వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో వీవీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలన్న ఛైర్మన్ ప్రతిపాదనపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖుల సిఫార్సు లేఖలపై కేటాయించే బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. టీటీడీకి నిత్యం బోర్డు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖుల లేఖల ఆధారంగా వేల సంఖ్యలో బ్రేక్ దర్శనాల స్లాట్లు కేటాయిస్తున్నారు. ఫలితంగా సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

share your opinion on chairman decision on canceling VVIP break darshan at tirumala

గత ప్రభుత్వ హయాంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదు. తాజాగా టీటీడీ బాధ్యతలు చేపట్టిన సుబ్బారెడ్డి, ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు చేశారు. ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రత్యామనాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అర్చనాంతర దర్శనం విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టేందుకు.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు ఛైర్మన్ చెప్పారు. అయితే సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేసిన టీటీడీ ఛైర్మన్ ప్రొటోకాల్‌లో వ్య‌క్త‌ుల‌కు ప్రాధాన్య‌త‌.. ప్ర‌ముఖ‌ల బ్రేక్ దర్శనాలు మాత్రం కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. సిఫార్సు లేఖలపై వీవీఐపీ దర్శనాన్ని రద్దు చేయాలన్న ఛైర్మన్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
share your opinion on chairman decision on canceling VVIP break darshan at tirumala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X