వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీచక పోలీసుల వ్యవహారంలో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న పోలీసులు ? మీ కామెంట్ ఏంటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భాగ్యనగర నడిబొడ్డున జరిగిన దారుణాన్ని యావత్ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది. అయితే విద్యార్థినులపై అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేశ్‌పై మాత్రమే పోలీసులు పెద్దలు చర్యలు తీసుకున్నారు. మరో విద్యార్థినిని తాకరాని తోట తాకిన ఏసీపీ ఆనంద్ పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏసీపీ ఆనంద్ విద్యార్థినిని తాకరాని చోట తాకాడని .. అంతేకాదు ఆయుష్ కమిషనర్ వీపుపై చేయి వేసి తీసుకెళ్లాడని గుర్తుచేస్తున్నారు. ఓ సాధారణ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకొని .. ఏసీపీపై వదిలేస్తారా అని విద్యార్థులు, పౌర సమాజ ప్రతినిధులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.

police-misbehavior-with-college-girl-on-protest-in-charminar

ఏసీపీ ఆనంద్‌పై చర్యలు ఎందుకు తీసుకోరని నిలదీస్తున్నారు. కానిస్టేబుల్ పరమేశ్ చిన్న ఉద్యోగి కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకొని చేతులు దులిపేసుకుంటారా అని కొశ్చన్ చేస్తున్నారు. మరోవైపు విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినుల పట్ల పోలీసుల వైఖరి సరికాదని ఖండిస్తున్నాయి. ఏసీపీ ఆనంద్‌పై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీచేశాయి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. చార్మినార్ యూనాని ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థినులపై పోలీసుల అనుచిత ప్రవర్తనపై మీ కామెంట్‌ను తెలియజేయండి.

English summary
The entire community is condemning the tragedy in the charminar unani issue. However, the police acted only on Constable Paramesh, who acted inappropriately towards the students. Students are questioning the condition of ACP Anand who touched the garden of another student
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X