వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనంపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఉత్సాహం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అధికార టీఆర్ఎస్‌ ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో విజయం సాధించగా... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికవడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. మిగిలిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12మంది టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండటంతో టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీన ప్రక్రియ పూర్తైంది.

మాటల్లో కాదు చేతల్లో చూపండి.. అలీగఢ్ ఘటనపై శివసేన ఆగ్రహం.. మాటల్లో కాదు చేతల్లో చూపండి.. అలీగఢ్ ఘటనపై శివసేన ఆగ్రహం..

టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎల్పీ విలీన ఉత్తర్వులు రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరపనున్నటలు కోర్టు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Share your opinion on Congress merging with TRS

సీఎల్పీ తీర్మానం లేకుండానే 12 మంది ఎమ్మెల్యేలు విలీనాన్ని కోరడం, స్పీకర్ దాన్ని యథాతథంగా ఆమోదించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయానని కోరుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలంటూ నేతలు గతంలోనే ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఆధారాలు సమర్పించినా చర్యలు తీసుకోని స్పీకర్ హడావిడిగా విలీన ప్రక్రియ పూర్తి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేయాలని వారు న్యాయస్థానాన్ని కోరారు.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేతలు మాత్రం స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. విలీన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరిగిందని అంటున్నారు. గతంలో విలీనాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు రాద్దాంతం చేస్తోందని ప్రశ్నింస్తున్నారు.

English summary
Share your opinion on Congress merger with TRS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X