రద్దయిన అల్లు అర్జున్-అట్లీ సినిమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శక సంచలనం అట్లీ కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కు కథను వినిపించినట్లు అట్లీ ఎన్నోసార్లు చెప్పారు. 'జవాన్ సినిమా హిట్టయితే అవకాశం ఇద్దామన్న ఆలోచనలో బన్నీ ఉండేవారు. అది బ్లాక్ బస్టర్ కావడంతో సినిమా చేయాలని నిర్ణయించుకొని దర్శకుడు చెప్పిన కథను అల్లు అర్జున్ విన్నారు. తర్వాత ఈ సినిమాను ఏ బ్యానర్ లో తీయాలి అనే విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. సన్ పిక్చర్స్ తీస్తుందని వార్తలు వచ్చాయి. అయితే తన తండ్రి అల్లు అరవింద్ ను కూడా భాగస్వామిని చేద్దామనే ఆలోచనతో బన్నీ ఉండేవారు.
వేరే హీరోకు కథ వినిపించిన అట్లీ
చివరకు సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా తీయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఎవరితో పొత్తు లేకుండా సింగిల్ గానే తీస్తామని సన్ పిక్చర్స్ చెప్పింది. వివాదం ఇలా నడుస్తుండగానే అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తీయాల్సిన సినిమా రద్దయింది. ఈ సినిమా చేసినందుకు తనకు రూ.80 కోట్ల పారితోషికం కావాలని అట్లీ నిర్మాతలను డిమాండ్ చేశారు. అయితే దర్శకుడికి అంత ఇస్తే కష్టమని సన్ పిక్చర్స్ భావించి ఇవ్వడానికి నిరాకరించడంతో సినిమా రద్దయింది. ఇదే కథను అట్లీ వేరే హీరోకు వినిపించినట్లు తెలుస్తోంది.

అదేరోజు విడుదలవుతున్న డబుల్ ఇస్మార్ట్
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 చేస్తున్నారు. ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఏడాది క్రితమే ఈ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే దర్శకుడు సుకుమార్ వల్ల షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండటంతోపాటు వీఎఫ్ఎక్స్ పనులపై ఆయన అసంతృప్తిగా ఉండటం కూడా మరో కారణం.
ప్రత్యేక గీతం తీసే విషయంలో కూడా ఆలస్యమవుతోంది. ఈ కారణాలన్నీ కలిపి ఆగస్టు 15న రావాల్సిన ఈ సినిమా దాదాపుగా వాయిదా పడినట్లే అంటున్నారు. రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తీస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' ఆరోజు విడుదల తేదీని ప్రకటించింది. దీంతో పుష్ప2 విడుదల వాయిదా పడినట్లేనని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications