వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సీఎం కావడానికి కారణం బాబు వైఫల్యమా లేక వైఎస్ మీద నమ్మకమా? మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

అభిమానుల కేరింతలు, సీఎం సీఎం అంటూ నినాదాల నడుమ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం సరిగ్గా 12.23 గంటల ముహూర్తానికి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, వైఎస్‌ జగన్‌తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని కూడా ప్రమాణం వైసీపీ అధినేత ప్రమాణం చేశారు. ఆ సమయంలో వేదికకు ఎడమవైపున ఆశీనురాలైన ఆయన మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ ఉద్వేగానికి లోనై కంటతడిపెట్టారు.

What is the reason for Jagan becoming CM of AP. Is it babu failure? or belief on YS?

ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నిక్లోల టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. 1982లో పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర పరాభవాన్ని టీడీపీ చవి చూసింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, పాలనా వైఫల్యాలే జగన్ అధికారం చేపట్టేందుకు కారణమన్న వాదనలు వినిపించాయి. మరోవైపు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ జగన్ చేపట్టిన పాదయాత్ర, భవిష్యత్తుపై భరోసా కల్పించేలా ఆయన ఇచ్చిన హామీలు ప్రజల్లో నమ్మకం కలిగించాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఏపీ సీఎంగా కావడానికి చంద్రబాబు వైఫల్యాలు కారణమా లేక వైఎస్‌పై ఉన్న నమ్మకమే ఆయనకు రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టేందుకు కారణమైందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
What is the reason for Jagan becoming CM of AP. Is it babu failure? or belief on YS?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X