ఒకప్పుడు బాలకృష్ణతో రొమాన్స్ చేసింది.. కట్ చేస్తే ఆయన ఇంటికే కోడలుగా వెళ్లింది
ఒకప్పుడు బాలకృష్ణతో రొమాన్స్ చేసిన హీరోయిన్, తర్వాత వారి సన్నిహిత కుటుంబానికి కోడలుగా వెళ్లిన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఇంకెవరు మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1990ల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారామె. అగ్ర హీరోలతో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు.
ముఖ్యంగా చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. అంతే కాకుండా ఈ జోడికి మోస్ట్ హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపు వచ్చింది.ఇక బాలకృష్ణతో విజయశాంతి రిలేషన్ మెయిన్‌టైన్ చేశారనే రూమర్స్ కూడా తెర మీదకు వచ్చాయి.

శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని విజయశాంతి వివాహం చేసుకున్నారు. అయితే శ్రీనివాస్ ప్రసాద్ ఫ్యామిలీతో బాలకృష్ణకు దగ్గర సాన్నిహిత్యం ఉంది. బాలకృష్ణకు శ్రీనివాస్ ప్రసాద్ కొడుకు వరుస అవుతారు. అదేలా అంటే..బాలకృష్ణ పెద్ద బావ గణేష్ రావుకు శ్రీనివాస్ స్వయానా మేనల్లుడు. ఈయనకు బాలయ్యకు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఇలా బాలయ్య దగ్గర బంధువునే విజయశాంతి వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత విజయశాంతి లేడీ ఓరియేంటెడ్ సినిమాలు మాత్రమే చేశారు. హీరోలతో సమానంగా విజయశాంతి సినిమాలు తెరకెక్కాయి. దీంతో హీరోలతో సినిమాలు చేయడం ఆమె తగ్గించేశారు. ఇక రాజకీయాల్లో కూడా విజయశాంతి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మగా కీర్తి గడించారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీల్లో పని చేశారామె. ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications