వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సీఎస్ బదిలీకి కారణమెంటి? 1. జగన్, మోడీ కుట్రలు? 2. చంద్రబాబు తప్పుడు విధానాలు? మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎల్.వి. సుబ్రహ్మణ్యంను ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పునేఠను ఎన్నికల విధులతో సంబంధంలేని పోస్టులో నియమించాలన్న ఈసీ.. శనివారం ఉదయం 11 గంటల్లోపు తమ నిర్ణయాన్ని అమలుచేయాలని స్పష్టంచేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం రాత్రి సీనియర్ ఐఏఎస్ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఫునేఠకు ఏ పోస్టు ఇవ్వలేదు.

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఎబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో అనిల్ చంద్ర ఫునేఠ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తొలుత ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చానా మరుసటి రోజు సీఎస్ పునేఠ ఎన్నికల విధుల పరిధిలోకి ఏయేఅధికారులు వస్తారో పేర్కొంటు జీవో జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 28ఎ ప్రకారం నిఘా విభాగాధిపతిని బదిలీ చేసే అధికారం ఈసీకి లేదన్న అంశాన్ని అందులో ప్రస్తావించారు. ఆ జీవో ప్రకారం ఈసీ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ఎబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రద్దు చేశారు. మరోవైపు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు నిఘా విభాగాధిపతిని బదిలీ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు లేదని న్యాయస్థానంలో వాదించింది. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

what is the reason behind AP CS Transfer

ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ పదే పదే ఫిర్యాదులు చేస్తుండటం వల్లే ఎలక్షన్ కమిషన్ ఏపీ సీఎస్‌ను మార్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మోడీ, జగన్ కుట్రపన్ని ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కొత్తగా నియమితులైన ఎల్వీ సుబ్రమణ్యంకు జగన్‌తో సంబంధాలున్నాయని అంటున్నారు. జగన్‌పై నమోదైన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేుసలో ఎల్వీ సుబ్రమణ్యం విచారణ ఎదుర్కొన్నారు. ఏపీఐఐసీ ఎండీగా పనిచేసిన తాను మంత్రిమండలి నిర్ణయాలు మాత్రమే అమలుచేశానని, అందుకే తనపై కేసు కొట్టివేయాలని ఎల్వీ సుబ్రమణ్యం అప్పటి ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దీన్ని అనుమతించిన హైకోర్టు 2018 జనవరి 4న కేసు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. ప్రస్తుతం అది విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో వివాదాస్పదుడైన ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఏపీ సీఎస్ నియమించడం కుట్రలో భాగమని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
what is the reason behind AP CS Transfer? Is this jangan, modi conspiracy? or chandrababu wron Decisions?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X