కోరిక తీరింది.. పవన్ కళ్యాణ్ కోసం ఫస్ట్ టైమ్ అలా చేశా..!

అందాల భామ రాశీ ఖన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. "మద్రాస్‌ కేఫ్‌" సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత "జై లవ కుశ", "వెంకీ మామ", "ప్రతి రోజు పండగే" వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌, థాంక్యూ సినిమాల త‌ర్వాత ఆమె తెలుగులో మ‌రో సినిమా చేయ‌లేదు.

ఇక ఇప్పుడు మూడేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీలో నటిస్తుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

actress-rashi-khanna-interesting-comments-on-pawan-kalyan

ఇటీవల రాశీ ఖన్నా పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు ప్రకటించారు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖన్నా పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే అలా చేశానని తెలిపింది. దీంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం హరీష్ శంకర్ కాల్ చేసినప్పుడు నేను కథ వినకుండానే ఒకే చేశాను. పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని చెప్పడంతో.. స్క్రిప్ట్ కూడా వద్దు అని చెప్పానని తెలిపారు. కేవలం పవన్ కోసమే ఈ మూవీ చేశానని.. చాలామందికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనతో సినిమా చేయాలనే డ్రీమ్ ఉంటుంది. తనకు కూడా అలాగే ఉండేదని.. ఈ మూవీ చేయడంతో ఆ కోరిక తీరిందని చెప్పుకొచ్చింది. ఆయనతో పని చేయటం అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేసింది. ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ ప‌వ‌న్ అభిమానులంద‌రికీ ఓ విందు భోజ‌నంలా ఉంటుంద‌ని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరోవైపు రాశీ ఖ‌న్నా చేస్తున్న మరో చిత్రం "తెలుసు క‌దా". స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకురాలు నీరజ కోనా తెరకెక్కిస్తున్నారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్ గా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో, ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+