వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన ఎమ్మెల్యేకు ఒక న్యాయం..వైసీపీ ఎమ్మెల్యేకు ఒక న్యాయమా? అంటోన్న పవన్ వ్యాఖ్యాలను సమర్థిస్తారా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై ప్రభుత్వం వివక్షత చూపుతోందని పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇస్తే.. సమసి పోయే ఈ వివాదాన్ని నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసేంత వరకూ తీసుకెళ్లిందని ఆరోపించారు. అదే సమయంలో- నెల్లూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ సీనియర్ జర్నలిస్టును కొట్టినా, బెదిరించినా ఆయనపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

జనసేన పార్టీ ఎమ్మెల్యేకు ఒక న్యాయం, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు ఒక న్యాయమా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చట్టం, న్యాయం అనేది అందరికీ సమానమేనని, తమ పార్టీ ఎమ్మెల్యే మీద ఎందుకు వివక్షత చూపుతున్నారని నిలదీశారు. అధికారంలో కూర్చుంటే చట్టాలు చుట్టాలుగా మారతాయా? అని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్టు చేయడానికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ను జారీ చేసినట్టే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు కోసం కూడా వారెంట్ ను జారీ చేయాలని డిమాండ్ చేశారు. జనసేన ఎమ్మెల్యేకు ఒక న్యాయం..వైసీపీ ఎమ్మెల్యేకు ఒక న్యాయమా? అంటోన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యాలను సమర్థిస్తారా? మీ వ్యాఖ్యలను కామెంట్ల ద్వారా తెలియజేయండి.

Jana Sena Party President Pawan Kalyan alleged to Government discrimination on his Party MLA
English summary
Jana Sena Party President Pawan Kalyan was questioned to the Government of Andhra Pradesh led by YSR Congress Party that, Officials and Police department showing discrimination on his Party's Law maker Rapaka Vara Prasad. He was alleged that YSRCP MLA Kotamreddy Sridhar Reddy was not arrested by the Police till the Date. This is the clear indicate the Government showing discrimination on the Political rivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X