హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fact check : రోడ్డు దాటుతున్న ట్రాఫిక్ సిగ్నల్.. అది హైదరాబాద్‌లోనే జరిగిందా?

|
Google Oneindia TeluguNews

రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ఎంతలా అతలాకుతలం చేశాయో తెలిసిందే. నాలాలు,డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న దృశ్యాలు, వరద నీళ్లలో మనుషులు గల్లంతైన దృశ్యాలు,కార్లు ఇతర వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయిన దృశ్యాలు... ఇలా వర్ష బీభత్సానికి సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్ వరదలకు ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కూడా కొట్టుకుపోతున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ట్రాఫిక్ సిగ్నల్ రోడ్డు దాటడం చూస్తున్నానంటూ ఓ నెటిజన్ దీనిపై ఫన్నీ కామెంట్ చేశాడు.

అయితే హైదరాబాద్‌లో వరద నీళ్లకు నిజంగానే ఆ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కొట్టుకుపోయిందా...?ఇదంతా నిజమేనా..? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి ఇది జరిగింది చైనాలోని యులిన్ నగరంలో. రెండేళ్ల క్రితం అక్కడ కురిసిన అతి భారీ వర్షాలకు సిగ్నల్ పాయింట్ సైతం నీళ్లలో కొట్టుకుపోయింది. అదే వీడియోను ఇప్పుడు కొంతమంది నెటిజెన్స్ #Hyderabadrains పేరుతో షేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేసేవాళ్లు ఇది హైదరాబాద్‌కి సంబంధించి కాదని గమనించాల్సి ఉంటుంది.

Fact check: Did the signal cross the road in Hyderabad

కాగా,హైదరాబాద్‌ సహా తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు దాదాపు 50 మంది మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో 1908 తర్వాత హైదరాబాద్ నగరం వర్షాలకు ఇంతలా అతలాకుతలమవడం ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో ఒకేరోజు 31సెం.మీ వర్షపాతం నమోదవడంతో నగరం చిగురుటాకులా వణికిపోయింది. గురు,శుక్రవారాల్లో వాన కాస్త తెరిపినివ్వడంతో ఇప్పుడిప్పుడే వర్ష బీభత్సం నుంచి నగరం బయటపడుతోంది.

Fact Check

వాదన

హైదరాబాద్‌ వరదల్లో ట్రాఫిక్ సిగ్నల్ కొట్టుకుపోతున్నట్లుగా ఓ వీడియో వైరల్

వాస్తవం

ఇది జరిగింది హైదరాబాద్‌లో కాదు.. చైనాలోని యులిన్ నగరంలో..

రేటింగ్

Half True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
The rains have caused havoc in many parts of the country. Rains in Telangana and its capital Hyderabad have claimed 30 lives so far. Amidst this chaos, a video of a traffic signal post floating down a waterlogged street has gone viral. This has been shared by many users. One user in fact wrote, 'first time in history. Signal crossing the road #Hyderabad rains.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X