వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనేం తప్పు చేశానంటున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల ఫ‌లితాలపై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌జ‌ల‌కు అన్నీ చేసినా.. నేనేం తప్పు చేశారని ఈ తీర్పు ఇచ్చారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. కుప్పంలో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అక్క‌డి మ‌హిళ‌లు చంద్ర‌బాబు వ‌ద్ద క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌టం ఏంటంటూ రోదించారు. చంద్ర‌బాబు వారికి ధైర్యం చెప్పారు. తాను 14 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా..ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌ని చేసాన‌ని గుర్తు చేసారు. అయితే, కార్య‌క‌ర్త‌ల మీద దాడులు చేస్తే అక్క‌డికే వెళ్లి తాను తిష్ట వేస్తాన‌ని హెచ్చ‌రించారు.

కుప్పంలో చంద్ర‌బాబు రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స్థానికుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో ప‌లువురు మ‌హిళ‌లు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వ‌చ్చి క‌న్నీటి ప‌ర్యంతమయ్యారు. మీరు ఓడిపోవ‌టం ఏంటంటూ రోదించిన వారికి చంద్ర‌బాబు ధైర్యం చెప్పారు. అంద‌రి బాగోగులు తాను చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. 35 ఏళ్లుగా కుప్పంలో త‌న‌కు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ మ‌ర్చిపోలేన‌ని వివ‌రించారు. కుప్పం అభివృద్ది కోసం ..అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర పురోగ‌తి కోసం తాను చేసిన కృషిని వివ‌రించారు. అనంత‌పురంలో క‌రువు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి కొరియా వెళ్లి కియో ఫ్యాక్టరీ తీసుకొచ్చాన‌ని వివ‌రించారు. ఇన్ని ప‌నులు చేస్తే ప్ర‌జ‌లు ఎలా తీర్పు ఇచ్చారో అర్దం కాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

what I have done wrong Chadrababu ask party supporters

ఇదిలా ఉంటే తానేం తప్పుచేశాని ఓడించారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసినందుకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. నిజంగా తప్పు చేయకుంటే ప్రజలు ఎందుకు శిక్షించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద తానేం తప్పు చేశానని శిక్ష వేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
please post ur comment on chadrababu asking 'what I have done wrong'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X