వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందులో నిజంలేదు : కూలిన యుద్ధం విమానం పై చైనా క్లారిటీ

|
Google Oneindia TeluguNews

చైనా యుద్ధ విమానం ఒకటి తైవాన్ గగనతలంలోకి వచ్చిందని దీంతో తైవాన్ రక్షణ వ్యవస్థ ఆ ఫైటర్ జెట్‌ను కూల్చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. అయితే అప్పటికీ ఇరు దేశాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ వార్త నిజమేనంటూ చాలామంది భావించారు. అయితే సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తపై చైనా రక్షణ శాఖ స్పందించింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది.

చైనా యుద్ధ విమానం తైవాన్ గగనతలంలోకి ప్రవేశించిందని దీంతో తైవాన్ మిలటరీ దాన్ని కూల్చివేసిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ వార్తలను చైనా ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఖండించింది. ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేసి వారిని గందరగోళంకు గురిచేసే చర్యను ఖండిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ కమాండ్ స్పష్టం చేసింది. గగనతలంలో భద్రతను ప్రతిక్షణం సమీక్షిస్తున్నామని తమ ప్రధాన కార్యాలయం ఇదే పనిలో ఉందని ఎయిర్ ఫోర్స్ కమాండ్ స్పష్టం చేసింది. తైవాన్ స్ట్రయిట్ పై ఉన్న గగనతలంపు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. దుష్ప్రచారానికి అడ్డు కట్ట వేసేందుకు తప్పుడు వార్తలు వైరల్ కాకుండా చర్యలు తీసుకుంటామని ఈ క్రమంలోనే ప్రతి క్షణం అందే సమాచారంను షేర్ చేస్తామని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ వెల్లడించింది.

China condemns the news that Taiwan had shot down its Fighter jet, says its false

అంతకుముందు సోషల్ మీడియాలో మొత్తం కూలిన యుద్ధ విమానంపైనే చర్చ జరిగింది. ఇప్పుడు చైనా క్లారిటీ ఇవ్వడంతో తైవాన్ కూడా ఏమైనా అధికారిక ప్రకటన చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆ విమానం ఎక్కడ కూలింది .. ఏ దేశంలో జరిగింది అదే సమయంలో ఆ వీడియో ఎప్పటిది అనేది కూడా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Fact Check

వాదన

చైనా యుద్ధ విమానాన్ని తైవాన్ మిలటరీ కూల్చేసింది

వాస్తవం

వైరల్ అయిన వీడియో నిజం కాదన్న తైవాన్

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
News making rounds that China's Sukhoi fighter jet had been shot by Taiwan is false and that the Taiwan had condemned it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X