వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check:మీ ప్రాంతంలో మొబైల్ టవర్‌ను నిర్మించేందుకు టెలికాంశాఖ ఎన్‌ఓసీ ఇస్తోందా..?

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొబైల్ టవర్లను నిర్మిస్తే కేంద్ర టెలికాంశాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తోందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలో ఈ విధంగా ఉంది. టెలికాం శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం మనం నివసిస్తున్న ప్రాంతంలోనే మొబైల్ టవర్ల నిర్మాణంకు అనుమతి ఇస్తోందని ఇందుకోసం ఆ స్థలం యజమాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ వద్ద రూ.3300 చెల్లించాల్సి ఉంటుందనే వార్త వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతోంది.

అంతేకాదు తాము భూస్వామితో చేసుకున్న ఒప్పందంకు సంబంధించిన కాపీ కూడా తమకు అందిందని ఆ కాపీ కూడా ఇదేనంటూ వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు టవర్‌ ఫలానా ప్రాంతంలో ఏర్పాటు చేసుకునేందుకు ప్రాంతం అనువుగా ఉందని పేర్కొంటూ ఇంజినీర్ ఇచ్చే సర్టిఫికేట్ కూడా అందిందంటూ ప్రచారంలో ఉంది. ఇక ఈ రెండు సర్టిఫికేట్లు తమకు అందినందున టెలికాం చట్టం 1972 ప్రకారం అక్కడ టవర్‌ను ఏర్పాటు చేస్తామంటూ మొబైల్ కంపెనీ అంగీకారం తెలుపుతోందంటూ ఈ వార్తలో ఉంది. ఈ తరహా వార్త వాట్సాప్‌లపై విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Fact Check:DoT is not providing any NOC to install Mobile towers in your location

ఇక ఈ నోటీసును వాట్సాప్‌లో చూసిన చాలామంది నిజమేనేమో అని అనుకున్నారు. అయితే వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న వార్తలో నిజమెంతా అనే దానిపై మాకు అందుబాటులో ఉన్న వారితో సర్టిఫికేట్ ఎంతవరకు నిజమనేదానిపై విచారణ చేయడం జరిగింది. అయితే ఇలాంటి సర్టిఫికేట్ అసలు లేదని టెలికాంశాఖ వివరణ ఇచ్చింది. ఇలాంటి వార్తలను నమ్మకూడదని టెలికాంశాఖ వెల్లడించింది. తప్పుడు వార్తలను నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దని టెలికాం శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

ఇలాంటి నోటీసులు చూసి డబ్బులు చెల్లించినట్లు తమ వద్దకు ఆన్‌లైన్ ద్వారా చాలా ఫిర్యాదులు వచ్చాయని టెలికాం శాఖ అధికారులు చెప్పారు. వాట్సాప్‌లో ఇతర సోషల్ మీడియా సైట్స్‌లో చక్కర్లు కొడుతోన్న ఈ వార్తలో నిజంలేదని అలాంటి సర్టిఫికేట్ బూటకమని తేల్చేసింది.

Fact Check

వాదన

మొబైల్ టవర్స్‌ నిర్మాణంకు కేంద్ర టెలికాం శాఖ ఎన్ఓసీ ఇస్తోంది

వాస్తవం

మొబైల్ టవర్స్ నిర్మాణంకు టెలికాంశాఖ ఎలాంటి ఎన్‌ఓసీలు జారీ చేయడం లేదు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
There is a certificate that is in circulation that says that the Department of Telecommunications is providing no objection certificates to install mobile towers at various locations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X