రెమ్యునరేషన్ భారీగా పెంచిన సిద్ధు?
డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత తన పేరు కూడా పూర్తిగా మారిపోయింది. సిద్ధుకన్నా డీజే టిల్లు అనే పేరుతోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. యువతలో మంచి క్రేజ్ సొంతమైంది. అప్పటివరకు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన సిద్ధు డీజే టిల్లు తర్వాత పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా టిల్లు స్క్వేర్ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోందంటున్నారు. మరో రెండురోజులు లేదంటే మూడు రోజులు ఆగితో ఈ సినిమా విజయంపై ఓ స్పష్టత వస్తుంది.
వాస్తవానికి 2022లో విడుదలైన డీజే టిల్లు తర్వాత రూ.10 కోట్లు పారితోషిం తీసుకుంటున్నాడు. తాజాగా టిల్లు స్క్వేర్ విడుదలైన తర్వాత మరోసారి తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. కొందరు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు తీసుకుంటున్నాడని అంటుండగా, మరికొందరు మాత్రం ఏకంగా రూ.15 కోట్లకు తగ్గడంలేదంటున్నారు. ఇందులో పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

టిల్లు స్క్వేర్ చిత్రానికి మొదటిరోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు శ్రీలీలను ముందుగా హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. తర్వాత ఆమె తప్పుకోవడంతో అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు. అలాగే మొదట దర్శకుడు కూడా విమల్ కృష్ణ కాగా కొన్ని అభిప్రాయ భేదాలతో అతను తప్పుకోవడంతో మల్లిక్ ను ఎంపిక చేశారు.
అంతేకాదు.. టిల్లు స్క్వేర్ 2023 వేసవిలో విడుదల కావాల్సి ఉంది. అయితే అదే ఏడాది ఆగస్టుకు వాయిదా పడింది. తర్వాత పలు కారణాలతో వాయిదాలు పడుతూ ఫిబ్రవరి 9 దగ్గరకు వచ్చాడు. ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ ఇవ్వాలి కాబట్టి మార్చి 29కి మార్చుకున్నారు. అన్ని అడ్డంకులను దాటుకొని థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది.












Click it and Unblock the Notifications