వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు అన్యాయానికి కారణం ఎవరని భావిస్తున్నారు? మీ కామెంట్ చెప్పండి

|
Google Oneindia TeluguNews

బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మరోసారి అన్యాయం జరిగింది. తెలుగింటి కోడలు తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు అరకొర నిధులే దక్కాయి. ఒక్క కొత్త పథకం లేకపోవడం, ఇరు రాష్ట్రాల పట్ల వివక్షకు నిదర్శనంగా నిలిచింది. ఏపీకి సహకారం ఉంటుందని చెప్పడమే తప్ప ఒడ్జెట్‌లో మాత్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్రం నుండి వెళ్లే ప‌న్నుల్లో రాష్ట్ర వాటాగా వ‌చ్చే మొత్తంలో గ‌తం కంటే స్వ‌ల్పంగా పెరుగుద‌ల క‌నిపించిందే తప్ప పోలవరంకు కేటాయింపులు, విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన నిధుల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించనే లేదు. అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలో ఇచ్చిన నిధుల గురించి ఆర్థికమంత్రి గుర్తు చేశారే తప్ప ఎలాంటి కొత్త ప్రకటన చేయలేదు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ప్ర‌మాణ స్వీకారానికి ముందే జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ప్ర‌ధానిని క‌లిశారు. ఏపీలో ఆర్దిక ప‌రిస్థితిని పూర్తి స్థాయిలో వివ‌రించారు. కేంద్రం అండ‌గా నిల‌వాల‌ని అభ్య‌ర్దించారు. ప్ర‌ధాని మోదీ సైతం ఇద్ద‌రం క‌లిసి ఏపీని అత్యున్న‌త స్థాయికి తీసుకెళ్తామ‌ని ట్వీట్ చేసారు. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శానానికి వ‌చ్చిన స‌మ‌యంలోనూ ఏపీకి కేంద్రం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు. కానీ, బ‌డ్జెట్లో మాత్రం ఏపీకి ప్ర‌త్యేకంగా కేటాయింపులు ఏవీ లేవు. జాతీయ విద్యా సంస్థ‌ల‌కు నామ మాత్రంగా విదిలించారు. మొత్తమ్మీద బడ్జెట్‌లో ఏపీకి నిక‌రంగా రూ. 34.83 వేల కోట్లు మాత్ర‌మే కేటాయించారు.

who is responsible for injustice in budget allocations for AP and telangana

ఇక తెలంగాణకు సైతం కేంద్రం మొండిచెయ్యి చూపింది. తెలంగాణకు ఎలాంటి కొత్తకేటాయింపులు చేయని మోడీ సర్కారు.. కనీసం నీతి ఆయోగ్ సిఫార్సు పరిగణలోకి తీసుకోలేదు. ఇక తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి సాయం అందించలేదు. భారీ ఎత్తున నిర్మాణం సాగుతున్న కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలన్న టీఆర్ఎస్ డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోలేదు.
మొత్తం బడ్జెట్‌లో పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ.19 వేల కోట్ల రూపాయలకు పైగా చూపిన కేంద్రం, ఈసారి కూడా రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.

మిషన్‌ కాకతీయ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా ఈ పథకం గురించి కూడా కేంద్రం పట్టించుకోలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా జలశక్తి పథకానికి రూ.10 వేల కోట్లు ఎలా సరిపోతాయనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒక్క తెలంగాణలోనే మిషన్‌ భగీరథకు 40 వేల కోట్ల రూపాయలు అవసరం కానుండగా దేశవ్యాప్తంగా 10 వేల కోట్ల రూపాయలు ఎలా సరిపోతాయని ఉన్నతస్థాయి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, స్టీల్‌ ఫ్యాక్టరీ, రైల్వే లైన్లు లాంటి అంశాలను కూడా కేంద్రం పక్కన పడేయడం గమనార్హం. మొత్తమ్మీద బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు న్యాయం జరగకపోవడానికి పాలకుల వైఖరి కారణమా లేక కేంద్రం చిన్న చూపు వల్లే అన్యాయం జరిగిందా? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
who is responsible for injustice in budget alloctions for AP and telangana?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X