Fact Check : దావూద్ ఇబ్రహీంతో అమితాబ్ బచ్చన్... ఆ ఫోటోలో నిజమెంత..?
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ షేక్ హ్యాండ్ ఇస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదట ఫేస్బుక్లో ప్రత్యక్షమైన ఆ ఫోటో ఆ తర్వాత ట్విట్టర్లో వైరల్ అయింది. అయితే ఇందులో నిజమెంత... బిగ్ బి నిజంగానే దావూద్‌ని కలిశాడా...?
అంటే నో అనే సమాధానమే వస్తోంది.
నిజానికి ఈ ఫోటోలో ఉన్నది దావూద్ ఇబ్రహీం కాదు. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ సందర్భంగా అశోక్ చవాన్‌కు బిగ్ బి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనూహ్యంగా ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చాలామంది ఆయన్ను దావూద్ ఇబ్రహీం అని పొరపడుతున్నారు.

ఇటీవల జయా బచ్చన్ రాజ్యసభలో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడినప్పటి నుంచి బచ్చన్ ఫ్యామిలీ తరుచూ వార్తల్లో కనిపిస్తూనే ఉంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ లింకులను బాలీవుడ్ మొత్తానికి ఆపాదించవద్దని జయాబచ్చన్ అన్నారు. ఆమె వ్యాఖ్యలకు కొంతమంది మద్దతునివ్వగా... మరికొంతమంది విబేధించిన సంగతి తెలిసిందే.

Fact Check
వాదన
దావూద్ ఇబ్రహీంకు అమితాబ్ బచ్చన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు
వాస్తవం
ఆ ఫోటోలో ఉన్నది మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్. బిగ్ బి అమితాబ్ చవాన్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో అది.