ap news ap govt fact check tdp chandrababu ysrcp activist constable ఏపీ ప్రభుత్వం టీడీపీ చంద్రబాబు వైసీపీ కార్యకర్త politics
fact check : కానిస్టేబుల్‌పై వైసీపీ కార్యకర్త దాడి- చంద్రబాబు ట్వీట్ ఫేక్‌గా తేల్చిన పోలీసులు
విశాఖపట్నంలో తాజాగా జరిగిన ఓ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ట్వీట్ చేశారు. ఇందులో ఓ వైసీపీ కార్యకర్త కానిస్టేబుల్‌ను కొడుతున్నట్లుగా ఉంది. ఈ ఫొటోనూ కోట్ చేస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలు మితిమీరాయంటూ, ఏకంగా పోలీసుపైనే దాడులు జరుగుతున్నట్లు చంద్రబాబు అందులో వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ పోలీసు శాఖ గంటల్లోనే స్పందించింది.
చంద్రబాబు పెట్టిన ట్వీట్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వైసీపీ కార్యకర్త అడ్డుకున్న పోలీసును తల పట్టుకుని కొడుతున్నట్లుగా ఫొటోలో కనిపిస్తోంది. దీన్ని చూసిన వారికి నిజంగానే వైసీపీ కార్యకర్త కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్నాడా అన్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని నేరుగా మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు ట్వీట్ చేయడంతో జనం కూడా నిజమనే భావించారు.

విశాఖలో కానిస్టేబుల్‌పై వైసీపీ కార్యకర్త దాడి చేసినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన ట్వీట్ నకిలీగా ఏపీ పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఏపీ పోలీసు ట్విట్టర్ హ్యాండిల్లో ఫ్యాక్ట్ చెక్‌ను పెట్టారు. అందులో గౌరవనీయులైన విపక్ష నేత గారూ, మీరు పెట్టిన పోస్టు తప్పు. మీ ఆరోపణలు మరోసారి అబద్ధం. వైసీపీ కార్యకర్త కింద పడిపోయిన అధికారి గాయానికి మసాజ్ చేస్తున్నాడు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు సమాచారానికి దూరంగా ఉండాలని కోరుతున్నామంటూ అందులో పోలీసులు ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది కూడా వైరల్‌గా మారుతోంది.