Fact Check : పాతపట్నం నీలమణి దుర్గ ఆలయం కూల్చివేత-అసలు నిజాలివే
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని నీలమణి దుర్గ ఆలయం కూల్చివేస్తున్నారంటూ ఇవాళ పలు మీడియా ఛానళ్లు, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిందాయి. వీటిపై స్పందించిన విపక్షాలు, పలు హిందూ సంస్ధలు పాతపట్నానికి వెళ్లి నానా హంగామా చేస్తున్నాయి. అసలు వాస్తవాల్ని కప్పిపుచ్చి వైసీపీ సర్కార్ ఆలయం కూల్చివేస్తోందంటూ దుష్ప్రచారానికి దిగాయి. దీంతో ప్రభుత్వం దీనిపై స్పందించింది.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం కూల్చివేత అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం అదే సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన ఈ వివరణతో విపక్షాలకు గట్టి షాక్ తగిలింది. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా అమ్మవారి ఆలయ ప్రహరీ గోడ, ఆలయం ముందున్న ఆర్చ్ లో కొంతమేర కూల్చివేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అంతే తప్ప అమ్మవారి ఆలయాన్ని ముట్టుకోలేదని ఫ్యాక్ట్ చెక్ లో వివరించింది. ఈ మేరకు జరుగుతున్న దుష్ప్ర్చచారాన్ని ప్రభుత్వం ఖండించింది.
Due to a proposed railway-flyover construction, a part of the compound wall and the arch at the front side of Sri Neelamani Durga Ammavari Temple had to be removed.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 24, 2021
Misleading posts on social media busted!
Read More: https://t.co/1BhfdnTyMU

నీలమణి దుర్గ ఆలయం కూల్చివేత పేరుతో విపక్షాలు నిన్నటి నుంచి నానా హంగామా చేస్తున్నాయి. దీనికి తగ్గినట్లుగానే బీజేపీ నేతలు ఇవాళ ఛలో పాతపట్నం పేరుతో ఆలయం వద్దకు కూడా వెళ్లేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలోనూ జనసేన, బీజేపీ, టీడీపీ ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ పలు పోస్టులు పెడుతున్నాయి. దీంతో వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇవాళ ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నీలమణి దుర్గ ఆలయానికి ఎలాంటి ముప్పు వాటిల్ల లేదని అందులో స్పష్టత ఇచ్చింది.

Fact Check
వాదన
పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారి ఆలయాన్ని కూల్చేస్తున్న వైసీపీ సర్కార్
వాస్తవం
నీలమణి దుర్గ ఆలయం ప్రహరీ గోడ, ఆర్చిలో కొంతభాగం మాత్రమే రైల్వే ఫ్లైవర్ కోసం కూల్చామన్న ప్రభుత్వం