• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా నాగార్జున సక్సెస్ అవుతాడా.. మీ కామెంట్ ఏంటీ?

|

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ 3 అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి హోస్ట్‌గా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్నారు. తొలుత రానా, చిరంజీవి పేర్లు కూడా వినిపించాయి. చివరికి మన్మథుడినే ఆ అవకాశం వరించింది. ఇది తెలుగులో బిగ్‌బాస్ 3 సీజన్ .. సీజన్ 1లో జూనియర్ ఎన్డీఆర్, రెండో సీజన్‌లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌లుగా మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే సీజన్ 2 ఫైనల్ విన్నర్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన వెంకటేశ్ కూడా బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా పనిచేస్తారనే ప్రచారం జరిగింది. కానీ వారందరినీ వెనక్కి నెట్టి కింగ్ అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా పనిచేయబోతున్నారు.

బిగ్‌బాస్ సీజన్ హిందీ నుంచి మొదలైంది. అక్కడ కండలవీరుడు సల్మాన్ ఖాన్ షో చేస్తుంటారు. ఇటు ప్రాంతీయ భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంలో కూదా బిగ్‌బాస్ జరుగుతుంది. అయితే తమిళ్, ఇతర భాషల్లో హోస్ట్‌గా ఒక్కరే చేస్తున్నారు. తమిళ‌లో అయితే కమల్ హాసనే .. మూడో సీజన్‌లో కూడా హోస్ట్‌గా పనిచేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం సీజన్‌కు ఒకరు వ్యవహరిస్తున్నారు. తొలి బిగ్ బాస్ షోను జూనియర్ ఎన్టీఆర్ దిగ్విజయంగా చేశారు.

 will nagarjuna success to bigboss host ?

తారక్ హోస్ట్‌గా సక్సెస్ అయ్యారు. ఆయన ఫెర్మార్మెన్స్ చూసి సీజన్ 2లో కూడా ఆయనే చేస్తారని ప్రచారం జరిగింది. కానీ తెరపైకి నాని వచ్చారు. నాని కూడా షోను రంజుగా తీసుకెళ్లారు. కాంటెస్టెంట్లపై తనదైనశైలిలో మాట్లాడుతూ .. షోను రసవత్తరంగా ముగించారు. ఇక ఇప్పుడు బిగ్‌‌బాస్ 3 వచ్చేసింది.

బిగ్‌బాస్ 1,2 తర్వాత 3 సీజన్‌పై హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాదు హోస్ట్‌గా ఎవరూ చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల నాగార్జున హోస్ట్‌ అని కన్ఫామ్ అయ్యింది. అయితే బిగ్ స్కీన్‌పై అభిమానుల మదిని దోచిన నాగ్ .. వెండితెరపై కూడా ఇదివరకే మెరిశాడు. మీలో ఎవరూ కోటిశ్వరుడు పేరుతో ప్రజల ఆదరణ చూరగొన్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ హోస్ట్‌గా పనిచేయబోతున్నారు. మరి 14 మంది కంటెస్టెంట్లతో ఆయన ఎలా మసులుకోబోతున్నాడు ? కఠినంగా వ్యవహరిస్తాడా ? జాలీగా ఉంటారా ? షోకు మరింత హైప్ తీసుకొస్తారా ? అనే ప్రశ్నలు మొదలుతున్నాయి. ఇంతకీ నాగార్జున్ బిగ్ బాస్ 3 హోస్ట్‌గా సక్సెస్ అవుతాడని మీరు భావిస్తున్నారా ? అయితే మీ కామెంట్‌ను తెలియజేయండి.

English summary
King Akkineni Nagarjuna will be the host of Bigg Boss 3. Initially, the names of Rana and Chiranjeevi were also heard. In the end, Cupid came to that possibility. Bigg Boss 3 season in Telugu .. Junior NTR in Season 1, Natural Star Nani in the second season as hosts. Venkatesh, who was the chief guest for the season 2 finale, was also rumored to be the host of Bigbas 3. finally nag confirmed host
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more