వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అవినీతిపరుడన్న మోడీ వ్యాఖ్యలకు ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడంపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘన ఫిర్యాదుల్లో ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ మరో క్లీన్ చిట్‌ ఇచ్చింది. తాజాగా రాజీవ్‌గాంధీ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీపై చేసిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొన్ని గంటల్లోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

రాజీవ్‌గాంధీ అవినీతిపరుడంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం మోడీకి ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఏ నియమాలను ఆయన ఉల్లంఘించలేదని అభిప్రాయపడింది. ఈ కారణంగా మోడీపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ప్రధాని మోడీపై చేస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘం వరుసగా క్లీన్ చిట్‌లు ఇస్తుండటంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రసంగాల్లో ఎలాంటి కోడ్ ఉల్లంఘనలు జరగడంలేదన్న ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Share your opinion on EC clean chit to modi for No 1 bhrashtachari remarks on rajeev gandhi
English summary
Share your opinion on EC clean chit to modi for No 1 bhrashtachari remarks on rajeev gandhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X