అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్ లో మిస్సయిన బ్లాక్ బస్టర్

సినీ పరిశ్రమకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్ చిత్రాలను ఇచ్చి అందరినీ తనవైపు చూసేలా చేసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. మిర్చి తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనేనేను బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ తో తీసిన ఆచార్య మాత్రం బ్లాక్ బస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీనిపై చిరంజీవి పరోక్షంగా చాలా సందర్భాల్లో కొరటాల శివపై కామెంట్లు చేశాడుకానీ కొరటాల మాత్రం ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు.

కొరటాల తన మొదటి సినిమా మిర్చిని ప్రభాస్ తో తీశారు. వాస్తవానికి దీన్ని అల్లు అర్జున్ తో తీయాలని కథ చెప్పారు. బన్నీకి కూడా కథ బాగా నచ్చింది. అయితే అల్లు అరవింద్ మాత్రం కండిషన్లు పెట్టారు. స్క్రిప్ట్ విషయంలో కొంత మార్పులు చేర్పులు అవసరమన్నారు.

allu arjun and koratala shiva combination missed movie

అయితే తాను రాసుకున్న కథపై నమ్మకం ఉండటంతో మార్పులు చేర్పులు చేయనని కొరటాల చెప్పారు. దీంతో అల్లు అర్జున్ తో మిర్చి సినిమా మిస్సయింది. ఈ కథను తర్వాత డార్లింగ్ కు వినిపిస్తే వెంటనే ఓకే చేశాడు. ప్రభాస్ కెరీర్ నే టర్నింగ్ చేసిన మిర్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

చాలా సందర్భాల్లో అల్లు అర్జున్ కూడా తనకు కొరటాల శివతో సినిమా చేయాలనుందని బహిరంగంగా చెప్పేవారు. ప్రస్తుతం పుష్ప2 తర్వాత ఎవరితో సినిమా చేయాలా అనే డైలమాలో అల్లు అర్జున్ ఉన్నాడు. ఎందుకంటే త్రివిక్రమ్ గుంటూరు కారంతో ఫ్లాప్ ఇవ్వగా, దర్శకుడు అట్లీ చెప్పిన కథ మాత్రం బన్నీకి నచ్చలేదు.

కొరటాల శివ కథ చెప్పారంటున్నారుకానీ దీనిపై స్పష్టత రావడంలేదు. ఎందుకంటే తారక్ తో తీస్తున్న దేవర చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం విజయదశమికి విడుదల కాబోతోంది. రెండో భాగంపై కూడా దృష్టి సారించాల్సి ఉంది. మరి ఈలోగా అల్లు అర్జున్ తో కొరటాల సినిమా కుదురుతుందేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+