వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన తెలంగాణా స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? మీ కామెంట్ ఏంటి ?

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యనున్నారా ?తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌రిగే స్థానిక సంస్థ‌ల పోరులో పోటీ చేసే అంశం పైనే ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌న చేస్తున్నారా ? ఒకవేళ పోటీ చేస్తే ఏ పార్టీ కి లాభం ఏ పార్టీ కి నష్టం అన్నది ఇప్పుడు తెలంగాణలో చర్చకు కారణం అవుతుంది.

మరో ఎన్నికల సమరానికి జనసేన సిద్దం ! సేనాని ఆమోదం కోసం వేయిటింగ్ !మరో ఎన్నికల సమరానికి జనసేన సిద్దం ! సేనాని ఆమోదం కోసం వేయిటింగ్ !

తెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ తెలంగాణ నేతలు అధినేత వ‌ద్ద ప్ర‌తిపాదిస్తున్నారు. పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌గౌడ్‌, మరో నేత మహేందర్‌రెడ్డి పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ముందు దీనిపైన స‌దీర్ఘ చర్చ జరిపారు . ప‌రిష‌త్ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల‌పై జ‌రుగుతున్నాయ‌ని..ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే మేలు జ‌రుగుతుంద‌ని వారు జనసేనాని ప‌వ‌న్‌ కళ్యాణ్ కు వివ‌రించారు. జనసేన ఉనికి తెలంగాణాలో చాటుకునేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు .

Which party gets benifit , damage if Jansena contest in local bodies election in Telangana

దీని పైన సానుకూలంగా స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య నేతల అభిప్రాయాలు, కార్యకర్తల మనోగతం ఎలా ఉందో చర్చించి తనకు చెప్పాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని స్ప‌ష్టం చేసారు. దీంతో..త్వ‌ర‌లోనే తెలంగాణ స్థానిక సంస్థ‌ల బ‌రిలో పోటీ చేసే అంశం పైన ప‌వ‌న్ నిర్ణ‌యం తీసుకోనున్నారని తెలుస్తుంది.

ఇక ఈ నేపధ్యంలోనే జనసేనాని తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిస్తే ఏ పార్టీ కి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి .. జనసేన తెలంగాణా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా ? ఎవరితో అయినా పొత్తులతో ఎన్నికలకు వెళ్ళే ఆలోచన పవన్ చేస్తారా అన్న సందేహాలు కూడా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఏది ఏమైనా ఒకేవేల జనసేన తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంటే , జనసేన తెలంగాణాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? మీ కామెంట్ ఏంటి ?

English summary
The Janasena Party is supposed to contest the Lok Sabha elections in Telangana local body elections. If Janasana will contest Which party will have difficulties in the election of Telangana local bodies? Will Jasanana influence the Telangana election? Who is the benificiary and who is the damaged one if janasena contested in local body elections in telangana ? what is your comment ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X