వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check:కేంద్ర ప్రభుత్వం ప్రతి బాలిక ఖాతాలో రూ.2వేలు వేస్తోందా..?

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి కన్య ఆయుష్ యోజనా పథకం కింద ప్రతి ఆడపిల్లకు కేంద్రం రూ.2వేలు ఆ బాలిక ఖాతాలోకి బదిలీ చేస్తోందంటూ వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై యూట్యూబ్‌లో ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఫిబ్రవరిలో పోస్టు చేసిన ఈ వీడియోకు దాదాపు 2వేల వ్యూస్ కూడా వచ్చాయి. ఈ వీడియోను కన్నడంలో చేశారు. ఇందులో ఓ మహిళ ఈ పథకం గురించి వివరిస్తుంది. వాయిస్ ఓవర్ ఇస్తుండగా ఆడపిల్లల ఫోటోలు వీడియోలో కనిపిస్తాయి. ఇక ఇదే అంశం వాట్సాప్‌లలో కూడా చక్కర్లు కొడుతోంది.

బాలిక ఖాతాలోకి రూ.2వేలు జమ కావాలంటే అర్హతలు ఇవే నంటూ మరో మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. బాలిక భారత పౌరురాలై ఉండాలని, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండటంతో పాటు బ్యాంకు ఖాతా కూడా కలిగి ఉండాలని ఆ మెసేజ్‌లో ఉంది. ఇక మొబైల్ నెంబర్, జనన ధృవీకరణ పత్రం ఉండటంతో పాటు ఈ పథకానికి అర్హులు కనీసం 18 ఏళ్ల వయసున్న వారై ఉండాలని మెసేజ్‌లో ఉంది. పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి తెలుసుకోవాలంటూ వైరల్ అవుతున్న మెసేజ్‌లో ఉంది.

Fact Check:Central govt giving money to girls under PM Kanya Ayush Yojana is False says PIB

వైరల్ అవుతున్న వీడియో , వాట్సాప్‌ మెసేజ్‌పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టత ఇచ్చింది. ప్రధాన మంత్రి కన్య ఆయుష్ యోజన కింద కేంద్రం రూ.2వేలు ఇస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చేసింది. అలాంటి ఒక పథకం ఇప్పటి వరకు లేదని వెల్లడించింది. అంతకుముందు కూడా ప్రధాన మంత్రి కళ్యాణ్ ఆశీర్వాద్ యోజన పథకం కింద అమ్మాయిలకు రూ.2వేలు కేంద్రం ఇస్తోందంటూ ఇలాంటి వార్తే ఒకటి ప్రచారం జరిగింది. లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పేరుతో ఈ వార్త వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమాభివృద్ధి శాఖ వెబ్‌సైట్‌పై ఇలాంటి పథకం ఒకటి ఉందని ఎక్కడా కనిపించలేదు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి బాలికకు రూ.2000 పథకం ప్రారంభించలేదని ఇలాంటి వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది.

Fact Check

వాదన

ప్రధానమంత్రి కన్య ఆయుష్ యోజన పథకం కింద ప్రతి బాలికకు రూ.2వేలు

వాస్తవం

కేంద్రం ప్రధానమంత్రి కన్య ఆయుష్ యోజన కింద ఎలాంటి డబ్బులు ఇవ్వడం లేదు

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
A message went viral on social media claiming that central govt is giving Rs 2000 to all girl children under the PM Kanya Ayush Yojana where such scheme doesn't exist.The same was clarified by PIB fact check.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X