వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

fact check : కానిస్టేబుల్‌పై వైసీపీ కార్యకర్త దాడి- చంద్రబాబు ట్వీట్‌ ఫేక్‌గా తేల్చిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నంలో తాజాగా జరిగిన ఓ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ట్వీట్‌ చేశారు. ఇందులో ఓ వైసీపీ కార్యకర్త కానిస్టేబుల్‌ను కొడుతున్నట్లుగా ఉంది. ఈ ఫొటోనూ కోట్‌ చేస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలు మితిమీరాయంటూ, ఏకంగా పోలీసుపైనే దాడులు జరుగుతున్నట్లు చంద్రబాబు అందులో వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ పోలీసు శాఖ గంటల్లోనే స్పందించింది.

చంద్రబాబు పెట్టిన ట్వీట్‌లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వైసీపీ కార్యకర్త అడ్డుకున్న పోలీసును తల పట్టుకుని కొడుతున్నట్లుగా ఫొటోలో కనిపిస్తోంది. దీన్ని చూసిన వారికి నిజంగానే వైసీపీ కార్యకర్త కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్నాడా అన్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని నేరుగా మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు ట్వీట్‌ చేయడంతో జనం కూడా నిజమనే భావించారు.

fact check : ap police says tdp chief chandrababus allegations on ysrcp activist is fake

విశాఖలో కానిస్టేబుల్‌పై వైసీపీ కార్యకర్త దాడి చేసినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన ట్వీట్‌ నకిలీగా ఏపీ పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఏపీ పోలీసు ట్విట్టర్‌ హ్యాండిల్లో ఫ్యాక్ట్‌ చెక్‌ను పెట్టారు. అందులో గౌరవనీయులైన విపక్ష నేత గారూ, మీరు పెట్టిన పోస్టు తప్పు. మీ ఆరోపణలు మరోసారి అబద్ధం. వైసీపీ కార్యకర్త కింద పడిపోయిన అధికారి గాయానికి మసాజ్‌ చేస్తున్నాడు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు సమాచారానికి దూరంగా ఉండాలని కోరుతున్నామంటూ అందులో పోలీసులు ట్వీట్‌ చేశారు. దీంతో ఇప్పుడు ఇది కూడా వైరల్‌గా మారుతోంది.

Fact Check

వాదన

విశాఖలో పోలీసు కానిస్టేబుల్‌పై వైసీపీ కార్యకర్త దాడి

వాస్తవం

విశాఖలో కింద పడిపోయిన కానిస్టేబుల్‌కు వైసీపీ కార్యకర్త సాయం చేస్తున్నట్లుగా తేల్చిన పోలీసులు

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
andhra pradesh police has clarified tdp chief chandrababu's allegations on ysrcp government based on a pic showing a ysrcp activist hitting constable in vizag. police says that it is fake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X