వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check : సెలవుపై 80 వేల సైనికులు వెనక్కి- భారత్‌-చైనా ఉద్రిక్తతలతో..

|
Google Oneindia TeluguNews

గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రస్తుతం భారత్‌-చైనా సై అంటే సై అంటున్నాయి. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో బలగాల ఉపసంహరణపై ఇరుదేశాల అధికారుల మధ్య చర్చలు జరిగినా అవి ఫలించలేదు. తాజాగా రష్యాలో భారత్‌-చైనా రక్షణ మంత్రుల భేటీలోనూ ఈ అంశంపై చర్చలు జరిగినా వాటి ఫలితాలు ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది.

చైనాతో సరిహద్దుల్లో నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యానికి చెందిన సైనికులు భారీగా వెనక్కి వెళ్లిపోతున్నారన్న ప్రచారం సాగుతోంది. దాదాపు 80 వేల మంది సైనికులు సెలవుపై స్వస్ధలాలకు వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 45 ఏళ్లలో తొలిసారిగా ఇలా జరుగుతోందంటూ సోషల్‌ మీడియాలో విపరీతంగా జరుగుతున్న ఈ ప్రచారంపై తాజాగా కేంద్రం స్పందించింది.

Fact Check : 80 thousand soldiers on sick leave amid border tensions with china

Recommended Video

COVID-19:కరోనా ను పుట్టించింది చైనా నే.. గుట్టు బయటపెడితే చంపేస్తాం అన్నారు! -Virologist Dr. Li-Meng

వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఘర్షణల నేపథ్యంలో 80 వేల మంది భారతీయ సైనికులు సిక్‌ లీవ్‌ తీసుకుని వెనక్కి వచ్చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా ప్రభుత్వ మీడియా సంస్ధ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఈ పుకార్లను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. భారతీయ సైనికులెవరూ ఇలాంటి కారణాలతో సెలవుకు దరఖాస్తు చేసుకోలేదని కేంద్రం తరఫున స్పష్టత ఇచ్చింది. అంతే కాదు ఇలాంటి ప్రచారాల పట్ల సైన్యం కూడా అప్రమత్తంగా ఉండాలని పీఐబీ కోరింది.

Fact Check

వాదన

భారత్ చైనా ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో సెలవుపై వెనక్కి వెళ్లిన 80వేల మంది సైనికులు

వాస్తవం

అలాంటిదేమీ లేదని స్పష్టత ఇచ్చిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
central government has denied rumours over 80 thousand soldiers goes on sick leave amid border tensions with china.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X