విడాకులకు రెడీ అయిన పవన్ కల్యాణ్ నటి.. పెళ్లైన ఏడాదికే భర్తకు దూరంగా..?

ఈ రోజుల్లో పెళ్లి ఎంత కామన్ అయిందో విడాకులు కూడా అంతే కామన్‌గా మారిపోయింది. మావిడాకులు ఇచ్చినంత సులువుగా , విడాకులు ఇచ్చేస్తున్నారు. కలిసి కాపురం చేయడం కంటే విడిపోయి ఎంజాయ్ చేయడం మేలని నేటితరం భావిస్తున్నట్టే కనిపిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా విడాకులకు మొగ్గు చుపుతున్నారు.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అమలాపాల్, సమంత , నిహారిక వంటి వారు భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరి జీవినాన్ని సాగిస్తున్నారు. తాజాగా మరో సెలబ్రిటీ విడాకులకు రెడీ అయినట్టుగా తెలుస్తుంది.

actress Monika Reddy

వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు పరిచియం అయిన మౌనిక రెడ్డి భర్తకు దూరంగా ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళ్తే..మౌనిక రెడ్డికి బుల్లితెరలో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి. ముఖ్యంగా 'అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు' ‌వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. సూర్య వెబ్ సిరీస్ ద్వారా ఈ అమ్మడు మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

Monika Reddy

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బీమ్లా నాయక్' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. సందీప్ అనే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్న మౌనిక రెడ్డి.. పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో మౌనికరెడ్డి చేసిన హడావిడి అంతాఇంతా కాదు. 28 ఏళ్లుగా పెళ్లి మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నానని.. ఎంతో ఆనందంగా ఉందని చెప్పి.. కేకలు పెట్టింది. సీన్ కట్ చేస్తే..పెళ్లై ఏడాది కూడా గడవకముందే మౌనిక రెడ్డి విడాకులకు రెడీ అయింది.

Monika Reddy marriage

ఆమె పెళ్లి మూడునాళ్ల ముచ్చటే అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. మౌనిక రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పెళ్లికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను తొలగించింది. అంతేకాకుండా తన భర్త సందీప్‌ను సోషల్ మీడియాలో అన్ ఫాలో కూడా చేయడంతో మౌనిక రెడ్డి విడాకులు తీసుకుంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై మౌనిక రెడ్డి ఇప్పటి వరకూ స్పందించలేదు. విడాకులపై ఆమె క్లారటీ ఇస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+