అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు దిగొచ్చిన రాజేంద్రప్రసాద్
నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల 'పుష్ప-2' పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'హరికథ' వెబ్ సిరీస్ ఈవెంట్‌లో మాట్లాడుతూ..కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తున్నారు. నిన్న కాక మొన్న చూశాం, వాడెవడో చందనం దొంగ, వాడు హీరో. హీరోల్లో మీనింగ్ మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే, నేను 48 సంవత్సరాలుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్‌తో డిఫరెంట్ హీరో అనిపించుకున్నానని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతోనే అల్లు అర్జున్‌పై రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు రాజేంద్ర ప్రసాద్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

అప్పుల అప్పారావు, పేకాట పాపరావు అంటి సినిమాలన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలంటూ రాజేంద్ర ప్రసాద్‌కు చురకులు అంటించారు. తాజాగా దీనిపై రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ గురించి నేను ఎందుకు నెగిటివ్‌గా మాట్లాడతానని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్ నా బిడ్డండీ.. అల్లు అర్జున్ ఐ లవ్యూ. నేను అల్లు అర్జున్ గురించి నెగిటివ్‌గా మాట్లాడానని రాసిన రాతలు చూస్తే నవ్వు వచ్చిందని రాజేంద్ర ప్రసాద్‌కు చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ జర్నీ చూస్తే.. జులాయి ముందు.. జులాయి తర్వాత అని చెబుతుంటారు. అతను నన్ను ఎంత లవ్ చేస్తాడో మాటల్లో చెప్పలేను. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం కలిసి చేశాం. పుష్పకి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు గురువు గారూ.. గురువు గారూ నాకు నేషనల్ అవార్డ్ వచ్చిందని చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. వాడెవడో అజ్ఞానంతో అమాయకత్వంతో నన్ను నెగిటివ్ సైడ్ తీసుకెళ్లాలని చూసినా.. పొరపాటున కూడా మీరు వెళ్లొద్దంటే హితబోధ చేశారు రాజేంద్ర ప్రసాద్.












Click it and Unblock the Notifications