హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fact check : కరోనా వైరస్‌ను ఆస్పిరిన్‌తో నయం చేయవచ్చా...?

|
Google Oneindia TeluguNews

కోవిడ్ 19 బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందని... ఆస్పిరిన్ (ఆసిటైల్‌‌సలిసిలిక్ ఆమ్లం)తో ఆ వ్యాధిని నయం చేయవచ్చునని వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ చక్కర్లు కొడుతోంది. కోవిడ్ 19 అనేది వైరస్ కాదని బాక్టీరియా అని అందులో పేర్కొనడం గమనార్హం. ఈ బాక్టీరియా సోకితే శరీరంలో రక్తం గడ్డకట్టి మరణానికి దారితీస్తుందని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. అంతేకాదు,జర్మనీ ఇప్పటికే కోవిడ్ 19ని జయించిందని... ఆస్పిరిన్ లాంటి యాంటీబయాటిక్స్‌తో దాన్ని జయించవచ్చునని చెప్పుకొచ్చారు.

అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. కోవిడ్ 19 అనేది బాక్టీరియా కాదు వైరస్.ఇప్పటివరకూ దీనికి ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు దీనికి టీకా కనిపెట్టే ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. 2020 చివరి నాటికి లేదా 2021 ప్రారంభం నాటికి టీకాను అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి.

Fact check: Can aspirin cure COVID-19

ఆస్పిరిన్‌తో కోవిడ్ 19ని నయం చేయడం కూడా సాధ్యం కాదు. అయితే అనస్థీషియా&అనల్జీయా జర్నల్‌లో ఇటీవల ప్రచురించబడ్డ ఓ అధ్యయనం.. కరోనా వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్ ఇవ్వడం ద్వారా కొంతమేర ప్రయోజనం ఉంటుందని పేర్కొంది. అలా ఆస్పిరిన్ తీసుకున్నవారికి ఐసీయూ చికిత్స అవసరం 43శాతం తక్కువగా ఉంటుందని,మెకానికల్ వెంటిలేషన్‌ అవసరం 44శాతం తక్కువగా ఉంటుందని,ఆస్పత్రిలో మరణించే అవకాశం కూడా 47శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే ఈ అధ్యయనానికి వివిధ పరిమితులు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలి.

Fact Check

వాదన

కోవిడ్ 19 బాక్టీరియా వల్ల వస్తుంది. ఆస్పిరిన్‌తో దాన్ని నయం చేయవచ్చు.

వాస్తవం

కోవిడ్ 19 ఒక వైరస్. ఇప్పటివరకూ దీనికి చికిత్స అందుబాటులో లేదు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
There is a claim being made on a WhatsApp forward that Coronavirus is a bacterial and can be cured with Aspirin. It is claimed that it is not a virus and a bacteria that is causing death. It leads to formation of blood clots and results in the death of the patient. Further, it says that Germany has defeated COVID-19. And the way to deal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X