వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేబినెట్‌లో ఎవరుండాలి? ఎవరికి ఏ పోర్ట్‌ఫోలియో కేటాయించాలి? మీ కామెంట్ చెప్పండి.

|
Google Oneindia TeluguNews

ఏపీ కొత్త కేబినెట్ రేపు కొలువుదీరనుంది. కొత్తగా మంత్రులయ్యేదెవరో మరికాసేపట్లో తేలిపోనుంది. జగన్ నిర్ణయం కోసం ఆశావహులే కాదు.. ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలిసారి పగ్గాలు చేపట్టిన జగన్ కేబినెట్ కూర్పులో ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. కేబినెట్ కూర్పు గురించి శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుచేసి ముందుగానే తన టీం గురించి అందరు ఎమ్మెల్యేలకు చెప్పడంవారి ఆమోదంతోనే మంత్రి పదవులు కట్టబెట్టడం అరుదైన విషయంగా చెబుతున్నారు.

కేబినెట్‌కు రూపకల్ప‌నలో ఎలాంటి అసంతృప్తులు లేకుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో ప్రాంతీయ - సామాజిక స‌మ‌తుల్య‌త పాటిస్తూ మంత్రుల‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కించుకున్నావారి సమర్థతకు జగన్ పరీక్ష పెట్టనున్నారు. వారి మీద నమ్మకంతో మంత్రిపదవి ఇస్తున్నట్లు చెబుతూనే నిర్దేశిత సమయం ఇచ్చి సమర్థత నిరూపించుకునే అవకాశం ఇవ్వనున్నారు.

Who will get posts in Jagan cabinet?

ప్రస్తుతం ఏర్పడనున్న మంత్రివర్గం రెండేళ్ల వరకు మాత్రమే ఉంటుందన్న విషయాన్ని జగన్ ఎమ్మెల్యేలకు తేల్చిచెప్పనున్నారు. ప్రభుత్వంలో, పార్టీ వ్యవహారాల్లో సమర్థంగా వ్యవహరిస్తారో వారికే తిరిగి అవకాశం ఉంటుందని చెప్పడం ద్వారా మంత్రుల్లో పోటీతత్వం పెంచే వ్యూహాన్ని తెరపైకి తీసుకురానున్నారు. ప్రస్తుతం అవకాశం లభించని వారికి రెండేళ్ల తర్వాత ఛాన్స్ దక్కుతుందని, ఈలోపు పార్టీ బలోపేతానికి కృషి చేస్తేనే మంత్రిగా అవకాశమివ్వాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా ప్రభుత్వ రథసారధిగా తాను ఎంత కఠినంగా ఉంటారో జగన్ నేతలకు పరోక్షంగా హెచ్చరించనున్నారు.

ఏదేమైనా ఏపీ ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్ కేబినెట్ కూర్పులో తనమార్కు చూపాలని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరికి ఏ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే సమర్థంగా పనిచేస్తారన్న అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
Who will get posts in Jagan cabinet?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X