నో బెయిల్, సెంట్రల్ జైలుకే పరిమితం అయిన స్టార్ హీరో, అదే జైల్లో హీరోయిన్

రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్న శ్యాండిల్‌వుడ్ నటుడు దర్శన్ జైలులో ఉన్నారు. మరోసారి కోర్టు హీరో దర్శన్ జ్యుడీషియల్ కస్టడీ పొడగించింది. హత్యకేసులో ప్రమేయమున్న నిందితులందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నిందితులందరినీ జైలు సిబ్బంది వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా బెంగళూరులోని 24వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు.

ఈ సమయంలో న్యాయమూర్తి నిందితులందరి పేర్లను పిలిచారు. పేర్లు వినిపించడంతో నిందితులు చేతులు పైకి ఎత్తి ముందుకు వచ్చి నిలబడ్డారు. ఆ తర్వాత వారందరికీ ఆగస్టు 14వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి విశ్వనాథ్ సి. గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నిందితులు కోర్టుకు హాజరుకావడంతో మేజిస్ట్రేట్ కోర్టు వారందరికీ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.పరప్ప అగ్రహార జైలు, తుమకూరు జైలు నుంచి నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

Sandlewood hero Darshan s judicial remand extended by special court

నిందితుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడానికి పోలీసులు ఈ కారణాలను చెప్పారు. ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేయడం వలన కేసు దర్యాప్తుకు ఇబ్బంది కలిగిస్తుందని, నిందితులు సాక్షులను అడ్డుకునే అవకాశం కూడా ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోర్టుకు తెలిపారు.

అంతేకాకుండా సాంకేతిక సాక్ష్యాల పరిశీలనలో నిందితులందరి పాత్ర హత్య కేసులో నిర్ధారించబడింది అని, చాలా సాంకేతిక, శాస్త్రీయ ఆధారాల సమీక్ష జరుగుతోందని, కొన్నింటిని నిపుణుల సమీక్షకు పంపగా వాటి నివేదికలు రావాల్సి ఉందని, ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సీడీఆర్, డీవీఆర్ డేటా పునరుద్ధరణ పురోగతిలో ఉందని, ఈ డేటాను రాబట్టి నిందితులను విచారించడం పెండింగ్‌లో ఉందని, ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుల సాక్ష్యాధారాల సేకరణ కూడా పెండింగ్‌లో ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఈ కేసులో 164 స్టేట్‌మెంట్‌లు దాఖలు చేయాల్సి ఉందని, నిందితులు ప్రభావం, డబ్బు, హీరో దర్శన్ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉందని, వారికి బెయిల్ వస్తే సాక్ష్యాలను నాశనం చేయడానికి హీరో అభిమానులను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి అనే మాటను తోసిపుచ్చలేమని, దాంతో పాటు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణుల నివేదిక రావాల్సి ఉందని, నేరానికి ఉపయోగించిన వాహనంపై వేలిముద్రలు కనుగొన్నామని, దాని రికవరీ పెండింగ్‌లో ఉందని, ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇస్తే వారి పలుకుబడి, డబ్బు, అభిమానులు ఉపయోగించి సాక్షాలను నాశనం చేసే అవకాశం ఉందని అభిమానులు తెలిపారు. పోలీసులు వాదనలు విన్న కోర్టు నిందితులు ఎవ్వరికీ బెయిల్ మంజూరు చెయ్యలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+