హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fact check : ఫుడ్ బిజినెస్ వ్యాపారులకు ఆ లైసెన్స్ తప్పనిసరా...?

|
Google Oneindia TeluguNews

దేశంలో ఉన్న ఫుడ్ బిజినెస్ వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని ఇటీవల ఓ పత్రిక ప్రచురించిన కథనం చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఫుడ్ వ్యాపారులంతా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ కలిగి ఉండాల్సిందేనా... ఇందులో నిజమెంత..

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం... ఇందులో ఏమాత్రం నిజం లేదు. కేవలం రూ.20కోట్లు వార్షిక ఆదాయం కలిగిన ఫుట్ వ్యాపారులు మాత్రమే ఆ లైసెన్స్ కలిగి ఉండాలి. ఆ పత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని పీఐబీ పేర్కొంది.

 Fact check: Do all food business operators have to get licence from FSSAI

కాగా,ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 70లక్షల లైసెన్సులు జారీ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) వెల్లడించింది. త్వరలోనే అప్‌డేటెడ్ ఆన్‌లైన్ వేదిక ( URL - https://foscos.fssai.gov.in)ను ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న (URL - https://foodlicensing.fssai.gov.in) వెబ్‌సైట్‌ను కొత్తదానితో రీప్లేస్ చేయబోతున్నట్లు తెలిపింది. ఆహార భద్రత వర్తింపు వ్యవస్థ(FoSCoS) నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇప్పటికే తమిళనాడు,ఢిల్లీ,ఒడిశా,చంఢీగఢ్,గోవా,మణిపూర్,పుదుచ్చేరి,లదాఖ్ రాష్ట్రాల్లో జూన్ నుంచి ఇది అమలులోకి వచ్చింది.

Fact Check

వాదన

ఫుడ్ బిజినెస్ వ్యాపారులంతా FSSAI లైసెన్స్ పొందాలి.

వాస్తవం

కేవలం రూ.20కోట్లు టర్నోవర్ దాటిన వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

రేటింగ్

Half True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
A claim has been made by a newspaper that all food business operators have to get licence from the Food Safety and Standards Authority of India (FSSAI).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X