తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడులో పట్టుబడ్డ 1381 కిలోల టీటీడీ బంగారం.. మీ కాంమెంట్ ఏంటీ ?

|
Google Oneindia TeluguNews

రెండ్రోజుల క్రితం తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు టీటీడీ చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు ఎన్నికల అధికారులు. స్విట్జర్లాండ్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేశారని చెబుతున్నారు. కానీ ప్యాక్ చేసిన బంగారంపై మాత్రం బ్రిటీష్ ఎయిర్ వేస్ లేబుల్స్ కనిపిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా కొనుగోలు జరిగిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే బంగారంపై పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన సీలు కానీ ముద్రలు కానీ లేవు. ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

What is your opinion on the gold that was caught by EC

మరోవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నసమయంలో ఎలాంటి రసీదులు లేకుండా ఇంతపెద్ద మొత్తంలో బంగారం ఎలా తరలిస్తారనే ప్రశ్న కూడా సమాధానం లేదు. సాధారణంగా రూ.50 లక్షలు విలువ చేసే బంగారం కానీ, నగదు కానీ ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు తరలించే సమయంలో పూర్తి ఎస్కార్టు మధ్య అధికారులు తరలించాలని రిజర్వ్ బ్యాంకు నిబంధనలు పేర్కొంటున్నాయి. మరి రూ.400 కోట్లు విలువ చేసే 1381 కిలో బంగారం తరలించేటప్పుడు కనీస భద్రత తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారనేది మరో ప్రశ్న. ఈ బంగారం వెనక కథ ఏమై ఉంటుంది... టీటీడీ అధికారుల హస్తం ఈ గోల్‌మాల్‌లో కనిపిస్తోందా... పట్టుబడింది కాబట్టి ఈ గోల్ మాల్ విషయం బయటపడింది...ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగే ఉంటాయనే అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీ అభిప్రాయమేంటో ఇక్కడ రాయండి

English summary
The gold that was caught by the flying squad in tamilnadu that was being transported to the temple town tirupati is raising many dobts. TTD officials not giving the correct information is leading to many doubts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X