాయమైన ఈ సంప్రదాయాన్ని తాను ఎన్నటికీ ఆచరించనని సీఎం జగన్ స్పష్టం చేశారు. చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎవరు పార్టీ మారినా మరో ఆలోచనలేకుండా వారిపై అనర్హత వేటు వేయాలని జగన్ స్పీకర్‌ను కోరారు. వైసీపీలో చేరాలనుకునే వారితో ముందుగా రాజీనామా చేయించిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు.

Jagan demands immediate disqualification of defected mlas

టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరినీ అనైతికంగా వైసీపీలో చేర్చుకోబోమని జగన్ స్పష్టంచేశారు. పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని తేల్చిచెప్పారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలన్న జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
Jagan demands immideate disqualification of defected mla's
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X