కూతురు పోయిన బాధలో ఉన్నాడు- ఇక్కడితో ఆపేద్దాం
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా హాస్యనటుడు రాజేంద్రప్రసాద్ ఓ పచ్చి బూతు పదంతో తనను తిట్టడం పట్ల అలీ స్పందించారు. దీనికి గల కారణాలు, వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు.
ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకల వేదిక మీద రాజేంద్రప్రసాద్ మాట్లాడుతున్న సమయంలో ఆయన నోటి నుంచి సరదాగా మాట తూలిందే తప్ప ఉద్దేశపూరకంగా ఆయన ఆ పదాన్ని వాడలేదని అలీ చెప్పారు. దీన్ని తీసుకుని మీడియా వైరల్ చేస్తోందని, అది సరికాదని అన్నారు.

రాజేంద్రప్రసాద్ ఓ గొప్ప నటుడని కితాబిచ్చారు అలీ. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ తన కూతురు చనిపోయిన దుఖంలో ఉన్నాడని, ఇంకా ఆయనను బాధపెట్టడం సరికాదని పేర్కొన్నారు. కూతురిలో తల్లిని చూసుకున్నాడని అన్నారు. ఇక్కడితో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేద్దామని, ఇంకా, ఇంకా రచ్చ చేయకుండా వదిలేద్దామని అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో అలీని ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. పచ్చి బూతు పదాన్ని వాడారాయన. పబ్లిగ్గా ఓ వేదికపై నుంచి తోటి నటుడిని అలాంటి బూతు పదంతో తిట్టడం పట్ల రాజేంద్రప్రసాద్ పై వ్యతిరేకత చెలరేగింది.
రాజేంద్రప్రసాద్ నిజస్వరూపం ఇదేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పడ్దాయి. నెటిజన్లు ఆయనను తప్పుపట్టారు. అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు రాజేంద్రప్రసాద్. అలా తిట్టడం సరికాదంటూ కొందరు నటులు, టెక్నీషియన్లు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications